Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
manthralayam tourism

ఈ సంచికలో >> శీర్షికలు >>

దుళ్ళు కూర - పి. శ్రీనివాసు

"దుళ్ళు కూర"
బంగాళా దుంపలు ఉడికించుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. అందులోనే పసుపు వేసి ఉంచుకోవాలి. బాణీలో నూనె వేసి, కాగాకా ఉల్లిపాయ,పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినపప్పు, కరివేపాకు తో పోపువేయాలి. పోపు చిటపటలాడాకా బంగాళాదుంప పొడిని వేసి కలుపుకోవాలి. ఉప్పు, కొద్దిగా కారం, నిమ్మరసం వేసి దింపుకుంటే చక్కటి దుళ్ళు కూర రెడీ!




"వంకాయ చికెన్"
ఉల్లి, పచ్చిమిర్చి వేగాకా, అల్లం వెల్లుల్లి వేసి అందులో చికెన్, వంకాయ ముక్కలు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. ఉప్పు, కారం వేసి కలిపి మళ్ళీ మూతపెట్టాలి. నీరు వేయాల్సిన అవసరం ఉండదు కానీ కొద్దిగా చల్లుకుంటే మంచిది. చికెన్ ఉడికాక, గరం మసాలా పౌడర్, కొత్తిమీర వేసి దింపుకుంటే 'వంకాయ - చికెన్' రెడీ!!

మరిన్ని శీర్షికలు