Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
22nd Episode

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐ.ఏ.ఎస్ పాస్

 జరిగిన కథ:
కిట్టు తండ్రి మాట విని పెళ్ళి చేసుకుని హ్యాపీగా తన సన్నీపై భార్యతో హైద్రాబాద్ ను మొత్తం చుట్టేస్తాడు. ఈ ఎంజాయ్ లో సివిల్స్ ను కూడా మర్చిపోతాడు.;

ఏమిటా సబ్జెక్టులు?
డాక్టర్ సబ్జెక్టులు,
ఇంజనీర్ సబ్జెక్టులు,
వ్యవసాయ శాస్త్ర సబ్జెక్టులు,
సమాజ శాస్త్రం,
భౌగోళిక శాస్త్రం,
ఆర్థిక శాస్త్రం,
యూపీయస్సీ వారు గుర్తించిన ప్రాంతీయ భాషా సాహిత్యాలు,
ఇంగ్లీష్ సాహిత్యం,
మానవ శాస్త్రం,
భౌతిక శాస్త్రం,
రసాయన శాస్త్రం,
వృక్ష శాస్త్రం,
జీవ శాస్త్రం,
కామర్స్,
మేనేజ్ మెంట్,
రాజకీయ శాస్త్రం,
పాలనా శాస్త్రం,
చరిత్ర,
న్యాయశాస్త్రం,
తత్వ శాస్త్రం,
గణిత శాస్త్రం,
మనోవైజ్ఞానిక శాస్త్రం...

ఇలా పెద్ద లిస్ట్ 'ఎంప్లాయ్ మెంట్ న్యూస్ 'లో ఇస్తారు. వాటిల్లోంచి రెండు సబ్జెక్టులు ఎన్నుకోవాలి. మనకిష్టమైనవి ఏవొ రెండు ఎన్నుకోవాలి. మళ్లీ చిన్న మెలిక వుంది. ఏయే సబ్జెక్టులు కలసి ఎన్నుకోకూడదో ఒక లిస్ట్ వుంటుంది. దాని ప్రకారం చూసి ఎన్నుకోవాలి.

ఇదెలాంటిదంటే పొట్లకాయ, కోడిగుడ్డు కలిపి వండకూడదు, మంచిది కాదు. అటువంటిది... అదో నమ్మకం. అలాగే ఏది పొట్లకాయో, ఏది కోడిగుడ్డో యూపీయస్సీ చెప్తుంది. దాని ప్రకారం ఎన్నుకోవాలి. ఇంకో ప్రశ్న వస్తుంది. "నేను డిగ్రీలోనూ, పీజీలోనూ చరిత్ర చదివాను. కానీ, నాకు లెక్కల్లో మంచి పట్టు వుంది. లెక్కల సబ్జెక్ట్ తీసుకోవచ్చా?..."

"నిక్షేపంగా, నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

"ఎవరూ ఏమీ అనరు కదా!"

"ఎవరూ ఏమీ అనరు..."

"నేను భౌతిక శాస్త్రం చదివాను... న్యాయశాస్త్రం తీసుకోవచ్చా...?"

"తప్పకుండా"

"యూపీయస్సీ వారిచ్చిన సబ్జెక్టులలో డిగ్రీలో ఏ సబ్జెక్ట్ చదివారన్న దానితొ సంబంధం లేదు. ఏవైనా రెందు సబ్జెక్టులు తీసుకోవచ్చు..."

"ఏవి తీసుకుంటే మంచిది?"

ప్రతి సబ్జెక్టుకూ చెట్టుకున్నట్టుగా రకరకాల శాఖలు (కొమ్మలు) వుంటాయి.

చెట్టు కాండంతో మొదలుపెడితే కొన్ని చెట్లకు శాఖోపశాఖలు (కొమ్మ, కొమ్మకో కొమ్మ) వుంటాయి. సాధారణంగా అందరూ చేసే పని ఏమిటంటే నాలుగైదేళ్లు చదివే ఇంజనీరింగ్, డాక్టర్ సబ్జెక్టుల జోలికి వెళ్లరు. అవి శాఖోపశాఖలుగా విస్తరించి వున్నాయి.

గుర్తించదగిన విషయమేమిటంటే... ఆ సబ్జెక్టులతొ పరీక్షలు నెగ్గిన వారున్నారు...

ఎక్కువమంది... ఇంజనీర్లుగానీ, డాక్టర్లుగానీ, లాయర్లుగానీ, సీఏలుగానీ ఎవరైనా తీసుకునేవి..."

