Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with sneha

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష : జంప్‌ జిలానీ

Movie Review - Jump Jilani

చిత్రం: జంప్‌ జిలానీ
తారాగణం: అల్లరి నరేష్‌, ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్‌, రావు రమేష్‌, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, ఎంఎస్‌ నారాయణ, భరత్‌, రఘుబాబు, తాగుబోతు రమేష్‌, వేణుమాధవ్‌ తదితరులు
ఛాయాగ్రహణం: దాశరధి శివేంద్ర
సంగీతం: విజయ్‌ ఎబెనెజర్‌
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్‌, రిలయన్స్‌
దర్శకత్వం: ఇ. సత్తిబాబు
నిర్మాత: అంబికా కృష్ణ
విడుదల తేదీ: 12 జూన్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే:
సత్తిబాబు (అల్లరి నరేష్‌)కి ఓ రెస్టారెంట్‌ వుంటుంది. ఆ రెస్టారెంట్‌ మూసివేతకు నోటీసులు ఇస్తుంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మాధవి (ఇషా చావ్లా). అయితే ఆ తర్వాత వారిద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. ఇంకోపక్క రాంబాబు (అల్లరి నరేష్‌), చిల్లర దొంగతనాలు చేసి జైలుకెళ్ళొస్తాడు. సత్తిబాబు, రాంబాబు అన్నదమ్ములు. కొన్ని వివాదాలు సత్తిబాబు, రాంబాబుల రెస్టారెంట్‌ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. అదే సమయంలో మాధవికి, ఉగ్ర నరసింహారెడ్డి (పోసాని)తో పెళ్ళి ఫిక్స్‌ అవుతుంది. తన రెస్టారెంట్‌ని సత్తిబాబు ఎలా కాపాడుకున్నాడు? తమ్ముడు రాంబాబుని ఎలా దార్లోకి తచ్చుకున్నాడు? ఉగ్ర నరసింహారెడ్డితో మాధవి పెళ్ళి జరిగిందా?లేదా? ఇదంతా మిగతా కథ. తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే:
సత్తిబాబు, రాంబాబు పాత్రల్లో అల్లరి నరేష్‌ రాణించాడు. అయితే నటుడిగా పూర్తిస్థాయి ఎనర్జీని మాత్రం అల్లరి నరేష్‌ ఈ చిత్రంలో ప్రదర్శించలేకపోయాడు. రెండు పాత్రలకూ మాత్రం న్యాయం చేయగలిగాడు. ఇషా చావ్లా అటు హోమ్లీ లుక్‌తోపాటు, ఇటు హాట్‌హాట్‌గానూ కవ్వించేలా కన్పించి ఆకట్టుకుంది. స్వాతి దీక్షిత్‌ ఓకే. పోసాని నవ్వులు పూయించాడు. రావు రమేష్‌ పెర్‌ఫెక్ట్‌. వేణుమాధవ్‌ మామూలే. కోట, ఎమ్మెస్‌నారాయణ, రఘుబాబు తదితరులు తమ పాత్రల పరిధుల మేర నటించారు.

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే. పాటలు మాత్రం అంత ఎనర్జిటిక్‌గా లేవు. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్‌ ఓకే. కాస్ట్యూమ్స్‌ బాగా డిజైన్‌ చేశారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వర్క్‌ బావుంది. డైలాగ్స్‌ బాగున్నాయి. స్క్రిప్ట్‌ యావరేజ్‌గా వుంది. స్క్రీన్‌ప్లే ఇంకాస్త షార్ప్‌గా వుండి వుండాల్సింది. రిచ్‌ ప్రెజెంటషన్‌తో సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. కొన్ని చోట్ల నేరేషన్‌ చాలా బావుందన్పిస్తుంది.

తమిళంలో వచ్చిన ‘కలకాలప్పు’ సినిమాకి ఇది తెలుగు రీమేక్‌. ఒరిజినల్‌లో వున్న స్పీడ్‌, రీమేక్‌లోనూ ప్రదర్శించడంలో తెలుగు దర్శకుడు కాస్త వెనకబడ్డాడనే చెప్పాలి. ఫస్టాఫ్‌లో స్పీడందుకోవడానికి చాలా టైమ్‌ పట్టింది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ బావుంది. సెకెండాఫ్‌ ఇంకాస్త బావుండాల్సింది. కానీ కొన్ని చోట్ల సాగతీత కన్పించింది. ఓవరాల్‌గా చూస్తే సినిమాకి వచ్చే ప్రేక్షకులకు నవ్వులు గ్యారంటీ. బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌ నుంచి ఎబౌ యావరేజ్‌ సినిమాగా నిలిచిపోయే అవకాశాలు ఎక్కువ

ఒక్క మాటలో చెప్పాలంటే: వుండాల్సిన స్పీడ్‌ లేదు

అంకెల్లో చెప్పాలంటే: 2.5/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka