Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
O college droup out  premakatha

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

ajent ekambar

ఆదివారం ఏకాంబర్ అనుకున్న దానికంటే ఎక్కువమందే యువతీయువకులు ఇంటర్వ్యూకొచ్చారు. ఏకాంబర్ ఇచ్చిన ప్రకటన కూడా ఆకర్షణీయంగా ఉండడంతో డిగ్రీలు, పి.జీ లు, చివరికి బిటెక్ చేసిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూకొచ్చారు.

అప్పటికే నూకరత్నం పేరు మీద పేరున్న చిట్ ఫండ్ కంపెనీల్లో ఏజెన్సీ తీసుకున్నాడు. కొత్తగా ప్రారంభించిన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 'బిజినెస్ డెవలప్ మెంట్ అఫీసర్ ' పేరు మీద కమీషన్ ప్రాతిపదికన డిగ్రీ అయిన వాళ్ళకు ఏరియాల వారీగా నియమిస్తున్నారని తెలిసి నూకరత్నాన్ని తీసుకువెళ్ళి అక్కడ కూడా జాయిన్ చేసాడు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీని రెండు పెద్ద బ్యాంకులు కలిసి ప్రారంభించాయి. సెల్ ఫోన్ కంపెనీల బకాయిలు ' రికవరీ ' చేసే బాధ్యత కూడా ' ఫ్రాంచైజీ ' తీసుకున్నాడు ఏకాంబర్.

ఆ వారంలోనే ' ఎక్కడ కమీషన్ ' వస్తుందో... ఏ వ్యాపారం సులువుగా చెయ్యొచ్చో గ్రహించిన ఏకాంబర్ అన్నిట్లోనూ ' నూకారత్నాన్ని ' చేర్చాడు.

అయితే, నూకరత్నం దానికి అడ్డు చెప్పలేదు. ఆశ్చర్యంగా ఏకాంబర్ కేసి చూసిందేగాని దేనికీ అడ్డుచెప్పలేదు. ఏకాంబర్ వ్యవహారం పూర్తిగా అర్ధంచేసుకుంది ఆమె. సమర్ధుడైనవాడు, సమస్యనైనా, సంపాదనైనా తెలివిగా, తేలిగ్గానే సాధిస్తాడు.

తను తీసుకున్న ఫ్రాంచైజీలనన్నీ దృష్టిలో పెట్టుకుని పదిమందిని చాకుల్లాంటి వారిని ఎంచుకుని జాయిన్ చేసుకున్నాడు ఏకాంబర్. మిగతా వారిని కూడా నిరుత్సాహపరచకుండా అందరి ఫోను నెంబర్లు తీసుకుని అవసరమైతే కబురు చేస్తానని చెప్పాడు.

ఏకాంబర్ మిత్ర బృందం కూడా ఆదివారం అంతా అక్కడే గడిపారు. యువతీయువకుల ఎంపికలో వారు కూడా సహాయపడ్డారు. నూకరత్నం మాత్రం బొమ్మలా అంతా చూస్తూనే కూర్చుంది.

ఎంపికైన వాళ్ళందర్ని కూర్చోబెట్టి తమ దగ్గర వాళ్ళు చేసిన పనికి జీతంతో పాటు ఇన్సెంటివ్ కూడా ఇస్తామని, ఎవరు ఎంత చురుగ్గా పనిచేస్తే అంత ఎక్కువ సంపాదించవచ్చని చెప్పాడు.

ఒక్క జీతమే కాకుండా తాము పడ్డ కష్టానికి ' ఇన్సెంటివ్ ' కూడా ఇస్తామనడం వారందరికి ఎంతో బాగా నచ్చింది.
ఆ రోజు సాయంత్రమే అందరికీ తమ వ్యాపార వివరాలు, పనుల్లో మెలకువలు వగైరా ఎన్నో విషయాలు వివరిస్తామని చెప్పి వాళ్ళను ఇళ్ళకు పంపేసాడు ఏకాంబర్.

సాయంత్రం ఆరుగంటలకల్లా అందరూ వచ్చి చేరుకున్నారు.

ఉదయం నుండి ఏకాంబరాన్నే అవటి పెట్టుకున్న మిత్రులంతా మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి సాయంత్రం వరకూ కాలక్షేపం చేసేసారు. నూకరత్నంతో పాటు మిగతా ముగ్గురు అమ్మాయిలు, ఏకాంబర్ మిత్ర బృందంతో పాటు అప్పుడే అక్కడకు వచ్చిన రాజనాల రాజేంద్ర కూడా కుర్చీల్లో కూర్చున్నారు. 

