Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cherry heroin dedication

ఈ సంచికలో >> సినిమా >>

ఆర్యన్ రాజేష్ - ఇంద్రగంటి మోహనకృష్ణ - అల్లరి నరేష్ కాంబినేషన్లో ' ఇ.వి.వి ' బందిపోటు

aryaryan rajesh, allari naresh, indraganti mohana krishna combination withe.v.v bandipotu movie

ప్రముఖ దర్శకులు స్వర్గీయ ఇ.వి.వి సత్యనారాయణ స్థాపించిన 'ఇ.వి.వి సినిమా' సంస్థ బాధ్యతలను ఆయన తనయుడు ఆర్యన్ రాజేష్ స్వీకరించారు. ఆయన సారధ్యంలో 'ఇ.వి.వి సినిమా' సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం వివరాలు ఆయన వెల్లడించారు. ఇటీవల ' అంతకుముందు ఆ తరువాత ' చిత్రంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో... అల్లరి నరేష్ హీరోగా ' బందిపోటు ' చిత్రం రూపొందించేందుకు ఆర్యన్ రాజేష్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇ.వి.వి జయంతి సంధర్భంగా జూన్ 10న ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా 'ఇ.వి.వి సినిమా' అధినేత ఆర్యన్ రాజేష్ మాట్లాడుతూ... 'నాన్నగారి తదనంతరం ఇ.వి.వి సినిమా బ్యానర్ బాధ్యతలను చేపడుతూ... ఇకపై వరుస చిత్రాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో తమ్ముడు అల్లరి నరేష్ హీరోగా '' బందిపోటు ' చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తాం' అన్నారు!

మరిన్ని సినిమా కబుర్లు
very very special not item