Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
why him

ఈ సంచికలో >> సినిమా >>

గ్రీన్ సిగ్నల్: చిత్ర సమీక్ష

green signal move review

చిత్రం: గ్రీన్ సిగ్నల్
తారాగణం: మనాస్ , రేవంత్ , అశుతోష్ , గోపాల్ సాయి, మనాలి రాథోడ్ , శిల్పి శర్మ, డింపుల్ చొపాడె, రక్షిత, చంద్ర తదితరులు.
చాయాగ్రహణం: స్వామి
సంగీతం: జెబి
నిర్మాణం: ఎస్ .ఎల్ .వి. సినిమా
సమర్పణ: మారుతి
దర్శకత్వం: విజయ్ మద్దాల
నిర్మాత: రుద్రపాటి రమణారావు
విడుదల తేదీ: మే 30, 2014

క్లుప్తంగా చెప్పాలంటే...
మనసుకు తగ్గ అమ్మాయి వేటలో బిజీగా వుండే నలుగురు కుర్రాళ్ళు మనాస్ , రేవంత్ , అశుతోష్ , గోపాల్ సాయి. అందులో గూగుల్ (గోపాల్ సాయి) తన స్టూడెంట్ స్వీటీ (మనాలి రాథోడ్ )తో ప్రేమలో పడ్తాడు. అలానే మిగతా కుర్రాళ్ళు కూడా ముగ్గురు అమ్మాయిలతో టచ్ లోకి వస్తారు. ఆ నాలుగు జంటలు ఒక్కటయ్యాయా? అవి అసలు నిజమైన ప్రేమలేనా? ఎవరి కథ ఎలా కంచికి చేరింది? అన్నది మిగతా కథ.

మొత్తంగా చెప్పాలంటే
సినిమా మొత్తంలో మనాస్ శిల్పి శర్మ ట్రాక్ ఆకట్టుకుంటుంది. శిల్పి శర్మ గ్లామర్ అందుక్కారణం. అంద చందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మనాస్ కూడా నాచురల్ గా కన్పించాడు. మిగతా హీరోలంతా ఓకే. నటన పరంగా హీరోయిన్లలో డింపుల్ చొపాడేకి ఎక్కువ మార్కులు పడ్తాయి. మనాలి రాథోడ్ హీరోయిన్ మెటీరియల్ కాదు. రక్షిత ఫర్వాలేదనిపించింది. శ్రావ్యా రెడ్డి కేమియో పాత్రలో అలరించింది. మధురిమ హాట్ హాట్ గా కనిపించింది.

మారుతి బ్రాండ్ సినిమాగా ప్రచారం జరిగినా, ఆ ఫ్లేవర్ అంతగా కనిపించలేదు. ఎక్కువసేపు సినిమా బోరింగ్ గా అనిపిస్తుంది. కామెడీ వున్నా అంతగా ఆకట్టుకోదు. స్క్రీన్ ప్లే లోపాలు చాలా చోట్ల బయటపడ్తాయి. సంగీతం యావరేజ్ అన్పిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోదు. సినిమా బోరింగ్ గా అన్పించడానికి ఎడిటింగ్ కూడా ఓ కారణం. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగానే వున్నాయి. కాస్ట్యూమ్స్ , ఆర్ట్ డిపార్ట్ మెంట్స్ చక్కగానే కుదిరాయి.

బాలీవుడ్ చిత్రాలు ‘ప్యార్ కా పంచనామా’, ‘దిల్ తో బచ్చా హై జీ’ సినిమాల్ని మిక్స్ చేసి, తెలుగులో తీసినట్లుగా అన్పిస్తుంది. దర్శకుడు కాస్త జాగ్రత్త పడి వుంటే సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్ళి వుండేదే. గే వ్యవహారం ఎబ్బెట్టుగా అనిపించింది. ఆ ఒక్క సన్నివేశాన్ని వీలైనంత తగ్గించి వుంటే బావుండేది. సినిమాలో బ్యాడ్ సీన్ అదే. వల్గర్ గా అనిపిస్తుంది కూడా. కొన్ని సన్నివేశాలు బావుంటాయి అనిపిస్తుందిగానీ, పూర్తి సినిమాగా చూస్తే, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనిపించదు. డీవీడీల్లో మాత్రం కొంతవరకు వర్కవుట్ అవ్వొచ్చు చూసేవారికి.

ఒక్కమాటలో చెప్పాలంటే: గ్రీన్ సిగ్నల్ .. సరిగ్గా ప(పం)డలేదు

అంకెల్లో చెప్పాలంటే : 2.5/5

మరిన్ని సినిమా కబుర్లు
nenu naa friends  platinum disc function