Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
raja music muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

సూత్రాన్ని తిరగేసిన శ్రీనువైట్ల

sreenu vaitla revrsed the formula

ఒకానొక కాలంలో హీరో పక్కన ప్యాడిరగ్‌ ఆర్టిస్టులు ఉండేవారు. సహ నటుడు, హాస్యగాడు ఇలా కొందరు హీరో చుట్టూ ఉండి, హీరో పాత్రకు ఇంకొంచెం ‘గొప్ప’ను కల్పించేవారు. కానీ శ్రీనువైట్ల సినిమాల్లో హీరో పాత్ర, చుట్టూ వుండే ప్యాడిరగ్‌ ఆర్టిస్టుల తీరు ఆశ్చర్యం గొలుపుతోంది. హీరో పాత్రను మించి ప్యాడిరగ్‌ ఆర్టిస్టులకు వెయిట్‌ పెరిగిపోతోంది.

‘బాద్‌షా’ సినిమానే తీసుకుంటే ఎన్టీఆర్‌ని అతనెంత పవర్‌ఫుల్‌గా చూపించినా, కొన్ని సన్నివేశాల్లో కమెడియన్‌ బ్రహ్మానందానికి ప్యాడిరగ్‌ ఆర్టిస్టుగా ఎన్టీఆర్‌ మారిపోయాడు. హాస్యం కోసం చిన్న చిన్నగా అలాంటి సన్నివేశాలు వుంటే తప్పులేదుగానీ, సినిమాకి ఆ సన్నివేశాలే హైలైట్‌ అవుతుంటే హీరోని ప్యాడిరగ్‌ ఆర్టిస్టుగా చూడలేకపోతున్నాం.

‘రెడీ’ సినిమా విషయాన్ని తీసుకుంటే హీరో రామ్ కి అప్పుడంత స్టార్‌డమ్‌ లేదు కాబట్టి, ఆ సినిమాలో బాగా వర్కవుట్‌ అవుతోంది. ఆ తర్వాత వచ్చిన శ్రీనువైట్ల సినిమాలన్నీ ఇంచుమించుగా ఒకే ఫార్ములాతో నడుస్తున్నాయి. హీరో చుట్టూ కమెడియన్లు, కమెడియన్లతో హీరో ఆట.. హీరోతో కమెడియన్ల ఆట. ఏ హీరో అయినా ఒకటే ఫార్ముల ఉపయోగిస్తున్న శ్రీనువైట్ల, హీరోయిజాన్ని కొన్ని సీన్స్‌లో బాగా ఎలివేట్‌ చేయగలుగుతున్నా చాలా సన్నివేశాల్లో రివర్స్‌ గ్రాఫ్‌ చూపించేస్తున్నాడు.

హీరోలెవరు, ప్యాడిరగ్‌ ఆర్టిస్టులెవరు అనుకునేలా శ్రీనువైట్ల సినిమాలు వుంటున్నాయనే విమర్శ ఒకటుంది. చూస్తుంటే హీరోలు ప్యాడిరగ్‌ ఆర్టిస్ట్ల విషయంలో ఒకప్పటి సూత్రాన్ని శ్రీనువైట్ల తిరగేశాడనే అనిపిస్తోంది. సక్సెస్‌ వస్తోంది కాబట్టి ఆ సూత్రం ఫాలో అవుతున్నా, రొటీన్‌ అని బోర్‌ కొట్టేసే ప్రమాదం ఉంది.

మరిన్ని సినిమా కబుర్లు
veteran beauty is busy