"సోషల్ సైన్సులు"

ఇక హైద్రాబాద్ విషయానికొస్తే ఎక్కువగా తీసుకునేవి.

మొదటగా ప్రభుత్వ పాలనా శాస్త్రం, ఆ తర్వాత సమాజశాస్త్రం... చరిత్ర, మానవశాస్త్రం, భౌగోళిక శాస్త్రం, తెలుగు సాహిత్యం, రాజకీయ శాస్త్రం, ఈ మధ్యన కొద్దిగా మనోవైజ్ఞాన శాస్త్రం...

మిగిలిన సబ్జెక్టులకు కోచింగ్ దొరకటం చాలా కష్టం...

ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఎక్కువగా చదివి తొందరగా మార్కులు రాలగొట్టుకోవచ్చు?

ప్రభుత్వపాలనా శాస్త్రం చాలా తేలిక అనీ, అ, ఆ లు రాకపోయినా తెలుగు సాహిత్యం తేలికనీ, చాలా ఉపయోగపడుతుందనీ చరిత్రని, ర్లా వేలం వెర్రిగా ఏదో ఒక సబ్జెక్ట్ ఎవడో తీసుకున్నాడనీ, ఎవడో చెప్పాడనీ తీసుకుని పళ్లు రాలతొట్టుకున్నవాళ్లున్నారు."

"మరైతే సబ్జెక్టులు ఎన్నుకోవడం ఎలా?"

:ప్రతి మనిషికీ ఇష్టాయిష్టాలుంటాయి. ప్రతి మనిషి రక్తంలోనూ ఒక సబ్జెక్ట్ వుంటుంది.

'ఉదాహరణకు శ్రీనివాస రామానుజం రక్తంలో గణిత శాస్త్రం వుంది. ఐన్ స్టీన్ రక్తంలో భౌతిక శాస్త్రం కలసిపోయి వుంది.'
బ్లడ్ గ్రూప్ శాంపిల్ తీస్తే ఈ సబ్జెక్ట్ విషయం బయటపడదు.

చిన్నప్పట్నుంచీ మనం ఏ సబ్జెక్టుని బాగా చదివాం? ఏ మేష్టారి క్లాసంటే భయపడి చచ్చేవాళ్లం... అనే విషయాల్ని జాగ్రత్తగా నెమరు వేసుకోవాలి. తనంతట తనే బయటకు వస్తుందది. అలాతే డిగ్రీ, పీజీ స్థాయుల్లో మనం దేన్ని ఇష్టపడ్డాం? అనేది కూడా జాగ్రత్తగా నెమరు వేసుకోవాలి. ఇష్టమైనది తీస్లుకుంటే కష్టమనిపించదు... పర్వతారోహణ చేసేవాళ్లకు ఈ చలి, మంచు, శారీరక శ్రమ ఇష్టంగానే వుంటుంది. ఇషటమైన సబ్జెక్టులు తీసుకుంటే కష్టంగా వుండదు.

'నా సబ్జెక్టులు కాని సబ్జెక్టులు తీసుకోవాలనుకుంటున్నాను. అంతకు ముందెన్నడూ చదవలేదు.

ఆ సబ్జెక్ట్ నాకులా తెలుస్తుంది?'

'ముందుగా ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్టుకి సంబంధించి ఒక మంచి పుస్తకాన్ని సంపాదించి చదవడం మొదలుపెట్టాలి. పుస్తకం పూస్తయిందంటే... ఆ సబ్జెక్ట్ మీకు ఇష్టమని... ఈ పుస్తకం చదువుతూ చదువుతూ నిద్రపోయారంటే ఆ సబ్జెక్ట్ మీకు సరిపడదని '
'ఇంత కష్టపడాలా? సబ్జెక్ట్ ఎంచుకోవడానికి...?

'కష్టపడడం ఇష్టం లేకుంటే హాయిగా ఇంటికి వెళ్లవచ్చు '

'హైద్రాబాద్లో చాలా కోచింగ్ సెంటర్లున్నాయి '

'ఏది భెస్ట్?'

'కోచింగ్ సెంటర్లకంటే ముఖ్యం ఏ సబ్జెక్ట్ ని, ఎవరు బాగా చెబుతున్నారనేది ముఖ్యం...'

చరిత్ర విషయానికొస్తే గోపాలరెడ్డిగారు ఏ కోచింగ్ సెంటర్లో బోధిస్తున్నారో ఈ కొచింగ్ సెంటర్ కు చరిత్ర కోసం వెళ్లవచ్చు. (తరువాతి కాలంలో గోపాలరెడ్డిగారు పరమాత్మునిలో ఐక్యమయ్యారు.)