వారికి ఎదురుగా ఏకాంబర్ ఒక్కడే లీడర్ కు మల్లే కూర్చున్నాడు. అతని ప్రక్కన రెండు కుర్చీలు వేయించాడు. ఈలోగా వాచ్ మెన్ భార్య అందరికీ ' టీ 'లు తెచ్చి ఇచ్చింది. అందరూ ' టీ ' కప్పులు ఖాళీ చేసే పనిలో ఉన్నారు.

ఏకాంబర్ లేచి నిలబడి హేండ్ మైక్ పట్టుకున్నాడు. బ్యాటరీ తో నడిచే చిన్న సైజు మైకు. చిన్న చిన్న వీధి సభల్లో వాడే బ్యాటరీ మైక్ సెట్ అది. దానికి టేప్ రికార్డర్ తో అనుసంధానించి సౌండ్ బాక్స్ లు ఏర్పాటు చేసారు. "నిరుద్యోగంలో నుండి ' సద్యోగం ' లోకి విచ్చేస్తున్న యువతీయువకులకు స్వాగతం. ' సద్యోగం ' ఎందుకన్నానంటే రోజుకు ' ఎనిమిది గంటలు ' లెక్కల మీదే చేసి ' వెట్టిచాకిరీ ' ఉద్యోగం కాదు ఇది. మీకు నచ్చినంత సేపు నచ్చినంత కష్టపడే మీ మనసు మెచ్చిన పని ఇది. దీనికి నెలకి ఇంత ' ఆదాయం అని లేదు. మీరు ' పని చేసే ' విధానం మీద అధారపడి ఆదాయం వస్తుంది. ఏదో ' ఫైనాన్స్ కంపెనీ ' లా డిపాజిట్లు, మనీ సర్క్యులేషన్ స్కీముల్లాంటి మోసపూరితమైన పని కూడా కాదు ఇది.

ఇక్కడ మీరు చేయవలసిందల్లా ' సెల్ ఫోన్ ల కంపెనీ ' ల తరపున వాయిదా వసూలు ఏజెంట్లుగా, చిట్ ఫండ్ కంపెనీల తాలూకా చిట్టీలు కట్టించడం మన ' సర్వీసు సెంటర్ ' చేపట్టే ఇతర ప్రాజెక్టులలో కూడా పాలుపంచుకోవడం అంతే... అంతే అన్నానని ఇదేదో కళ్ళు మూసుకుని చేసే పని కాదు. ప్రతిక్షణం అప్రమత్తతతో... అనుక్షణం ఇదే ధ్యాసలో ' పనే ధ్యేయం ' గా చేయాల్సి ఉంటుంది.

మీ అందరికీ మరో ముఖ్య విషయం చెప్పాలి. నేను మీ అందరి లాగా డిగ్రీలు చదువుకోలేదు. ఎన్నో అవస్థలు పడి ఎట్టకేలకు ఇంటర్మీడియట్ వరకూ చదువుకోగలిగాను. కానీ, నేనీ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం ఆయనే. దయచేసి ఇన్స్యూరెన్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్ రాజనాల రాజేంద్ర గారు ఇక్కడకు రావలసినదిగా కోరుతున్నాను.

ఏకాంబర్ చెప్పింది విని అందరూ ఒకేసారి ' రాజనాల ' కేసి తలలు త్రిప్పి చూసారు. రాజనాల కుర్చీ లోనుండి లేచి వెళ్ళి ఏకాంబర్ ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.

"ఇకపోతే నేనీరోజు ఇక్కడ మీ ముందు ఈ స్థాయిలో ఎలా ఎదిగానో చెప్పేముందు మీ అందరికీ మరో వ్యక్తిని పరిచయం చెయ్యాలి. మీలాగే డిగ్రీ చదివి ఏం చెయ్యాలో తెలీక... తోచక బట్టల షాపులో సేల్స్ గర్ల్ గా జాయిన్ అయిన నూకరత్నం గారు మీకందరికీ ' బాస్ ' గా వ్యవహరిస్తారు. రండి నూకరత్నం గారూ!" అంటూ నూకరత్నం కేసి చూసి చెయ్యి వూపి పిలిచాడు ఏకాంబర్.

కుర్చీలో నుండి లేచి నిలబడి అందరికీ నమస్కారం చేసి ఏకాంబర్ దగ్గరకు వెళ్ళి అతనికి కుడివైపున ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంది నూకరత్నం.

