Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం (జూన్ 13 - జూన్ 19) - శ్రీకాంత్

మేష రాశి

వారం మొత్తం మీద మీరు ఆరంభంలో తడబాటు ఉన్న కొంతమేర వాటిని అదిగమిస్తారు. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట మూలాన మేలుజరుగుతుంది. వారం చివరలో అనవసరమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు పెద్దల సలహాలను పాటించే ప్రయత్నం చేయుట అన్నివిధాల మంచిది. అనారోగ్యసమస్యలను ఎదుర్కొనే  అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. బంధుమిత్రులను కలుస్తారు వారితో ఆలోచనలు పంచుకుంటారు. అధికారులతో చిన్న చిన్న విషయాల్లో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో తొందరపాటు కూడదు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మంచిది. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది

 

వృషభ రాశి

 వారం మొత్తం మీద మీరు తలపెట్టిన పనులు నలుగురికి ఉపయోగపడేవిగా ఉంటవి. ఆశించిన స్థాయిలో మార్పులు రావడం మూలన సంతోశంను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు,ఖర్చుల విషయంలో మాత్రం బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట అనేది సూచన. భోజనం విషయంలో ఎటువంటి అశ్రద్ద చేయకండి సమయానికి భోజనం చేయుట మంచిది. కుటుంభంలో తీసుకొనే నిర్ణయాలు నూతన మార్పులకు స్వాగతం పలుకుతాయి. అదేవిధంగా కుటుంభసభ్యుల ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం సూచన. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి మంచిది తొందరపాటు వద్దు నిదానం అవసరం. సేవారంగంలో సమయాన్ని కేటాయిస్తారు పెద్దలను కలిసే అవకాశం కలదు. ప్రయాణాలు వాయిదా వేయుట ఉత్తమం.


మిథున రాశి

వారం మొత్తం మీద మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. సమయాన్ని సరదగా గడుపుటకు అవకాశం ఉంది విందులు,వినోదాలకు కేటాయిస్తారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు కాకపోతే వారం మధ్యలో అనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు జాగ్రత్త. ఉద్యోగంలో అధికారులతో చర్చలు చేయుటకు అవకాశం కలదు మీ సూచనలు తెలియజేయుటకు అవకాశం ఉంది. కుటుంభంలో అందరితోనూ చర్చించుటకు ప్రయత్నం చేయండి అవతలి వారి సూచనలు పరిగణలోకి తీసుకోండి మంచిది. ప్రయాణాల మూలాన అనుకోని ఖర్చులు కలుగుతాయి వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. మిత్రులతో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది సర్దుబాటు విధానం అన్నివిధాల శ్రేయస్కరం మంచిది కూడా


కర్కాటక రాశి

 వారం మొత్తం మీద మీరు తలపెట్టిన పనుల్లో అమితమైన ఇస్టంను కలిగి ఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. పని ఒత్తిడి మాత్రం తప్పక పోవచ్చును ఆచితూచి వ్యవహరించుట మూలాన మరింత అనుకూలమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఒక అశుభవార్తను వినే అవకాశం ఉంది మానసికంగా దృడంగా ఉండే ప్రయత్నం చేయండి. ధనమునకు సంభందించిన విషయాల్లో  పెద్దల సూచనలు పరిగణలోకి తీసుకొని నిర్ణయాల చేయుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాల వలన స్వల్ప ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్త. వాహనముల విషయంలో జాగ్రత్తగా ఉండుట ఉత్తమం. కొన్ని కొన్ని ఆలోచనలు వివాదములకు దారితీసే అవకాశం ఉంది కావున అనుభవజ్ఞుల సూచనలు పాటించుట చేత మేలుజరుగుతుంది


సింహ రాశి

వారం మొత్తం మీద మీరు మిశ్రమ ఫలితాలు పొందుతారు ఆరంభంలో తలపెట్టిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. చివరలో ప్రణాళిక అవసరం అలాగే మిత్రులు,పెద్దల సహాకారం చేత పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కుటుంభసభ్యులతో ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం చేయండి. కొందరి ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చును సర్దుకుపోవడం మేలు. ఉద్యోగంలో అధికారులతో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట మంచిది. వివాదములకు అవకాశం ఇవ్వకండి దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. వ్యతిరేక వర్గం ఆలోచనలు పసిగట్టుట చేత కొంత సమస్యలు తగ్గుతాయి. ప్రయాణాలు చేయునపుడు చిన్న పాటి జాగ్రత్తలు తీసుకోవడం వలన ఇబ్బందులు తగ్గుతాయి.

 

కన్యా రాశి

వారం మొత్తం మీద మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకొనే ముందు పర్యవసనం ఆలోచించుట అనేది సూచన. తొందరపాటు నిర్ణయాలు తీసుకొంటే నష్టపోతారు జాగ్రత్త. నూతన ప్రయత్నాలు కలిసి రావు వేచిచూసే దోరణి మంచిది. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. పెద్దలతో ఆలోచనలు పంచుకుంటారు  వారి సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు. వ్యాపారంలో ఊహించని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. దైవసంభందమైన విషయలకు సమయాన్ని ఇవ్వడం వలన మానసికంగా ప్రశాంతత ఉంటుంది. అనారోగ్యసమస్యలు పెరుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి భోజనం చేయుట మంచి ఆహరం తీసుకోవడం సూచన

 

తులా రాశి

ఈవారం మొత్తంమీద ఆరంభం మంచిగా ఉన్న మధ్యలో కొంత ఆలోచనల వలన తికమకను పొందుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సంతోషంగా గడుపుటకు ఆస్కారం కలదు. ప్రయాణాలు కలిసి వస్తాయి నూతన ప్రయత్నాలు కలిసి వత్సాయి. కుటుంభంలో శుభకార్యములు జరుగుటకు అవకాశం కలదు. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు పొందుతారు. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన మేలుజరుగుతుంది. శ్రమకు తగ్గఫలితం పొందుటకు అవకాశం ఉంది.  వ్యాపారస్థులకు పెద్దల సూచనలు పాటించుట మంచిది. కళారంగంలోని వారికి కుటుంభంలోని వ్యక్తుల ద్వార నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త.

