Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
puri again with mahesh

ఈ సంచికలో >> సినిమా >>

‘నువ్వేకావాలి’ గురించి ఓ విషయం

nuvve kaavaali scene

బాల నటుడు తరుణ్‌ని హీరోని చేసిన సినిమా ‘నువ్వేకావాలి’. రామోజీరావు నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు విజయ్‌భాస్కర్‌. ఈ సినిమా అప్పట్లో చాలా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాలోని పాటలు, డైలాగులు, సన్నివేశాలు ఇప్పటికీ మర్చిపోలేం. అంతగా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిందీ సినిమా.

సినిమా క్లయిమాక్స్‌లో వచ్చే ఓ సన్నివేశంలో హీరో, హీరోయిన్‌ని కౌగలించుకుంటాడు. ఆ సమయంలో హీరో కళ్ళ వెంబడి నీళ్ళు ధారలా కారిపోతాయి. సన్నివేశం చిత్రీకరించే సమయంలో, దర్శక నిర్మాతలకి చాలా పెద్ద డౌట్‌ వచ్చింది. అదేంటంటే, హీరో అంటే స్ట్రాంగ్‌గా వుండాలి, అలాంటిది హీరో కన్నీళ్ళు పెడితే ఎలాగని.

ఈ విషయం యూనిట్‌ సభ్యులతో కాకుండా వేరేవారితో చర్చించారట. అయితే సన్నివేశానికి వున్న ప్రాధాన్యత దృష్ట్యా, ఆ సన్నివేశంలో హీరో కన్నీళ్ళు పెట్టడం సహజమేననీ, అది భావోద్వేగాలతో కూడినదే తప్ప, ఇంకోటి కాదనే అభిప్రాయం వేరే వారి నుంచి రావడంతో ఆ సన్నివేశాన్ని సినిమాలో యధాతథంగా వుంచేశారు.

సినిమా విషయంలో ఇంత జాగ్రత్తలు తీసుకోబట్టే ఆ సినిమా అంత గొప్ప విజయాన్ని సాధించింది. చిన్న విషయంలా కనిపిస్తున్నా, సినిమా పట్ల అంత అంకిత భావం ప్రదర్శించేవారు అప్పట్లో అన్న సంగతి ఇక్కడ అర్థం చేసుకోవాలి.

మరిన్ని సినిమా కబుర్లు
hot item song in satya-2