"సార్! నాదో చిన్న సందేహం?! అడగొచ్చా?!" ఎంపికైన యువతీయువకుల్లో ముందు వరుసలో కూర్చున్న యువకుడు లేచి అడిగాడు.
"సందేహం అడిగి తెలుసుకోవడమే కాదు మీకు తోచిన మంచి సలహా... అదే ' సందేశం ' కూడా ఇవ్వడంలో తప్పులేదు. అడగండి" నవ్వుతూ అన్నాడు ఏకాంబర్.

"చిట్ ఫండ్" కంపెనీలో చిట్స్ కట్టించాలంటున్నారు. అవి నమ్మదగ్గవేనా?! తర్వాత మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా?" కుతూహలంగా అడిగాడా యువకుడు.

"గుడ్! ప్రశ్న మంచిదే! మనం ఏజెన్సీ తీసుకున్న రెండు చిట్ ఫండ్ కంపెనీలు గత నలభై సంవత్సరాలుగా ఎంతోమంది కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్నవి. ముఖ్యంగా అవి రాష్ట్రవ్యాప్తంగానే కాదు. ఇతర రాష్ట్రాల్లో కూడా ' చిట్ ఫండ్ ' వ్యాపారం చేస్తున్న పెద్ద కంపెనీలు. వాటి పేర్లు వింటే మీరే ఆమోదిస్తారు. వాటిలో మీరు చిట్  లు కట్టిస్తే ఎక్కువ ఇన్సెంటివ్ ఇస్తాము. మిగతా కంపెనీల వీలునామా వసూలుకు ఒక విధంగా ఇన్సెంటివ్ ఉంటుంది. ఉదాహరణకు ' సెల్ ' కంపెనీ వాయిదాల వసూలు తెచ్చారనుకోండి. ఆ నెల మొత్తం మీరు వసూలు చేసిన మొత్తం మీద మీకు ఇన్సెంటివ్ వస్తుంది. అదే చిట్ కట్టించారనుకోండి. ఒక్కసారే చిట్ విలువలో అర శాతం ఇస్తాం. లక్ష రూపాయల చిట్ అయితే అయిదు వందల రూపాయలు అదే పాతిక లక్షల చీటీ అయితే పన్నెండు వేల అయిదు వందలు ఇస్తాం. మీరు నెలంతా ఇతర వాయిదాలు సుమారు రెండు లక్షల వసూలు చేస్తే జీతంతో పాటు మీరు  మీకు రెండు వేలు అదనంగా అందుతుంది. అదే మీరు ఒకరోజు ఒక చీటీ కట్టిస్తే ఆ మొత్తం మీద ఒకసారే చిట్ వాటాలో అర్ధరూపాయి మీకు అందుతుంది." చెప్తూ అగాడు.

"అర్ధమయ్యింది సార్! మీరు చెప్పిన రెండు చిట్ కంపెనీల్లో ఎవరు చిట్ కట్టమన్నా కడతారు. అది ఒకప్పుడు! ఇప్పుడు బ్యాంకులే ఇంటింటికి తిరిగి అప్పులిచ్చేస్తుంటే ఇక ఎవరు సార్ చిట్స్ కడతారు" ఆ కుర్రాడు మళ్ళీ అన్నాడు.

"మీ పేరు.." ఆ కుర్రాడికేసి చూస్తూ అడిగాడు ఏకాంబర్.

"కుమార్! సార్!" అన్నాడో అబ్బాయి. 

"చూడు కుమార్! నువ్వు చేస్తున్న పని మీద ముందు నీకు నమ్మకం కలగాలి. ఏజెంటు అనేవాడి నోట కాదు...లేదు...రాదు...అవదు... అనే వ్యతిరేక పదాలు రాకూడదు. ' ఇసుకను పిండి తైలం ' తియ్యగల సత్తా ఉన్నవాడే ఏజెంటు. అవునా!" అంటూ ఆ కుర్రాడి కేసి చూసాడు ఏకాంబర్. అతను మౌనంగా ఉండిపోయాడు.

"సార్! మేము ' ఇన్స్యూరెన్స్ ' లాంటివి కట్టించక్కరలేదు కదా?" మరో కుర్రాడు అడిగాడు.

"ఇన్స్యూరెన్స్ కట్టించాలనుకునే వారికి మేం జీతాలు ఇవ్వం. ఇన్సెంటివ్ లు కూడా ఉండవు. అయితే, వారిని ఏజెంట్లుగా పరీక్ష రాయించి ఇన్స్యూరెన్స్ కోడ్ తెప్పించి వారు చేసే ఇన్స్యూరెన్స్ వ్యాపారానికి చేదోడుగా ఉంటూ దగ్గరుండి అతని అభివృద్దికి కృషి చేస్తాం. మీలో ఎవరైనా ఏజెంటుగా జాయిన్ అవ్వాలని కోరిక ఉంటే చెప్పండి.!" అడిగాడు ఏకాంబర్.