'మానవశాస్త్రానికి మునిరత్నం రెడ్డిగారు...' 'దివంగత జీవీ సిబ్రహ్మణ్యంగారు తెలుసు సాహిత్యానికి... ఇలా ముందుగా తెలుసుకుని ఏ సబ్జెక్ట్ ని ఎవరు బాగా బోధిస్తారో దాని ప్రకారం కోచింగ్ సెంటర్లకు వెళ్లాలి '

'మరి ఇప్పుడు ఏ సబ్జెక్ట్ ని ఎవరు బాగా చెప్తున్నారో ఎలా తెలుస్తుంది?'
తిరగాలి... తెలుసుకోవాలి...

'కోచింగ్ సెంటర్ల ప్రకటనలకు మోసపోకూడదు...'

'నేను ఎంచుకున్న సబ్జెక్ట్ కోసం ఏమేం పిస్తకాలు చదవాలో ఎలా తెలుస్తుంది?'

'ప్రస్తుతానికి 'సివిల్ సర్వీసెస్ క్రానికల్ ' వాళ్లు ఒక పుస్తకాన్ని ముద్రించారు. దాంట్లొ ఏమేం పుస్తకాలు చదవాలో రాసి వుంది ' త్వరలో గూగుల్ అనే కంప్యూటర్ యంత్రం రానుంది. దానికో కొబ్బరికాయ కొట్టి, దండం పెడితే పూర్వకాలంలో మాంత్రికుడు చూపించినట్టుగా అన్నీ తెలియజేస్తుంది ' అవసరమైనవీ, అవసరం లేనివాటిన్నింటినీ పూర్తిగా చూపిస్తుంది. అవసరం వున్నవాటికంటే అనవసరమైనవి ఆకర్షిస్తాయి. దారి మళ్లకూడదు. ఈ గూగుల్ యంత్రం మూల మూల గ్రామాలకీ విస్తరించగలదు. తాయత్తులాంటి మంత్రశక్తి కలది ఈ గూగుల్ యంత్రం. గ్రామాల నుండి సివిల్స్ కి ప్రిపేరయ్యేవారు ఈ గూగుల్ యంత్రాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. కావాల్సిన సమాచారాన్ని సేకరించుకోవచ్చు.

అయినా కొద్దికాలం తర్వాత ఈ సబ్జెక్టులను కూడా తీసిపారేసే అవకాశం వుంది. అప్పుడు జనరల్ స్టడీస్ మాత్రం బాగా విస్తృతంగా చదవాల్సి వుంటుంది.

ఇలా వివరాలన్నింటినీ సేకరించాడు కిట్టు.

ఇక తన వంతుగా సబ్జెక్టులను ఎన్నుకోవాలి.

జీవీ సుబ్రహ్మణ్యంగారంటే పెద్ద పేరంట...! చూద్దాం అనుకున్నాడు కిట్టు.

తెలుగు సాహిత్యం ఎలా వుంటుందిట?

ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యంగారి క్లాసుకు పర్మిషన్ తీసుకుని, అసలేంటో తెలుసుకుందామని వెళ్లాడు కిట్టు. కళ్లు మూసుకుని ధ్యానంలో వున్నట్టుగా బోధిస్తున్నారు సుబ్రహ్మణ్యం శాస్త్రిగారు. విద్యార్థులవైపు చూడడంలేదు. అలవోకగా పదాలు, పదసంబంధాలు ఆయన నోటినుండి జాలువారుతున్నాయి. అందరూ శ్రద్ధగా వింటున్నారు.

మధ్యలో ఒకసారి ఆయనను ఆపుజేశాడు కిట్టు... మళ్లీ ఒకసారి చెప్పండి అని... సాధారణంగా ఆయనను ఆపే ప్రయత్నం చేయరు విద్యార్థులు... కిట్టుకి కొత్త కాబట్టి... ఆయన్ను ఆపాడు. ఏదో వ్రతభంగమైనట్టుగా కళ్లు తెరిచాడాయన.

కిట్టు వేపు చూసి అన్నారు. 'ఏమిటి మళ్లీ చెప్పాలి?'

'ఇందాక చెప్పిందే మళ్లీ ఒకసారి చెప్పండి...'

'ఇందాక ఏం చెప్పానో గుర్తులేదు ' అన్నారాయన.... మళ్లీ ఆయనే అన్నారు.

