Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
seven number

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం - శ్రీకాంత్

జూన్ 6 - జూన్ 12

మేష రాశి

ఈవారం మొత్తంమీద వారం ఆరంభంలో చిన్న చిన్న సమస్యలు కలిగినను వారం చివరలో పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. బంధుమిత్రులతో కలిసి సమాలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. తోటివారితో మాటలను జాగ్రత్తగా వాడుట వలన స్వల్ప విభేదాలు తగ్గుటకు ఆస్కారం కలదు. నూతన పరిచయాలు కలుగుతాయి మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. ప్రయాణాలు చేయునపుడు బాగానే ఉంటుంది కాకపోతే బాగాఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగులకు పనిఒత్తిడి తప్పక పోవచ్చును నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులు నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. పెట్టుబడులు పెట్టుటయందు ఆసక్తిని చూపించే అవకాశం ఉంది. కళారంగంలోని వారికి బాగుంటుంది అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మరింత ఉన్నతమైన అవకశాలు పొందుటకు అవకాశం ఉంది. పెద్దలతో కలిసి కొత్త కొత్త ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది.

 

 

వృషభ రాశి

 ఈవారం మొత్తంమీద ఆరంభంలో చేపట్టిన పనులలో ఆందోళన చెందుటకు అవకాశం ఉంది మానసికంగా దృడంగా ఉండుట సూచన. ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన వారంమధ్య నుండి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. సేవాకార్యక్రమాలలో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది దానిమూలాన నలుగురిలో గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. బంధువులతో సమయాన్ని గడుపుతారు. ఒకవార్త మూలన నిరాశను చెందుటకు అవకాశం ఉంది సర్దుబాటు విధానం కలిగి ఉండుట మేలుజరుగుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. చేపట్టిన ఆలోచనలు అధికారులలో గుర్తింపును కలిగిస్తాయి. వ్యాపారస్థులకు బాగుంటుంది పెద్దవాళ్ళతో పరిచయాలు కలుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో చేసిన ప్రయత్నాలు సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. కళారంగంలోని వారికి అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది కావున సాధ్యమైనంత వరకు నిదానంగా వ్యవహరించుట సూచన.

 

 


మిథున రాశి

ఈవారం మొత్తంమీద ఇష్టమైన పనులను చేపట్టుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం కలదు. ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు చేపట్టుట సూచన నిదానం అవసరం. ప్రయాణాలు చేయునపుడు మాత్రం నిదానంగా వ్యవహరించుట సూచన. ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో వారం చివరలో బాగుంటుంది సంతృప్తికరమైన ఫలితాలు ఉంటవి కాకపోతే అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది తొటిఉద్యొగులతొ కలిసి పనిచేయునపుడు వారి సూచనలు పాటించుట మంచిది. వ్యాపారస్థులకు మాములుగా ఉంటుంది కావున నూతన ప్రయత్నాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. కళారంగంలోని వారికి అబివృద్ది ఉంటుంది. దూరప్రదేశప్రయాణాలు కలిసి వస్తాయి గతకొంత కాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు వచ్చుటకు అవకాశం ఉంది.

 


కర్కాటక రాశి

ఈవారం మొత్తంమీద మాటలు పోదుపుగా వాడుట వలన మేలుజరుగుతుంది. ఇష్టమైన వ్యక్తులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది నిదానంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాల విషయంలో తొందరపాటు ఆలోచనలు చేయకపోవడం అనేది సూచన. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇబ్బందులు తప్పక పోవచ్చును కావున అధికారులతో నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది,నలుగురిని కలుపుకొని వెళ్ళండి మంచిది. నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు నిదానం అవసరం అనుకోని ఖర్చులు పొందుతారు. పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. కళారంగంలోని వారికి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన అవకాశాలు పొందుటకు అవకాశం ఉంది వాటిని సద్వినియోగం చేసుకోండి.

 


సింహ రాశి

ఈవారం మొత్తంమీద విందులలో పాల్గొనే అవకాశం ఉంది భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు. తలపెట్టిన పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది కాకపోతే ఎవ్వరితోను మాటపట్టింపులు రాకుండా చూసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యతిరేకవర్గం నుండి వచ్చు సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. నలుగురిలో ఆశించిన గుర్తింపును పొందుతారు. ఉద్యోగులకు బాగుంటుంది అధికారులతో గల మంచి సంభందాలు  లాభిస్తాయి. చేపట్టిన పనులను అనుకున్న సమాయనికి పూరిచేస్తారు. వ్యాపారస్థులకు బాగుంటుంది వచ్చిన అవకశాలు లబ్దిని చేకుర్చేవిగా ఉండే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కళారంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు వచ్చుటకు అవకాశం కలదు. ఆశించిన విధంగా నూతన అవకాశాలు పొందుతారు. అలాగే ఆర్థికంగా బాగుంటుంది.

 

కన్యా రాశి

ఈవారం మొత్తంమీద ఆరంభంలో అధికమైన ఆలోచనలు చేయటకు అవకాశం ఉంది. ఊహించిన దానికన్నా అధికమైన ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు మిత్రులతో కలిసి విందులలో పాల్గొనే అవకాశం కలదు. తలపెట్టిన పనులను పెద్దల సూచనలు పాటించట ద్వార విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. తోటివారితో మాటపట్టింపులకు పోకపోవడం సూచన. పెద్దలతో పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారిమూలన లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు బాగుంటుంది అధికారులతో ఆలోచనలు పంచుకొనే అవకాశం ఉంది. అబివృద్దిని పొందుటకు అవకాశం కలదు. వ్యాపారస్థులకు ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు లభిస్తాయి. పెట్టుబడులు పెట్టుటకు కొంత ఆలోచన అవసరం తొందరపాటు వద్దు. కళారంగంలోని వారికి మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు. బంధుమిత్రులతో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది.

 
తులా రాశి

ఈవారం మొత్తంమీద ఆరంభం మంచిగా ఉన్న మధ్యలో కొంత ఆలోచనల వలన తికమకను పొందుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సంతోషంగా గడుపుటకు ఆస్కారం కలదు. ప్రయాణాలు కలిసి వస్తాయి నూతన ప్రయత్నాలు కలిసి వత్సాయి. కుటుంభంలో శుభకార్యములు జరుగుటకు అవకాశం కలదు. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు పొందుతారు. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన మేలుజరుగుతుంది. శ్రమకు తగ్గఫలితం పొందుటకు అవకాశం ఉంది.  వ్యాపారస్థులకు పెద్దల సూచనలు పాటించుట మంచిది. కళారంగంలోని వారికి కుటుంభంలోని వ్యక్తుల ద్వార నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త.

 

 

వృశ్చిక రాశి

.

ఈవారం మొత్తంమీద ఆరంభంలో తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. కుటుంభంలో తీసుకున్న నిర్ణయాలు కొంత విభేదాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట సూచన. ప్రయాణాలు చేస్తారు నలుగురితో కలిసి పనిచేయునపుడు వారి సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది కావున తొందరపాటు వద్దు. ఉద్యోగులకు అధికారుల నుండి శ్రమను పొందుటకు అవకాశం ఉంది. ఆశిస్తున్న బదిలీలు జరుగుటకు అవకాశం కలదు. వ్యాపారస్థులకు బాగుంటుంది పెట్టిన పెట్టుబడులు లబ్దిని ఇచ్చుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కళారంగంలోని వారికి దూరప్రదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆలోచనలు అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి లేకపోతే విబేదాలు తలెత్తుటకు అవకాశం ఉంది.

 

ధనస్సు రాశి

ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను సకాలంలో పూర్తిచేయుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. పెద్దల నుండి నచ్చిన వార్తలు వినుటకు ఆస్కారం కలదు. అనవసరమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది కావున వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి మంచిది. కుటుంభంలో నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు బాగుంటుంది పెద్దల నుండి ఆశించిన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. సమయపాలన పాటించుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు పెట్టుబడులు అనుకూల్సితాయి పెద్దల నుండి వచ్చిన సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. కళారంగంలోని వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. స్త్రీ సంభందమైన విషయల్లో నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది.

 


మకర రాశి

ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులను చివరలో విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది కాకపోతే ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం నిదానం అవసరం. ప్రయాణాల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. కుటుంభంలో ని ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది కావున విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. కుటుంభంలో నూతన నిర్ణయాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది,అనుకోని మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ఉద్యోగులకు అధికారులతో చర్చలలో పాల్గొనేటప్పుడు వారి అభిప్రాయాలను గౌరవించుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి కాకపోతే శ్రమ పెరుగుటకు అవకాశం కలదు. కళారంగంలోని వారికి బాగుంటుంది పెద్దలతో కలిసి పనిచేయవలసి రావోచ్చును అవాకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

 


కుంభ రాశి

ఈవారం మొత్తంమీద నలుగురిలో ఆశించిన స్థాయిలో గుర్తింపును పొందుతారు. తలపెట్టిన పనులను కొంత ఆలస్యంగా పూర్తిచేసే అవాకాశం ఉంది. కుటుంభంలో నూతన ఆలోచనలు చేయకపోవడం అనేది సూచన,బంధుమిత్రులతో స్వల్ప విబేదాలు కలుగుటకు అవకాశం ఉంది మాటపట్టింపులకు పోకండి. ఆరోగ్యపరమైన సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది కావున ఎటువంటి అశ్రద్ద కూడదు. ప్రయాణాలు చేయకపోవడం మంచిది వీలయితే వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల నుండి లబ్దిని పొందుతారు ఆశించిన విధంగా పనులు నెరవేరుతాయి,మిత్రుల ద్వార సహాయం పొందుతారు. వ్యాపారస్థులకు పెట్టుబడులు అనుకూల్సితాయి కాకపోతే వారం చివరలో వాటి విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కళారంగంలోని వారికి అవకశాలు వస్తాయి కాకపోతే సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకోవడం అనేది సూచన.

 

 

మీన రాశి

ఈవారం మొత్తంమీద కుటుంభసభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వాటి మూలన గత కొంత కాలంగా ఆగిఉన్న పనులను పూర్తిచేయగలుగుతారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది కాకపోతే వారం చివరలో స్వల్ప అనారోగ్యం కలుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. ఉద్యోగులకు స్థిరమైన ఆలోచనలు అవసరం కొన్ని కొన్ని విషయల్లో నిర్ణయాలు తీసుకొనే ముందు తడబాటు ఉంటుంది కావున పెద్దల సూచనలు పాటించుట మంచిది. వ్యాపారస్థులకు ఆర్థికపరమైన విషయల్లో మిశ్రమఫలితాలు పొందుతారు అకారణంగా ఖర్చులు పెరుగుతాయి వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. కళారంగంలోని వారికి నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి చినానటి మిత్రుల నుండి కొత్త అవకశాలు వచ్చుటకు ఆస్కారం ఉంది. 


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Nimmakaya Pappu