"నో సర్!" అందరూ ముక్త కంఠంతో ఒక్కసారే అరిచారు. వాళ్ళ అరుపు పేలిని చూసి లేడి అరచిన అరుపులా అనిపించింది.

ఏకాంబర్ ఆశ్చర్యపోలేదు. రాజనాల ముసిముసిగా నవ్వుకున్నాడు. నూకరత్నం మొహం కందగడ్డలా మారిపోయింది. అన్నీ ఎంతో సులువుగా అయిపోతాయనుకుంది. కానీ, యువతీయువకులు స్పందన చూసి అవాక్కయిపోయింది.

"ఓకే! మీకు ఇష్టం లేని పని చెయ్యమని చెప్పములెండి! మిమ్మల్నందర్ని సెల్ కంపెనీ రికవరీకి, చిట్ ఫండ్ కట్టించడానికి తీసుకున్నాం. కానీ మీకో విషయం చెప్పనా?" అంటూ అగాడు ఏకాంబర్.

"చెప్పండి సార్!" ఉత్సాహంగా అరిచాడు అందరూ.

"మీ అందరితో పాటు మీతో కూర్చున్న ఆ నలుగురూ నా మిత్రులు" ఏకాంబర్ అలా అనేసరికి అందరూ ఒక్కసారే అటు తిరిగి చూసారు. అప్పటికే మిత్రులు నలుగురూ లేచి నిలబడి చిన్నగా నవ్వి నమస్కారాలు చేసారు.

"అందులో లావుగా ఉన్నాయన అనిల్, ఎన్.ఎస్.టి.యల్ లో సైంటిస్ట్, అతనికి నెల జీతం ఎంతో తెలుసా ఎనభై వేలకు పైగానే అందుతుంది. రెండో అతను రామకృష్ణ, చిట్ ఫండ్ కంపెనీలో మేనేజర్ గా చేస్తున్నాడు. పాతిక వేలకు పైగానే జీతం వస్తుంది. సంవత్సరానికి లక్ష రూపాయల వరకూ ఇన్సెంటివ్ కూడా అందుకుంటున్నాడు. మూడో ఆయన శంకర్రావు. మెడికల్ రిప్రజెంటేటివ్, నాలుగో అతను ఆచారి. నాలాగే    ఇన్స్యూరెన్స్ ఏజెంటు. కానీ, ఆయన పేరుకే ఏజెంటుగా చేస్తున్నాడు. అతనికి తాత ముత్తాతల నుండి సంక్రమించిన తరగని ఆస్తి ఉంది. అందుకే ఆయన పెద్దగా శ్రద్ధ చూపించడటంలేదు.

ఈ సోదంతా ఎందుకనుకుంటున్నారా? నా నెలసరి ఆదాయం ఎంతో చెప్పమంటార?" అంటూ కేబిన్ లో ఉన్న సూట్ కేస్ తెరచి ఒక బిల్లు తీసి  అందరికీ చూపించాడు ఏకాంబర్.

"ఇది నాకు పదిహేను రోజులకు వచ్చే ఆదాయం. నేరుగా నా బ్యాంకు ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఇదిగో చూడండి!" అంటూ ఎదురే కూర్చున్న కుమార్ అనే యువకుడి చేతికిచ్చాడు ఏకాంబర్.

కుర్చీలోనుండి నిలబడి ఏకాంబర్ ఇచ్చిన బిల్లు చూసి అదిరిపడ్డాడు. అతని చేతిలో ఉన్న బిల్లు ఒక్కొక్కరూ లాక్కుని చూసి ఆ పదిమందీ కళ్ళు తేలేసారు.

"సార్! ఇది సాధ్యమా? పదిహేను రోజులకే రెండున్నర లక్షలా?!" ఆశ్చర్యంగా అన్నాడు కుమార్. అతనో యువకుడు.

"ఇది పెరుగుతుంది. తరుగుతుంది. అయితే నెలయ్యేసరికి నా ఆదాయం ఐదు లక్షలు దాటే ఉంటుంది. నిజమో అబద్దమో మీరే మీ కళ్ళతో చూస్తున్నారు కదా. అయితే ఇది చూపించింది నా మిత్రుల్ని కించపరచాలని కాదు. మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు. నేను కేవలం ఇంటర్గాడ్ని. డిగ్రీలు చదివిన మీరే ' నెగిటివ్ ' మూడ్ తో ఆలోచిస్తూంటే మరి నేనెలా ఇదంతా సాధించానంటారు" అందరికేసి చూస్తూ అన్నాడు ఏకాంబర్.

