Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aryaryan rajesh, allari naresh, indraganti mohana krishna combination withe.v.v bandipotu movie

ఈ సంచికలో >> సినిమా >>

ఐటమ్‌ కాదు వెరీ వెరీ స్పెషల్‌

very very special not item

హీరోయిన్‌ శృతిహాసన్‌ తెలుగులో మంచి డిమాండ్‌ వున్న కథా నాయిక. ఆమె నటిస్తే సినిమా హిట్‌ అని నమ్మకం కుదిరేలా వరుస విజయాల్ని ఆమె సొంతం చేసుకుంది. సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా వున్నప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌లో చేయడమన్నది కొందరు రిస్క్‌గా భావిస్తారు, ఇంకొందరు గౌరవంగా భావిస్తారు. శృతిహాసన్‌ ఎలా భావించిందోగాని మహేష్‌ ‘ఆగడు’ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేయడానికి ఒప్పుకుందట.

శ్రీనువైట్ల సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌కి స్పెషల్‌ క్రేజ్‌ వుంటుంది. ‘దూకుడు’ సినిమాలో పార్వతి మెల్టన్‌ స్పెషల్‌ సాంగ్‌లో కన్పించింది. అది పెద్ద హిట్‌. అప్పటికి పార్వతి మెల్టన్‌ కెరీర్‌ ఏమంత బాగాలేదు. శృతిహాసన్‌ అలా కాదు, హీరోయిన్‌గా టాప్‌ ఛెయిర్‌ని ఆక్రమించింది తెలుగులో. ఈ టైమ్‌లో శృతి ఐటమ్‌ సాంగ్‌ అంటే అది ఆ సినిమాకి పెద్ద ప్లస్‌.

మహేష్‌ సినిమా కావడం వల్లే శృతి ఐటమ్‌ సాంగ్‌కి అంగీకరించిందంట. ఐటమ్‌ సాంగ్‌ అనడం కంటే స్పెషల్‌ సాంగ్‌ అనడం మంచిదని ఇటువంటి పాటల విషయంలో ఫామ్‌లో వున్న హీరోయిన్లు చెబుతుంటారు. శృతి కూడా అలానే అనుకుందేమో, అందుకే ఒప్పుకుందేమో.

మరిన్ని సినిమా కబుర్లు
telugu industry