Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with sirasri

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - మైనే ప్యార్‌ కియా

Movie Review - Maine Pyar Kiya

చిత్రం: మైనే ప్యార్‌ కియా
తారాగణం: ప్రదీప్‌, ఇషా తల్వార్‌, కోమల్‌ ఝా, మధుమిత, సత్యదేవ్‌ తదితరులు
ఛాయాగ్రహణం: విశ్వేశ్వర్‌ ఎస్‌వి
సంగీతం: వి. ప్రదీప్‌కుమార్‌
నిర్మాణం: యూనిఫై క్రియేషన్స్‌
దర్శకత్వం: ప్రదీప్‌ మాడుగుల
నిర్మాత: సానా వెంకటరావు, ఉపేంద్రకుమార్‌
విడుదల తేదీ: 20 జూన్‌ 2014

క్లుప్తంగా చెప్పాలంటే:
తను పనిచేసే ఆఫీస్‌లో హెచ్‌ఆర్‌ మేనేజర్‌ (కోమల్‌ ఝా)ని లవ్‌ చేస్తాడు ఓ యువకుడు (ప్రదీప్‌). ఆ హెచ్చార్‌ మేనేజర్‌ ఆ యువకుడి ప్రేమను తిరస్కరిస్తుంది. ఈలోగా కొత్తగా రిక్రూట్‌ అవుతుందో అందమైన అమ్మాయి ఆ ఆఫీస్‌లో. ఆ అమ్మాయికీ, మన హీరోగారికీ మధ్య లవ్‌ మొదలవుతుంది. ఇక్కడో ట్విస్ట్‌ ఏంటంటే, ఆ అందమైన అమ్మాయికీ, మన హీరోగారికీ మధ్య చిన్ననాటి ఎపిసోడ్‌ ఒకటి ఫ్లాష్‌బ్యాక్‌లో వుంటుంది. అదేమిటి.? అన్నది తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే:
హీరోగా ప్రదీప్‌ ఆకట్టుకున్నాడు. చక్కని స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో, కావాల్సిన ఎక్స్‌ప్రెషన్స్‌తో నటుడిగా రాణించాడు. ఇషా తల్వార్‌ గ్లామరస్‌గా కన్పించింది. తన అందంతో ఆట్టుకుంది. తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయిందామె. చాలాకాలం తర్వాత తెలుగు తెరపై కన్పించింది మధుమిత. పెళ్ళయ్యిందంటే నమ్మలేనంత క్యూట్‌గా కన్పించింది. తంగవేలు పాత్రలో వెన్నెల రామారావు జీవించాడు. మంచి అవకాశాలొస్తే తానేంటో నిరూపించుకోగల సత్తా ఆయనకుంది. అతని పాత్ర ఇంకా ఎక్కువగా వుంటే బావుండేదన్పిస్తుంది. పోసాని, మహేష్‌ కత్తి గే రోల్స్‌లో కాస్తంత ఓవర్‌గా నటించారు. పోసాని ట్రేడ్‌ మార్క్‌ నటన మాత్రం ఆకట్టుకుంటుంది.

మ్యూజిక్‌ ఫర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఓకే. ఎడిటింగ్‌ ఇంకాస్త బెటర్‌గా వుండాల్సింది. ‘అద్వైతం’ అనే షార్ట్‌ ఫిలిం తెరకెక్కించిన ప్రదీప్‌ మాడుగుల, ఈసారి కమర్షియల్‌ అంశాలతో కూడిన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మంచి కథ, కథనంతో ఆకట్టుకున్నాడు. దర్శకుడిగా మంచి ప్రయత్నమే చేశాడనుకోవచ్చు. ఫస్టాఫ్‌ ఓకే అన్పిస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బావుంది. సెకెండాఫ్‌ స్టార్టింగ్‌ నుంచీ ఒకే ఫేజ్‌లో ముందుకు వెళ్తుంది. చివర్లో గే కామెడీ కాస్త విసుగు తెప్పిస్తుంది. క్లయిమాక్స్‌ వరకూ గ్రిప్పింగ్‌గానే సినిమా నడిపించడం బావుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే: మైనే ప్యార్‌కియా.. ఓ సారి చూడొచ్చు

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka