Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
amala paul marriage

ఈ సంచికలో >> సినిమా >>

లవ్‌ యూ జగ్గూ...

love u jaggu

జగపతిబాబు ట్విట్టర్‌లోకి ఎంటరయ్యారు. సీనియర్‌ నటుడిగా జగపతిబాబుకు తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘమైన ప్రస్థానం వుంది. ఫ్యామిలీ హీరోగా చాలా సినిమాల్లో నటించిన జగపతిబాబు, ‘లెజెండ్‌’ సినిమాతో తనలోని నెగెటివ్‌ యాంగిల్‌ని ప్రేక్షకులకు చూపించారు. ‘ఇలా చూడ్డం కష్టంగా వుంది..’ అని అతన్ని అభిమానించే అభిమానుల్లో కొందరు అన్నా, తెలుగు సినిమాకి విలన్లు కరువొచ్చేయడంతో జగపతిబాబు డెసిషన్‌కి హేట్సాఫ్‌ చెబుతున్నారు ఎక్కువమంది.

ట్విట్టర్‌లోకి వెళ్ళిన జగపతిబాబుకి ‘లవ్‌ యూ జగ్గూ..’ అనే కామెంట్స్‌ ఎక్కువగా వస్తున్నాయట. లేడీస్‌లో జగపతిబాబుకి వున్న ఫాలోయింగ్‌ అలాంటిది. అందగాడు.. పైగా ఇద్దరు భార్యల మధ్యన నలిగిపోయే భర్తగా చాలా సినిమాల్లో చేశాడు. విలన్‌ గెటప్‌ వేసినా, ఆయనలోని గ్లామర్‌ మాత్రం మిస్‌ అవడంలేదు. అందుకే, ‘లవ్‌ యూ జగ్గూ’ కామెంట్స్‌ అలా పడ్తున్నాయి.

తెలుగు తెరపై ‘గ్లామరస్‌ విలన్‌’ అని జగపతిబాబు గురించి సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజం కూడా. కండలు తిరిగిన శరీరం, అగ్రెసివ్‌ లుక్‌ అన్నీ కలగలిసిన జగపతిబాబు నెగెటివ్‌ పాత్రల్లో కనిపిస్తూనే, హీరోగా కూడా సినిమాలు చేస్తే అభిమానులకు డబుల్‌ హ్యాపీ. అభిమానుల్ని సంతృప్తిపర్చడానికి ఏం చేయడానికైనా సిద్ధమని చెప్పే జగపతిబాబు, హీరోగా చేస్తూనే రొటీన్‌ విలన్‌కి భిన్నంగా తెలుగు ప్రేక్షకుల్ని రంజింపజేయాలని కోరుకుందాం.

మరిన్ని సినిమా కబుర్లు
producer friendly with mega hero