Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope June 20- June 26

ఈ సంచికలో >> శీర్షికలు >>

క్యాబేజీ మసాలా కర్రీ - పి. శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు : క్యాబేజీ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, మసాలా పౌడర్

తయారుచేసే విధానం : ముందుగా బాణలిలో నూనె వేసి వేడి చేసుకుని అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఉంచాలి. ఉల్లిపాయ వేగుతున్నప్పుడు దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి కలిపి మూత పెట్టాలి. తరువాత దానిలో కాబేజీ, కొంచెం ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. 10 నిమిషాల తరువాత మూతతీసి మసాలా పౌడర్ వేసి కలపాలి. కలిపి 5 నిమిషాల తరువాత దించితే గుమగుమలాడే క్యాబేజీ మసాలా రెడీ.

మరిన్ని శీర్షికలు
Gunde Ootalu(naaneelu)