Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
very very special not item

ఈ సంచికలో >> సినిమా >>

సినిమాకి వివాదాలు వద్దండీ

telugu industry

హిందీ సినిమాల్ని, తమిళ సినిమాల్ని తెలుగులోకి డబ్‌ చేసుకుని చూస్తున్నప్పుడు తెలుగు సినిమాలకి తెలంగాణ ` ఆంధ్రప్రదేశ్‌లలో వివాదాలు ఎందుకు ఉండాలి? ఉండకూడదు. ఓ సినిమా హీరోకి తెలంగాణలో కష్టం తప్పదని, అసలు తెలుగు సినిమాకి ఇరు రాష్ట్రాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చునని పిచ్చాపాటీ కబుర్లలో భాగంగా కొందరు అనుకోవడంతో సినిమా వర్గాలలో ఆందోళన కలుగుతోంది.
తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వం తెలుగు సినిమా అభివృద్ధికి పాటుపడుతుందని అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు ఇప్పటికే చెప్పి ఉన్నారు. కాబట్టి అపోహలని నమ్మాల్సిన అవసరం లేదని కూడా అనుకుంటున్నారు. రెండు రాష్ట్రాలలోనూ తెలుగు సినిమాకి ప్రత్యేక రాయితీలు ఇవ్వడం, షూటింగ్‌లకు తగిన సౌకర్యాలను కల్పించడం వలన తెలుగు సినిమా ఇంకా గొప్పగా అభివృద్ధి చెందడానికి వీలు పడుతుంది.

రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని ఉద్యమ నాయకులు అన్నారు గనుక, అదే మాటకు కట్టుబడి సినిమా పరిశ్రమలో ప్రాంతీయ బేధాలు లేకుండా, ఆ పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు వరాల జల్లును కురిపించాలి. అదే విధంగా సినిమాలు కూడా వివాదాలకు దూరంగా ఉండేలా రూపొందాల్సి ఉంటుంది. హిందీ తరువాత తెలుగు సినిమా పరిశ్రమే రెండు రాష్ట్రాల్లో విస్తరించే సదవకాశం దక్కిందనుకోవడం మేలు.

మరిన్ని సినిమా కబుర్లు