Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with nagarjuna

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష : మనం

Movie Review - Manam

చిత్రం: మనం
తారాగణం: అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, శ్రియ, నాగచైతన్య, సమంత, పోసాని, లావణ్యా త్రిపాఠి తదితరులు
చాయాగ్రహణం: పి ఎస్ వినోద్
కూర్పు: ప్రవీణ్ పూడి
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత: నాగార్జున
దర్శకత్వం: విక్రం కె కుమార్
విడుదల: 23 మే 2014


క్లుప్తంగా చెప్పాలంటే:
నాగేశ్వర రావు (నాగార్జున) చిన్న తనంలోనే ఒక యాక్సిడెంట్ లో తన తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంటాడు. క్రమంగా ఎదిగి ఒక బడా వ్యాపారవేత్త అవుతాడు. అనుకోకుండా నాగార్జున (నాగ చైతన్య), ప్రియ (సమంత) అతని జీవితంలోకి వస్తారు. వాళ్ళే మళ్లీ పుట్టిన తన అమ్మా,నాన్న అనుకుంటాడు నాగేశ్వర రావు. ఇదిలా ఉండగా నాగేశ్వరరావుకు ఆత్మబంధువుగా అంజలి (శ్రేయ) కలుస్తుంది. వీళ్లిద్దరు కలిసి కాపాడిన ఒక పేషంటే చైతన్య (నాగేశ్వర రావు). ఇంతకీ ఎవరీ చైతన్య? ఏమిటా కథ తెరపై చూడండి.

మొత్తంగా చెప్పాలంటే:
ఇది దర్శకుడు విక్రం కె కుమార్ కి పట్టిన అదృష్టం. మూడు తరాల హీరోల సినిమా, అది కూడా అక్కినేని ఫ్యామిలీతో పనిచేయడం అనేది రాసుంటే తప్ప జరగదు. అయితే వచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవడంలో విక్రం కృషి చాలా ఉంది. ఆద్యంతం ఒక ఎమోషన్ నింపి, అక్కడక్కడా నవ్విస్తూ, కొన్ని చోట్ల కంటతడి పెట్టిస్తూ సాగే ఈ సినిమా ఇంచుమించు ప్రతి తెలుగు వాడు చూస్తాడనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఇది ఏయన్నార్ చివరి చిత్రం కాబట్టి చూసి తీరాలని తీర్మానించుకున్నవారూ చాలామందే ఉన్నారు.

అక్కడక్కడ కొంత నెమ్మదిగా నడవడం, మాస్ ప్రేక్షకులు కోరుకునే సెపెరేట్ కామెడీ లేకపోవడం తప్ప ఈ చిత్రంలో ఇది లేదు అని చెప్పడానికి ఏదీ లేదు. నాగార్జున నటన ఈ చిత్రంలో హైలైట్. నాగేశ్వర రావు గారి నటన గురించి చెప్పాలంటే నిజానికి ఏ సమీక్షకుడికి ఏజ్ గాని, గేజ్ గాని సరిపోదు. అయనొక అద్భుతం అంతే. అఖిల్ ఎంట్రీ బాగుంది. అమల, అమితాబ్ అతిథి పాత్రల్లో అలా మెరిసి మాయమౌతారు.

.
సాంకేతికంగా అన్ని అంశాల్లోనూ గొప్పగా ఉంది.

ఒక్క వాక్యంలో చెప్పాలంటే: మనలో ఎవరం కూడా నాగేశ్వర రావు గారి మొదటి సినిమా చూడలేదన్నది వాస్తవం - కనీసం ఈ చివరి చిత్రమైనా సినిమా హాల్ లో చూస్తే అదే మనం వారికిచ్చే నివాళి

ఒక్క మాటలో చెప్పాలంటే: మిస్ అవకుండా చూడండి.

అంకెల్లో చెప్పాలంటే: 3.75/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka