Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
22nd maaya movie songs

ఈ సంచికలో >> సినిమా >>

రికార్డులు తిరగరాసేయనున్న ‘కిక్‌’

kik come to back with salman khan

సల్మాన్‌ఖాన్‌ కొత్త సినిమా ‘కిక్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో హీరో రవితేజ, దర్శకుడు సురేందర్‌రెడ్డిల ‘కిక్‌’ సినిమా పెద్ద విజయమే సాధించింది. ఇలియానా ఈ సినిమాలో హీరోయిన్‌. తమిళ నటుడు ‘శామ్‌’ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమాని చూసిన సల్మాన్‌ఖాన్‌, హిందీలోకి అదే పేరుతో రీమేక్‌ చేసుకున్నాడు.

సాజిద్‌ నడియడ్‌వాలా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఈ సినిమాపై చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ‘దబాంగ్‌’ సినిమాతో బాక్సాఫీస్‌పై మళ్ళీ పట్టు సాధించిన సల్మాన్‌ఖాన్‌, ‘కిక్‌’తో బాలీవుడ్‌కి అతి పెద్ద హిట్‌ ఇస్తాడని అతని అభిమానులు అంచనా వేశారు. బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలు కూడా ‘కిక్‌’ ఓపెనింగ్స్‌ కనీ వినీ ఎరుగని రీతిలో ఉంటాయని అంచనా వేయడం జరిగింది ఇప్పటికే. సల్మాన్‌ఖాన్‌కి బాగా కలిసొచ్చిన ‘ఈద్‌’కి ఈ సినిమా విడుదలకానుంది. ఈ హిందీ ‘కిక్‌’లో సల్మాన్‌ఖాన్‌ సరసన జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్‌గా నటించింది. హాలీవుడ్‌ రేంజ్‌లో యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఈ సినిమాకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌ కానున్నాయి. సినిమా ఎలా వున్నా రికార్డులు ఖాయమని, కాస్త పాజిటివ్‌ టాక్‌ వస్తే, ఆ రికార్డులు కనీ వినీ ఎరుగని రీతిలో ఉంటాయనే అంచనాలు ఎంత నిజమవుతాయో చూడాలిక.

మరిన్ని సినిమా కబుర్లు
colour ful telugu movie ishaatalvaar