"ఎలా సార్! నమ్మశక్యంగా లేదు" అందరూ ఆశ్చర్యంగా అన్నారు.

"నేను ఈ రోజు ఇలా వున్నానంటే ఇదిగో ఈయనే! సార్! ఇన్స్యూరెన్స్ కంపెనీలో డెవలప్ మెంట్ ఆఫీసర్ మారుమూల గ్రామంలో బలాదూర్ గా తిరుగుతున్న నన్ను వెదుక్కుంటూ వచ్చిన దేవుడు. నజం... నా పాలిట నిజంగా దేవుడే మా అమ్మ,...నాన్న...అన్న అందరూ నేనెందుకూ పనికిరానని వదిలేసారు. నేను చదివిన ఎండాకాలం చదువుకి ఎక్కడా ఉద్యోగం దొరకదన్న నిరాశతో నైరాశ్యం లో బలాదూర్ గా తిరిగేవాన్ని అప్పుడు....అప్పుడు...ఇతను నన్ను  వెతుక్కుంటూ వచ్చాడు. మొట్టమొదట మా కలయిక గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు." ఆగాడు ఏకాంబర్ . అప్పటికే అతని కళ్ళల్లొ నీళ్ళూరుతున్నాయి.

"చెప్పండి సార్! ప్లీజ్ చెప్పండి" యువతీయువకులు అందరూ ముక్తకంఠంతో అడిగేసరికి ' నూకరత్నం ' మొహంలో ఆనందం వెల్లివిరిసింది. మిత్రులు నలుగురూ నవ్వుతూ ఏకాంబర్ కేసి చూసారు.

"వీడు అసాధ్యుడే... అందర్నీ ట్రాన్స్ లోకి లాక్కుపోతున్నాడు." అనిల్ చెవిలో గుసగుసగా అన్నాడు ఆచారి.

"డి.వో రాజనాల గారికి నన్ను ఇదిగో మా మిత్రులు ముగ్గురూ గొప్పగా పరిచయం చేసారు. రాజనాల ఆనందంగా నాకేసి తిరిగేసరికి నేనక్కడనుండి పరుగోపరుగు... ఎందుకంటే నన్నెక్కడ ఈయన ఇన్స్యూరెన్స్ ఏజెంట్ గా చేయమని అడుగుతాడోనని భయం తో పరారయిపోయాను." అంటూ నవ్వాడు ఏకాంబర్. ఆనాటి సంఘటన, గుర్తొచ్చి మిత్రులంతా పకపకా నవ్వారు. మిగిలిన వాళ్ళంతా వారికేసి వింతగా చూస్తుండిపోయారు.

ఏకాంబర్ తన విజయగాథ చెప్పడం కోసం కుర్చీలో కూలబడి మైకుని సవరించాడు గొంతులాగా...

తెల్లవారుతోంది. చీకటి కర్పూరం లా నెమ్మదిగా హరించుకుపోతోంది.

కొండమీద దేవుడి గుడిలో సుప్రభాతం మొదలయ్యింది. కొండ మీద ఎక్కడో ప్రారంభమైన సుప్రభాతసేవ మెట్ల మార్గం నుండి క్రింద వూళ్ళో దేవస్థానానికి చెందిన పురూరవ, పుష్కరిణి, జయ, విజయ, తిరుమల తిరుపతి దేవస్థానం భవనాల పైన అమర్చిన మైకుల ద్వారా వూరంతా శ్రావ్యంగా వినిపిస్తోంది.

కొండమీద దేవుడి గుళ్ళో సుప్రభాతం వింటూనే మెలకువ వచ్చేస్తుంది ఏకాంబరానికి. సరిగ్గా నాలుగంటలయ్యేసరికి దేవాలయం లో సుప్రభాత సేవలు ప్రారంభమవుతాయి.

గబాగబా లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు ఏకాంబర్.

గాంధీనగర్ లో బాల్యమిత్రుడు ఎర్రాజీ ఇంట్లో వాళ్ళ అక్క పెళ్ళి, వారం రోజులుగా కార్డులు పంపకం, పెళ్ళి పనుల్లో బిజీగా గడిపాడు. ఈరోజు రాత్రి పెళ్ళి. ఉదయాన్నే వంటలు మొదలవుతాయి. ఎర్రాజీ మరీ మరీ చెప్పాడు. తెల్లారగట్లే వస్తే ' వంట ' వాళ్ళకి సహాయంగా ఉండొచ్చని, ఏమైన సరుకులు లేకపోతే తేవాల్సి                                                                               

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్