Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
if balakrishna hits...

ఈ సంచికలో >> సినిమా >>

ఆయనకే ఎందుకిలా అవుతోంది?

why him

విలక్షణ నటుడిగా పేరు గాంచిన ప్రకాష్ రాజ్ కి టైమ్ బాగోలేదేమో అనిపిస్తోంది. కారణమేమిటంటే ఆయన కొన్ని రోజులుగా వరుస వివాదాలను ఎదుర్కొంటున్నారు. మహేష్ హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ లో యూనిట్ సభ్యుడొకరితో తగాదా పెట్టుకున్నారనే కారణంగా ప్రకాష్ రాజ్ చుట్టూ పెద్ద రాద్ధాంతం జరిగింది. అది అతనిపై బ్యాన్ విధిస్తారేమో అనేంత పరిస్థితికి తీసుకెళ్ళింది.

ఎలాగో ఆ వివాదం సద్దుమణగగా విమాన ప్రయాణంలో తోటి ప్రయాణీకుడితో దురుసుగా ప్రయాణించినట్లుగా ప్రకాష్ రాజ్ గురించిన వార్త బయటకు వచ్చింది. దీనిపై ప్రకాష్ రాజ్ వివరణ ఇవ్వవలసి ఉంది. కాని ప్రకాష్ రాజ్ కే ఎందుకిలా జరుగుతోంది? అని అతన్ని అభిమానించేవారు ఆందోళన చెందుతున్నారు.

తెలుగు సినిమాల్ని చూసేవారు, తమిళ సినిమాల్ని ఇష్టపడేవారే కాక హిందీ సినిమాల్లోనూ ప్రకాష్ రాజ్ ని అభిమానించేవారున్నారు. అంత పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ , తెరపై విలనిజం పండిరచడంలోనే కాకుండా నిజ జీవితంలోనూ వివాదాలను ఎదుర్కొంటుండడం మంచి విషయం కాదు. టైమ్ బాగోకపోతే ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటివి కలిసొచ్చేస్తాయి. ప్రకాష్ రాజ్ వేసే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల కారణంగా.

మరిన్ని సినిమా కబుర్లు
green signal move review