'నా ప్రవాహంలో నేను కొట్టుకుపోతూంటాను. ఆ సమయానికి నా ఆలోచన ఏమిటో అది వెళ్లిపోతుంది. మళ్లీ నీ కోసం దాన్ని జ్ఞాపకం తెచ్చుకుని ఇప్పుడు చెప్పలేను. ఒకవేళ చెప్పినా ఇప్పుడు చెప్పింది ఇంకో విధంగా వుంటుంది.' సివిల్ సర్వీసులకు కావాల్సిందే వైవిధ్యం. ఎప్పుడూ అందరూ రాసేదే మూసగా రాస్తే మార్కులు పడవు...

ఈ విషయం కిట్టుకు తెలుసు. 'ఈయనేదో దైవాంశ సంభూతుడిలా వున్నాడు. చెప్పింది మళ్లీ చెప్పడంట. ఈయన దగ్గరే నేర్చుకోవాలి ' అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకోవడం, ఆ కోచింగ్ సెంటర్లో చేరడం జరిగిపోయింది.

నోట్స్ సంపాదించి చదువుకోవడం వేరు, గురువుకి ఏదురుగా కూర్చొని నేర్చుకోవడం వేరు...కిట్టుకి చిగిచ్చం జిల్లా పరిషత్ హైస్కూల్... దేవులపల్లి రామకృష్ణశాస్త్రిగారు... ఆయన తంబి అనడం అన్నీ కళ్లల్లో మెదులుతున్నాయి. దోవులపల్లి శిష్యుణ్ణి నేను... తప్పక సుబ్రహ్మణ్యంగారి బాటను అర్థం చేసుకోగలను. ఆ బాటలో నడపగలను. ఇలా అనుకుంటుంటే ఎంతో నిబ్బరంగా, ధైర్యంగా వుండేది కిట్టుకి. అప్పుడప్పుడూ గురువుగారు ధ్యానంలో నుండి బయటకు వచ్చి విద్యార్థులకు అర్థమయ్యిందో లేదో తెలుసుకోవడానికి ప్రశ్నలు వేసేవారు.
రెడీగా వుండేవాడు కిట్టు... వెంటనే అందుకుని, ప్రశ్నను బట్టి రాగయుక్తంగా పద్యమో, గద్యమో స్వచ్చంగా సమాధానం చెప్పేవాడు. అభినందనగానూ, సాలోచనగానూ చూసేవారు సుబ్రహ్మణ్యంగారు. మిగిలిన విద్యార్థులకిది కంటగింపుగా వుండేది. మమ్మల్ని చెప్పనివ్వకుండా వీడెవడ్రా మధ్యలో దూరుతున్నాడు... అన్నట్టుగా చూసేవారు.

జీవీ సుబ్రహ్మణ్యంగారు విద్యార్థులకు రాసుకోవడానికి ప్రత్యేకంగా సమయమిచ్చేవారు కాదు. ఆయన నోటినుండి వింటూ రాసుకోవడమే... ఒకసారి కిట్టు ఆయనతో అన్నాడు. గురువుగారూ... కొంచెం నెమ్మదిగా చెప్పండి. వేళ్లు బెణికిపోతున్నాయి... గురువుగారన్నారు "బెణికిపోతే కట్లు కట్టి మళ్లీ రాసుకో...' నా ప్రావాహానికి అడ్డుకట్ట వేయకు..." నిజమే కిట్టుకి మళ్లీ 'పరిషతున్నస పాటశాల ' గుర్తుకొచ్చింది... నోత్స్ రాయించి, దాన్ని మళ్లీ పరిశీలించి, సంగకాలు పెట్టేవారు కదా... ఎందుకు నీకు చేతులు నొప్పి పెట్టాలి? రాయరా... కిట్టూ... రాయరా... జై పరిషత్ హైస్కూల్... చింగిచ్చం... అనుకున్నాడు.

ఒకసారి గురువు గారిని అడిగాడు 'సార్! ఇంపార్టెంట్ ప్రశ్నలు చెప్పండి... సూటిగా కిట్టు వైపు చూసి అన్నారు గురువుగారు 'ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటూ పోతే మొత్తానికి గుండు కొట్టించుకుంటావు. ర్యాంక్ సంపాదించిన వాళ్లెవరూ నన్ను ఇలా అడగలేదు '

'అన్నీ ముఖ్యమే... సిలబస్ మొత్తం సంపూర్ణంగా చదువుకో'

తెలుగు సాహిత్యం...

తెలుగు సాహిత్యాన్ని చదవకూడదు...

అనుభవించాలి...

