Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pavan shirt off

ఈ సంచికలో >> సినిమా >>

4 నిమిషాల్లో 19 హీరోల అనుకరణ

19 Heroes in 4 Minits

4 నిమిషాల్లో 19 మంది స్టార్ హీరోల నృత్యరీతుల్ని అనుకరించడం అరుదైన విషయం. అయితే ఈ విన్యాసాన్ని ఒక యానిమేషన్ హీరో చేస్తున్నాడు. 7 సీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు రూపొందించిన లవ్ స్టార్ అనే యానిమేషన్ హీరో 19 మంది హీరోల డ్యాన్సింగ్ స్టైల్స్ ని అనుకరిస్తూ 4 నిమిషాల పాటు సాగే పాటలో నర్తించనున్నాడు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా ఈ పాటను చిత్రీకరించారు.

మరో విశేషం ఏమిటంటే 'దేఖో దేఖో ముఝే దేఖొ...చూడు చూడు నన్నే చూడు...' అంటూ మొదలయ్యే ఈ పాటలో తెలుగు, హింది, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ వంటి అనేక భాషలు వినిపిస్తాయి. ఇది పూర్తి స్థాయి భారతీయ యానిమేషన్ ప్రతిభతో రూపొందించిన వీడియో అని, ఇది ఒక ట్రయల్ వెర్షన్ గా ఇంటెర్నెట్ లో తీసుకువస్తున్నామని, త్వరలోనే ఒక భారీ యానిమేషన్ చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని 7 సీస్ సంస్థ అధినేత మారుతి శంకర్ చెప్పారు.

ఈ పాటలో మైకేల్ జాక్సన్, రజిని కాంత్, అల్లు అర్జున్, హృతిక్ రోషన్, అమితాబ్, పవన్ కళ్యాణ్, అమీర్ ఖాన్, ప్రభాస్, మహేష్ బాబు, ఉపేంద్ర, సల్మాన్ ఖాన్, ధనుష్, సంజయ్ దత్, జూ ఎంటీయార్, ఏయన్నార్, ఎంటీయార్ వంటి హీరోల నృత్యాలను అనుకరిస్తాడు లవ్ స్టార్.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi choodddam