Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Corns, Ayurveda Tips and Treatment by Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ay)

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలాలు - శ్రీకాంత్

మే 09 - మే 15 

మేష రాశి

ఈవారం మొత్తంమీద ఆరంభంలో మాటను ఆచితూచి వాడుట వలన మేలుజరుగుతుంది. ఇష్టమైన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది కాకపోతే సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంభసభ్యులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది వారి సూచనలు పరిగణలోకి తీసుకోవడం మూలాన కొన్ని వివాదములను తప్పించుకొనే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం ఉంటుంది అలాగే అధికారులతో చర్చలు చేయునపుడు వారికి అనుగుణంగా నడుచుకొనుట మూలాన మేలుజరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండుట సూచన. వ్యాపారస్థులకు ఆలోచనల్లో మార్పులు గోచరిస్తాయి సాధ్య,సాధ్యాలు గమనించి ముందుకు వెళ్ళండి మంచిది. కళారంగంలోని వారికి బాగుంటుంది నూతన పరిచయాలు లాభిస్తాయి వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది.

 

వృషభ రాశి

 ఈవారం మొత్తంమీద విందులలో పాల్గొనే అవకాశం ఉంది వినోదాల పట్ల మక్కువను చూపిస్తారు. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం కలదు. వారం చివరలో కొంత అసహనం పెరుగుటకు అవకాశం ఉంది కావున సాధ్యమైనంత వరకు నూతన ఆలోచనలు చేయకపోవడం మంచిది. నలుగురిలో మీకుగల పేరు మరింత పెరుగుటకు మాత్రం అవకాశం కలదు. అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగులకు బాగుంటుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తిఅవుటకు అవకాశం ఉంది. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు శ్రమకుతగ్గ ఫలితం ఉంటుంది నూతన ప్రయత్నాలు లాభిస్తాయి. కళారంగంలోని వారికి ప్రయాణభారం తప్పదు కాకపోతే అనవసరమైన ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త పడుట మంచిది. అవకశాలు పెద్దగా సంతృప్తిని ఇవ్వకపోవచ్చును.

 

 


మిథున రాశి

 ఈవారం మొత్తంమీద ఆరంభంలో ఆలోచనలతో సతమతమయ్యే అవకాశం ఉంది అయినను త్వరగానే వాటినుండి భయటపడి తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. బంధువులతో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు అలాగే చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చుటకు ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ధనం అవసరానికి చేతికి అందుతుంది కాకపోతే మంచి ప్రణాళిక కనుక లేకపోతే కొంత సమస్య తప్పక పోవచ్చును. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి అధికంగా శ్రమను పొందవలసి వస్తుంది. కొన్ని కొన్ని విషయాల్లో అధికారుల తీరు మీకునచ్చక పోవచ్చును సర్దుకుపోవడం మంచిది లేకపోతే మానసికంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపారస్థులకు పనిభారం ఉంటుంది అలాగే పనినిమిత్తం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కళారంగంలోని వారికి బాగుంటుంది గతకొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యవహారాల్లో తీర్పువెలువడుటకు ఆస్కారం కలదు.

 

 


కర్కాటక రాశి

......ఈవారం మొత్తంమీద ఆరంభంలో బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కాకపోతే పరిధులు దాటకపోవడం మంచిది. మృష్టాన్నభోజనప్రాప్తిని పొందుతారు సమయాన్ని కాస్త విందులకు కేటయించే అవకాశం కలదు. కొన్ని కొన్ని విషయాల్లో మనసుకు నచ్చనవి జరుగుటకు అవకాశం కలదు ఆసమయంలో సర్దుబాటు మంచిది. ఇష్టమైన వ్యక్తుల నుండి వచ్చిన సమాచారం మీలో కొత్త ఉత్సాహంను నింపుటకు అవకాశం కలదు. మాటతీరు వలన నష్టపోకుండా జాగ్రత్తపడుట మంచిది. ఉద్యోగులకు బాగుంటుంది ఆశించిన విధంగా లేకపోయినను వ్యతిరేకఫలితాలు రాకపోవడం వలన ఊరట  చెందుతారు. అధికారుల ఆలోచనలు పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది.వ్యాపారస్థులకు ఖర్చులు పెరుగుతాయి ఆశించిన స్థాయిలో ధనం సర్దుబాటు కాకపోవచ్చును కొంత నిరాశను పొందుతారు. కళారంగంలోని వారికి పనుల విషయంలో అశ్రద్దచేయకండి నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది.

 


సింహ రాశి

......ఈవారం మొత్తంమీద బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళుటకు అవకాశం కలదు. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. మాటలు పొదుపుగా వాడుట ఉత్తమం అకారణంగా కోపంను కలిగి ఉంటారు ఈ విషయంలో మరింత నిదానం అవసరం. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు. పెద్ద్దల సూచనలు పాటించుట వలన మరింత లబ్దిని పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగులకు బాగుంటుంది అధికారుల వలన మేలుజరుగుతుంది. వారి మెప్పుకోసం చేయు పనులు సంతృప్తికరమైన ఫలితాలు ఇవ్వగలవు. వ్యాపారస్థులకు బాగానే ఉంటుంది పెట్టుబడులు పెట్టుటకు అవకాశం ఉంది. దూరప్రదేశం నుండి సంతోషకరమైన వార్తలు వింటారు. కళారంగంలోని వారికి చిన్న చిన్న అవకశాలు లభ్సితాయి వాటిని అందిపుచ్చుకోవడం అనేది మంచిది. ఆర్థికంగా బాగుంటుంది ఖర్చుల విషయంలో నిదానం అవసరం.

 

 

కన్యా రాశి

......ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులలో విజయంను పొందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి అలాగే నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మరింత అనుకూలమైన ఫలితాలు పొందుటకు ఆస్కారం కలదు. పెద్దలతో మీకున్న పరిచయాలు లాభ్సితాయి నూతన అవకాశాలు పొందుటకు అవకాశం కలదు. ప్రయాణాల్లో స్వల్ప సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది కావున వాటిని వాయిదవేసే ప్రయత్నం మంచిది. వాహనముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ఉద్యోగులకు బాగుంటుంది అధికారుల నుండి లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యాపారస్థులకు మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. మాటతీరును మార్చుకోవడం మార్చుకోవడం సూచన. కళారంగంలోని వారికి ఊహించని ఖర్చులు పెరుగుతాయి అందరితోను నిదానంగా వ్యవహరించుట సూచన. నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు.

 

 
తులా రాశి

 .......ఈవారం మొత్తంమీద పనులలో శ్రమను పొందుతారు. ప్రయాణాలు పెరుగుటకు అవకాశం ఉంది వాటికి సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే విధంగా చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యేందుకు అవకాశం ఉంది జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో అశ్రద్దవద్దు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంభంలో చిన్న చిన్న విషయాల్లో మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది. పెద్దల సూచనలు పాటించుట వారి సలహాలను గౌరవించుట ఉత్తమం. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి మొదట్లో స్వల్ప ఇబ్బందులు కలిగినను వాటిని తొలగించుకొని ముందుకు వెళ్తారు. బదిలీలు అనుకూలంగా అయ్యేందుకు అవకాశం కలదు. వ్యాపారస్థులకు సమయానికి ధనం చేతికి అందుతుంది కాకపోతే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండుట మంచిది. కళారంగంలోని వారికి నూతన అవకశాల కోసం చేయుప్రయత్నాల్లో మిత్రులతో స్వల్పవిభేదాలు కలిగే అవకాశం ఉంది జాగ్రత్త.

 

 

వృశ్చిక రాశి

.

 .......ఈవారం మొత్తంమీద నలుగురిలో గుర్తింపు కోసం చేయుప్రయత్నాల్లో మొదట్లో ఆశించిన ఫలితాలు కలిగినను తర్వాత అనవసరమైన ఇబ్బందులు తెచ్చుకుంటారు. తలపెట్టిన పనులను వరం చివరలో పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించిన దానికన్నా అధికమైన ఖర్చులు కలుగుతాయి కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ప్రయాణాల వలన విపరీతమైన శ్రమను పొందుటకు అవకాశం ఉంది. మానసికంగా కొంత దృడంగా ఉండుట సూచన లేకపోతే కొంత భ్డకు గురయ్యే అవకాశం ఉంది నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. ఉద్యోగులకు బాగుంటుంది కాకపోతే అధికారులతో విభేదాలు కలుగకుండా తగిన జాగ్రతలు తీసుకోవడం సూచన. నూతన ఆలోచనలు వద్దు కొంత పరిధి ఉండుట మంచిది. వ్యాపారస్థులకు పెట్టుబడులు కలిసి వస్తాయి నూతన ప్రయత్నాలు లాభిస్తాయి. కళారంగంలోని వారికి మిత్రుల మూలాన నూతన అవకాశాలు లభించే అవకాశం ఉంది వాటిని అందిపుచ్చుకోండి.

 

ధనస్సు రాశి

 ......ఈవారం మొత్తంమీద ఆరంభం బాగుంటుంది చేపట్టిన పనులు కలిసి వస్తాయి,ఊహించిన దానికన్నా అనుకూలామైన ఫలితాలు పొందుట చేత సంతృప్తిని పొందుటకు అవకాశం ఉంది. నూతన ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుట వలన మేలుజరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యములలొ పాల్గొనే అవకాశం ఉంది సమయాన్ని సరదాగా గడుపుతారు. వారం చివరలో మాత్రం కుటుంభసభ్యులతో చేయు చర్చలలో కొంత నిదానంగా వ్యవహరించుట సూచన. ఉద్యోగులకు బాగుంటుంది మీ ఆలోచనల మూలాన అధికారులకు దగ్గరయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు కూడా సంతృప్తికరంగానే ఉంటుంది. సమయాన్ని కాస్త ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయుట మంచిది. కళారంగంలోని వారికి మంచిఅవకాశాలు లభిస్తాయి అదేవిధంగా మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. కుటుంభసభ్యులతో ఆలోచనలు పంచుకుంటారు వారి సూచనలు పాటించే ప్రయత్నం చేయండి.

 


మకర రాశి

 ......ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులలో ఆరంభంలో ఆటంకాలు కలుగుతాయి కాకాపోతే ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళుట వలన విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంభంలో చేయుపనుల మూలాన ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. ఒకవార్త కొంత నిరుత్సాహంను కలిగి ఉండే అవకాశం ఉంది కావున మానసికంగా దృడంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ అనుకున్న వారితో మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం ఉంది కావున సర్దుబాటు దోరణి మేలుచేస్తుంది. ఉద్యోగులకు బాగానే ఉంటుంది అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం సూచన. వారితో కలిసి పనిచేయునపుడు వారి సూచనలు పాటించుట మంచిది. వ్యాపారస్థులకు నూతన పనులను చేపట్టుట యందు ఆసక్తిని కలిగి ఉంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. కళారంగంలోని వారికి మాటతీరు ఫలితాలను నిర్దేశిస్తుంది కావున అందరితోను కలిసిపోయే ప్రయత్నం చేయుట ఉత్తమం.

 


కుంభ రాశి

 ......ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారిమూలన కొత్త ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. మొదట్లో ఉత్సాహం ఉండకపోవచ్చును కావున ప్రణాళికతో ముందుకు వెళ్ళుట సూచన. ప్రయాణాలు చేయునపుడు జాగ్రత్తలు అవసరం. వ్యతిరేకవర్గం విషయంలో బాగాఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంభసభ్యుల నిర్ణయాలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టుటకు అవకాశం ఉంది కావున వారి ఆలోచనలను అదపులో ఉంచు ప్రయత్నం చేయండి. ఉద్యోగులకు అధికారులతో చేయు చర్చలు వారం చివరలో పూర్తిఅవుటకు అవకాశం ఉంది. తోటిఉద్యోగుల విషయంలో తొందరపాటు ఆలోచనలు చేయకండి నిదానమే ప్రధానం అన్నది మంచిది.వ్యాపారస్థులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి ఖర్చులను తగ్గించ్చుకొనే ప్రయత్నం చేయండి మంచిది. కళారంగంలోని వారికి నిదానం అవసరం చలావిశాయాల్లో మీ ఆలోచనలు వ్యతిరేకఫలితాలు ఇచ్చుటకు అవకాశం ఉంది జాగ్రత్త.

 

మీన రాశి

 ........ఈవారం మొత్తంమీద  భోజనం విషయంలో ప్రత్య్కేమిన శ్రద్ధనుకలిగి ఉంటారు. విందులలో పాల్గొనే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులను పూర్తిచేసే అవకాశం ఉంది వాటికి అనుగుణంగా ఫలితాలు పొందుతారు. కుటుంభంలో నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి చేయు ఆలోచనలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారులతో గల అనుభందం బలపడుతుంది మీ ఆలోచనలను వారు పరిగణలోకి తీసుకొనే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు బాగుంటుంది ఆశించిన లబ్దిని పొందుతారు. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కళారంగంలోని వారికి బాగానే ఉంటుంది గత కొంత కాలంగా ఆగిఉన్న పనులు ముందుకు కదులుతాయి అలాగే కావు అని అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
gunde ootalu(naaneelu)