ఆస్వాదించాలి...

అందులో లీనమైపోవాలి.

తాదాత్మ్యం పొందాలి...

నన్నయ్య కవితా లక్షణాల్లో ఒకటి అక్షర రమ్యత... 'అక్షర రమ్యత ' అంటే అక్షరాలను అందంగా పేర్చి వాటితో అందమైన హర్మ్యాలను (భవనాలను) నిర్మించే విశ్వకర్మ (ఆర్కిటెక్ట్). ఇక, పోతనకు భక్తి పారవశ్యం పెరిగిపోతే, దేవుడినే రారా పోరా అంటాడు. దేవుడితో దెబ్బలాడతాడు.

.అల్లసాని వాని అల్లిక 'జిగిబిగి ' అంటారు.

'అల్లసాని పెద్దన ' పదాలను అల్లితే ఆ అల్లిక ఒక కళాఖండంలాగా వుంటుంది.

'గౌడ డిండిమభట్టు ' కంచు డక్కను పగలగొట్టించిన వాడు శ్రీనాథుడు.

ఎందుకు పగలతొట్టించాడో, ఎలా పగలగొట్టించాడో కథ సంగతి తరువాత గానీ, ఆ పదాలు ఏవో భావాల్ని కదుపుతాయి. గబగబా వాక్యం మొత్తం ఆగకుండా చదివితే మజా వస్తుంది.

'కుక్కపిల్లా, సబ్బుబిళ్లా, అగ్గిపుల్లా... కాదేదీ కవితకనర్హం' అన్నాడు శ్రీశ్రీ...

చిన్న చిన్నపదాలను రోజూ మనం వింటూంటాం, అంటూంటాం...

కానీ వీటిని ఎంత చక్కగా ఉపయోగించాడు శ్రీశ్రీ...

రోజూ యాపిల్ పండ్లు (సీమరేగు కాయలు అంటారు తెలుగులో) దబదబా రాలుతుడేవి...

ఎవరూ పట్టించుకోలేదు. పట్టించుకున్నవాడు న్యూటన్... గొప్ప శాస్త్రవేత్త... ఆ న్యూటన్ లాంటివాడు కాదా శ్రీశ్రీ?
గురజాడ అప్పారావు సమకాలీన సమాజాన్ని తన 'కన్యాశుల్కం'తో ఎక్స్-రే తీసినట్టుగా చూపించాడు.

ఏం పేలతాయంటే డైలాగులు... ఒక్కొక్క డైలాగూ సీమటపాకాయ్...

ఇక చలం... మంచివాడా, చెడ్డవాడా... ఇవన్నీ పక్కన పెడితే మనిషి ఆలోచనల్ని కదిపి, కుదిపేస్తాయి చలం రచనలు. ఇక తెలుగు భాష మీద ఎన్నో దురభిప్రాయాలున్నాయి.  'వ్రాయాలి ' అని రాస్తే 'కరెక్ట్' 'రాయాలి ' అని రాస్తే 'తప్పు '

'గుర్రం అని రాస్తే తప్పు...

'సంతకం చేసిన తర్వాత చివర్లో 'వ్రాలు ' అని రాయాలి.

ఇలాంటి రకరకాల దురభిప్రాయాలు తొలగిపోతాయి... తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే...

కంభంలో రకరకాల తెలుగు భాషల్ని బమనించాడు కిట్టు... ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది కిట్టుకి. మాండలికాలంటే ఏమిటో...! వాటి ప్రత్యేకత ఏమిటో...

ఒక జోకుంది... ఒకాయన ఉత్తరం రాసి, ఆఖర్న తనపేరు సుబ్బారావు అని రాసి, తనను తానే గౌరవించుకుంటూ పేరు పక్కన 'గారు ' అని రాసుకున్నాడంట. తిరుగు జవాబు రాసే ఆయన ఉత్తరం మొదలుపెట్టి, గౌరవనీయులైన సుబ్బారావు 'గారు ' గారికి అని రాశాడట... దానికి ఇవతల ఆయనకి కోపం పొడుచుకు వచ్చిందట...

ఇదో సున్నితమైన హాస్యం...

బ్రౌన్ మెచ్చినదీ తెలుగు భాష...దేశభాషలందు తెలుగు లెస్స... అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు...

కిట్టు తెలుగు పండితుడు అయిపోలేదు కానీ...

తెలుగు భాష గొప్పదనాన్ని అర్థం చేసుకునేటంత తెలివి మాత్రం తెచ్చుకున్నాడు.  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
21st Episode