Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
veteran beauty is busy

ఈ సంచికలో >> సినిమా >>

పూరి మహేష్‌ మళ్ళీ...

puri again with mahesh

సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న మహేష్‌, ఆ తర్వాత శ్రీనువైట్ల డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాల్సి వుంది. ఆ సినిమా టైటిల్‌ ‘ఆగడు’. అదింకా సెట్స్‌పైకి రావడానికి చాలా టైమ్‌ పడుతుందట. ఈలోగా సుకుమార్‌ సినిమా పూర్తయిపోతుంది. మధ్యలో కొంచెం గ్యాప్‌ వస్తుంది గనుక, ఆ గ్యాప్‌లో పూరితో సినిమా చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచన మహేష్‌లో మెదిలిందని ఫిలిం సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు.

పూరి డైరెక్షన్‌లో మహేష్‌ రెండు సినిమాలు చేశాడు. ఒకటి ‘పోకిరి’, రెండోది ‘బిజినెస్‌మేన్‌’. ఈ రెండు సినిమాలూ విజయవంతమయ్యాయి. పైగా ‘బిజినెస్‌మేన్‌’ని చాలా స్పీడుగా చేసేశాడు పూరి. దాంతో రెండు నెలలు టైమ్‌ ఇస్తే మహేష్‌తో సినిమా చేసేయడానికి పూరీ కూడా సిద్ధమే అనుకోవచ్చు.

మహేష్‌ మదిలోనూ పూరితో చేసే ఆలోచన వుంది కాబట్టి, అనూహ్యంగా ఈ కాంబినేషన్‌లో మరో సినిమా ఏ క్షణాన అనౌన్స్‌ అయ్యే అవకాశమూ లేకపోలేదు. పూరితో మహేష్‌ సినిమా చేయడమంటే మహేష్‌ అభిమానులకీ సంబరమే. దీనిపై పూరి మహేష్‌ ఓ నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది.

మరిన్ని సినిమా కబుర్లు
nuvve kaavaali scene