Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
intterview with praksh raj

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష : ఉలవచారు బిర్యాని

Movie Review - Ulavacharu Biryani
చిత్రం: ఉలవచారు బిర్యాని
తారాగణం: ప్రకాష్‌రాజ్‌, స్నేహ, తేజుస్‌, సంయుక్త హోర్నాడ్‌, ఊర్వశి, ఎమ్మెస్‌ నారాయణ, బ్రహ్మాజీ, ఐశ్వర్య తదితరులు
చాయాగ్రహణం: ప్రీత
సంగీతం: ఇళయరాజా
నిర్మాణం: క్రియేటివ్‌ కమర్షియల్స్‌, ప్రకాష్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌
దర్శకత్వం: ప్రకాష్‌రాజ్‌
నిర్మాతలు: వల్లభ, ప్రకాష్‌రాజ్‌
విడుదల తేదీ: 6 జూన్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే :
ఆర్కియాలజిస్ట్‌ అయిన ప్రకాష్‌రాజ్‌కి వృత్తి పట్ల నిబద్ధత ఎక్కువ. మధ్యవయసుకొచ్చేసినా ఇంకా పెళ్ళికాని బ్యాచిలర్‌ అయిన ప్రకాష్‌రాజ్‌కి వంట చేయడమంటే ఇష్టం. ఇంకోపక్క డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ స్నేహ కూడా పెళ్ళికాని మధ్యవయసు మహిళ. ఓ సారి అనుకోకుండా ఓ మిస్డ్‌ కాల్‌తో ప్రకాష్‌రాజ్‌, స్నేహల మధ్య పరిచయం ఏర్పడుతుంది ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ. అది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే :
నటనలో ఇప్పటికే తానేంటో ప్రూవ్‌ చేసుకున్న ప్రకాష్‌రాజ్‌, ఈ సినిమాతోనూ నటుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. కాళిదాసు పాత్రలో ప్రకాష్‌ రాజ్‌ నటన సింప్లీ సూపర్బ్‌. సహజమైన అందంతో, సహజమైన నటనతో స్నేహ ఆకట్టుకుంది. పెళ్ళయ్యాక ఆమె అందం రెట్టింపయ్యింది. తేజుస్‌ ఓకే. సంయుక్త క్యూట్‌గా వుంది. ఎంఎస్‌ నారాయణ, బ్రహ్మాజీ పాత్రలు ఎంటర్‌టైనింగ్‌గా సాగాయి. ఐశ్వర్య తన పాత్రకు న్యాయం చేసింది. ఊర్శశి మామూలే. మిగతావారంతా తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

రొమాంటిక్‌ స్టోరీ లైన్‌కి రిచ్‌ ప్రెజెంటేషన్‌ తోడయ్యింది. డైలాగ్స్‌ బావున్నాయి. స్క్రిప్ట్‌ ఫర్వాలేదన్పిస్తుందంటే. స్క్రీన్‌ప్లే ఇంకాస్త బావుంటే సినిమాకి అదనపు బలం చేకూరేది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మెలోడియస్‌గా వుంది. మూడు పాటలు బావున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి బలంగా నిలిచింది. ఎడిటింగ్‌ షార్ప్‌గా లేదు. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరు ఓకే.

మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌’ సినిమాకి ఇది రీమేక్‌. కాన్సెప్ట్‌ బాగానే వున్నా, మెచ్యూర్డ్‌ రొమాన్స్‌, ఆఫ్‌ బీట్‌ బ్యాక్‌డ్రాప్‌.. ఇవి అందర్నీ ఆకట్టుకోవడం అంత తేలిక కాదు. ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగినా, సెకెండాఫ్‌ కాస్త నెమ్మదించింది. క్లయిమాక్స్‌ ఇంకా కన్విన్సింగ్‌గా వుండి వుండాల్సింది. పర్టిక్యులర్‌గా ఓ సెక్షన్‌ ఆఫ్‌ ఆడియన్స్‌ని మాత్రమే కాస్త మెప్పించేలా రూపొందించారు తప్ప, అన్ని వర్గాల ప్రేక్షకులూ సినిమాకి కనెక్ట్‌ అయ్యేలా లేదు. దాంతో సినిమా యావరేజ్‌ నుంచి ఎబౌ యావరేజ్‌గా మిగిలే అవకాశం వుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే :
నటీ నటుల ప్రతిభ, మెచ్యూర్డ్‌ సబ్జెక్ట్‌ వున్నా, అందరికీ నచ్చేంత రుచిగా లేదీ ఉలవచారు

అంకెల్లో చెప్పాలంటే: 2.5/5
 
 
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka