Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
different govindhudu

ఈ సంచికలో >> సినిమా >>

బాలకృష్ణ హిట్టు కొట్టినా..

if balakrishna hits...

‘సింహా’ సినిమాలో నయనతార హీరోయిన్ . స్నేహా ఉల్లాల్ , నమిత కూడా ఈ సినిమాలో నటించారు. అయితే ఆ సినిమాలో నటించిన నయనతార తప్ప, స్నేహా ఉల్లాల్ గానీ నమితగానీ ఆ తరువాత ఎక్కువ అవకాశాలు సంపాదించుకోలేదు. నమిత పరిస్థితి మరీ ఘోరం తెలుగులో. ఆ సినిమా ఘనవిజయం సాధించినప్పటికీ నమిత భారీతనం తెలుగుకి సూటవక ఆమెను తీసుకోవడానికి తెలుగు నిర్మాతలు వెనుకంజ వేశారు.

‘లెజెండ్ ’ సినిమాని తీసుకుంటే ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించారు. సినిమా పెద్ద హిట్ . కానీ హీరోయిన్లకు గుర్తింపు దక్కలేదు. ‘సింహా’ నుంచి ‘లెజెండ్ ’ దాకా బాలయ్య హీరోయిన్లతో ప్రయోగాలు చేయడం చూశాం. కాని బాలకృష్ణతో సినిమాలు చేసి కూడా హీరోయిన్లుగా వారెవరూ రాణించలేకపోయారు. కారణాలు తెలియడంలేదు.

ఇప్పుడు బాలకృష్ణతో త్రిష నటించబోతోంది. త్రిష కెరీర్ కూడా గొప్పగా లేదు ప్రస్తుతం. బాలకృష్ణతో నటిస్తే ఆమె కెరీర్ దూసుకుపోతుందని అంచనా వేస్తున్నారు కొందరు సినిమా వాళ్ళు. త్రిష కూడా వచ్చిన అవకాశంతో సంతోషపడక, ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. అయితే బాలకృష్ణతో చేసే సినిమా హిట్టయినా త్రిష జాతకం మారుతుందా? అనే అనుమానాలు ఉన్నాయి. బాలకృష్ణ వంటి స్టార్ హీరోతో సినిమాలు చేసినా హీరోయిన్లు ఆ సక్సెస్ ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారంతే. త్రిష ఏం చేస్తుందో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
why him