Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Addict

ఈ సంచికలో >> శీర్షికలు >>

పొట్లకాయ పెరుగు పచ్చడి - పి. శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు : పొట్లకాయ ముక్కలు (ఉడికినవి), పెరుగు, ఎండుమిర్చి, వెల్లుల్లి పాయలు, కరివెపాకు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి (చిన్నగా తరిగినవి), పసుపు, జీలకర్ర

తయారుచేసే విధానం : బాణలిలో నూనె వేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి పాయలు, కరివెపాకు, పసుపు, జీలకర్ర ఇవన్నీ బాగా వేగిన తరువాత ఈ పోపు మిశ్రమంలో ఉడకబెట్టిన పొట్లకాయ ముక్కలను వేసి 2 నిముషాల తరువాత స్టవ్ ఆర్పేయాలి. వెంటనే పెరుగు, ఉప్పు వేసి కలపాలి. తరువాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ!

మరిన్ని శీర్షికలు
gunde ootalu(naaneelu)