 

వృశ్చిక రాశి

వారం మొత్తం మీద మీరు పెద్దలు,అనుభవజ్ఞుల సలహాలను అమలు చేసే ప్రయత్నం చేయుట మంచిది. నలుగురిలో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది చేసే ప్రయత్నాలు సంతృప్తికరమైన ఫలితాలు ఇస్తాయి. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు శ్రమను మాత్రం కలిగి ఉంటారు. మంచి,చెడు అలాగే విజయం,అపజయం అనేవి మిత్రులుగా కొనసాగే అవకాశం ఉంది.  అధికారుల నుండి మెప్పును పొందుతారు కాకపోతే తోటి ఉద్యోగులతో ఆహంకారం ప్రదర్శించక పోవడం మేలు. కుటుంభసభ్యులతో సమయాన్ని సంతోషంగా గడుపుటకు ఆస్కారం కలదు,ఊహించని ఖర్చులు కలుగుతాయి జాగ్రత్త . ప్రయాణాలు కలిసి వస్తాయి కాకపోతే ముందుచూపు అవసరం. వ్యాపరపరమైన విషయల్లో మాత్రం బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.   

 

ధనస్సు రాశి

వారం మొత్తం మీద మీరు ఆరంభంలో అధికమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది తగ్గించుకోండి. విందులు,వినోదాలకు సమయాన్ని ఇస్తారు చిననాటి మిత్రులతో ఆలోచనలు పంచుకుంటారు సరదగా గడుపుతారు. వ్యాపరంలో పనులు కాస్త ఆలస్యంగా పూర్తిఅయ్యే అవకాశం కలదు కావున తొందరపాటు వద్దు. ప్రయాణాలు మాత్రం కలిసి వస్తాయి దూరప్రదేశం నుండి వార్తలు వినే అవకాశం ఉంది. మిమ్మల్ని అభిమానించే వారిని కలుస్తారు కాకపోతే కుటుంభసభ్యులతో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. అందరిని కలుపుకొని వెళ్ళండి మంచిది. ఉద్య్గోగంలో గత కొంతకాలంగా ఉన్న సమస్య ఒక కొలిక్కి వస్తుంది మీ అనుకున్న వారి మూలన ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు చేయక పోవడం ఉత్తమం.


మకర రాశి

వారం మొత్తం మీద మీరు కుటుంభంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. ఆరంభంలో బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. బంధువులతో వ్యాపారపరమైన విషయల్లో కలిసి పనిచేయక పోవడం మంచిది. ఖర్చుల పెరుగుట మూలాన కొంత సమస్యలు కలుగుతాయి జాగ్రత్త.  ఊహించని విధంగా కొన్ని మార్పులు రావడం మూలాన కొంత సందిగ్దంలో పాడుతారు ఎటువంటి ఆలోచనలు చేయకండి మీ పనిని మీరు చేయుటకు ప్రాధాన్యం ఇవ్వడం చాలు కాలం సమస్యను పరిష్కరిస్తుంది. అధికారుల నుండి పనిభారం తప్పక పోవచ్చును,నలుగురిని కలుపుకొని వెళ్ళుట చేత మేలుజరుగుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది.


కుంభ రాశి

వారం మొత్తం మీద మీరు చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. తలపెట్టిన పనులలో నూతన అవకశాలు కలుగుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన మేలుజరుగుతుంది నలుగురిని కలుపుకొని వెళ్ళండి మంచిది. వ్యతిరేకవర్గం వలన నూతన సమస్యలు కలుగుతాయి జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. కుటుంభంలో సభ్యులు తీసుకొనే నిర్ణయాలు మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది కావున జాగ్రత్త అవసరం. ప్రయాణాలు చేయక పోవడం ఉత్తమం. వ్యాపారపరమైన విషయల్లో వారం ఆరభంలో నిర్ణయాలు తీసుకోండి మంచిది. మిత్రులతో చర్చలు చేయునపుడు కొంత రహస్యం ఉంచుకొనే విధంగా ముందుకు వెళ్ళుట అనేది సూచన. దైవపూజలు అవసరం.

 

మీన రాశి

వారం మొత్తం మీద పెద్దలను కలుస్తారు మీ ఆలోచనలు వారికి తెలియ జేసే అవకాశం కలదు. మీరు కుటుంభంలో పెద్దలతో మీ నిర్ణయాలు పంచుకుంటారు. సోదరవర్గం నుండి కొంత వ్యతిరేకత వచ్చిన దానిని అదిగమిస్తారు. తలపెట్టిన పనులు కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది అయినను వాటిని విజయవంతంగా పూర్తిచేయుట ద్వార మంచి గుర్తింపును పొందుతారు. స్థిరమైన ఆలోచనలు చేయుట వలన మరింత లాభం చేకూరుతుంది నిదానం అవసరం. మిత్రుల వలన కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది శ్రమతప్పదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. వ్యాపారంలో భాగస్వామితో స్వల్ప మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం ఉంది సర్దుబాటు మంచిది


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Addict