Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

వంట వ‌చ్చిన‌వాడ్ని పెళ్లి చేసుకొంటా - ఇషా త‌ల్వార్‌

interview with isha talvar

చురుకైన చూపులు.. సెక్సీద‌నం ఉట్టిప‌డే క‌ళ్లు, దేనికైనా రెడీ అన్నట్టుండే బాడీ లాంగ్వేజ్‌... ఇషా త‌ల్వార్ సొంతం. త‌ల్వార్ అంటే కత్తి అని అర్థం. పేరుకు త‌గ్గట్టే ఇషా త‌ల్వార్ కత్తిలాంటి అమ్మాయి. గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌కు ప‌రిచ‌య‌మైంది. మొన్నామ‌ధ్య మైనే ప్యార్ కియాతో మ‌ళ్లీ ద‌ర్శన‌మిచ్చింది. ఈలోగా త‌మిళ‌, క‌న్నడ చిత్రసీమ‌ల చుట్టూ ఓ రౌండ్ వేసింది. ఓ చోట కుదురుగా కూర్చోరా...?  అని అడిగితే ``దేవుడు నాకు కాళ్లే కాదు.. వాటి కింద చ‌క్రాలూ ఇచ్చాడు. అందుకే దేశం చుట్టూ చ‌క్కర్లు కొట్టేస్తున్నా..`` అని న‌వ్వేస్తోంది. సినిమాని చాలా సీరియ‌స్‌గా తీసుకొన్న అమ్మాయి ఇషా.. అందుకే - ప్రొఫెష‌న‌ల్‌గా ఎద‌గాల‌నుకొంటోంది. ఇషాని మాట్లాడితే తానెంత ప్రొఫెష‌న‌లో అర్థం అవుతుంది. అందుకే ఆమెను మాట‌ల్లో దింపాం.

* గుండెజారే... మైనే ప్యార్‌కియా రెండూ ల‌వ్ స్టోరీలేనా?
- నా వ‌య‌సు ఎంత‌నుకొన్నారు..? జ‌స్ట్ ఇర‌వై ఆరు. ఈ వ‌య‌సులో చేయాల్సింది ప్రేమ క‌థ‌లే క‌దా..

* అమ్మాయిలు వ‌య‌సు దాచేస్తారు క‌దా?
- దాచుకోద‌గినంత ఎక్కువ వ‌య‌సు కాదు నాది. నాలుగేళ్లు పోతే.. చెప్పను లెండి (న‌వ్వుతూ)

* ల‌వ్‌స్టోరీలు ఎంజాయ్ చేస్తున్నార‌న్నమాట‌..
- య‌స్‌. ప్రేమ‌క‌థా చిత్రాలు యూత్‌కి బాగా ద‌గ్గర‌వుతాయి. క‌థానాయిక‌ల‌కూ అందులో స్కోప్ ఉంటుంది. గుండెజారిగ‌ల్లంత‌య్యిందేలాంటి సినిమాలు మ‌రిన్ని చేయాలి.

* మాస్‌, యాక్షన్ క‌థ‌ల్లో హీరోల‌దే రాజ్యమంటారు...
- ల‌వ్ స్టోరీల్లోనూ అంతే. కాక‌పోతే... ఇక్కడ హీరో మా వెంట ప‌డ‌తాడు. అక్కడ మేం వాళ్లవెంట ప‌డాలి.

* సినిమాల్ని బాగా అర్థం చేసుకొన్నారే..
- ఉంటోంది ఇక్కడే క‌దా.. ఈ మాత్రం తెలుసుకోలేక‌పోతే ఎలా..?  అయితే క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కున్న వాల్యూ వేరు. ఒక్క హిట్ ద‌క్కించుకొంటే ఎక్కడో ఉంటాం.

* మ‌రి నిజ జీవితంలో ప్రేమ‌...?
- మాటల్లో దించి నా ద‌గ్గర నుంచి అన్నీ లాగేయాల‌ని చూస్తున్నారు మీరు.. నెక్ట్స్ క్వశ్చన్...

* బ‌య‌టా ఇంతే చ‌లాకీగా ఉంటారా?
- ఊసూరుమంటూ కూర్చొంటే నాకు బోర్ బాబూ. అందుకే ఎప్పుడూ ఇలానే లొడ లొడ వాగుతూ ఉంటా. ఇంట్లోవాళ్లు నా గోల భ‌రించ‌లేరు.

హైద‌రాబాద్‌లో ఇల్లు తీసుకోలేక‌పోయారా? అస్తమానూ ముంబై నుంచి వ‌స్తూపోవ‌డం ఇబ్బంది క‌దా...?
- ఇబ్బందేం లేదు. ముంబై వ‌దిలి ఉండ‌లేను. పైగా అక్కడ నుంచి ఎక్కడికైనా ఈజీగా వెళ్లిపోవ‌చ్చు. న‌న్ను క‌ల‌వాల‌నుకొనే నిర్మాత‌లు, ద‌ర్శకులకు మ‌రింత సుల‌భంగా ఉంటుంది. చెన్నై, బెంగ‌ళూరు నుంచి కూడా సినిమావాళ్లు నా గురించి వ‌స్తుంటారు. ముంబైలో ఉంటేనే సౌక‌ర్యంగా అనిపిస్తుంది.

* ఇంత‌కీ హైద‌రాబాద్ ఎలా ఉంది...?
- సో.. కూల్‌. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది.

* బిర్యానీ తిన్నారా?
- నిజం చెప్పాలంటే నాకు బిర్యానీ పెద్దగా ఇష్టం ఉండ‌దు. ప‌చ్చళ్లు బాగా తింటా. గోంగూర అంటే చాలా చాలా ఇష్టం. హైద‌ర‌బాద్ వ‌స్తే క‌చ్చితంగా రుచి చూస్తా. సాంబారు, ఆవ‌కాయ్‌... ఇలా దేన్నీ వ‌ద‌ల‌ను. ఇవ‌న్నీ బాగా చేయ‌డం వ‌చ్చిన వాడినే పెళ్లి చేసుకొందామ‌నుకొంటున్నా... (న‌వ్వుతూ...)

* ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ల‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటారు..
- అవును. సోష‌ల్ మీడియా ఈరోజు బాగా వృద్ది చెందింది. దాన్ని మనం కూడా వాడుకోవాలి క‌దా..?  దాదాపుగా ఇర‌వైల‌క్షల‌మంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు. వాళ్లతో ఎప్పుడూ ట‌చ్‌లో ఉంటా. ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే చాలు.. ఎన్నో జోక్స్‌. కొత్త సినిమా క‌బుర్లు క‌నిపిస్తాయి. అవి చ‌దువుతూ ఉంటే.. టైమే తెలీదు.

* క‌థానాయిక‌గా ఎద‌గాలంటే గ్లామ‌ర్ ఒలికించాల్సిందే అంటారు.. మీరూ దానికి సిద్ధమేనా..?
- క‌థానాయిక తెర‌పై అందంగా క‌నిపించాలి. ఈ విష‌యంలో మిన‌హాయింపు లేదు. అయితే... ఎక్స్ పోజింగ్ అనేది తార‌ల వ్యక్తిగ‌త ఇష్టాయిష్టాల‌మీద‌, ఆ పాత్ర స్వభావం మీద ఆధార‌ప‌డి ఉంటుంది. నేనెంతి వ‌ర‌కూ ఎక్స్ పోజింగ్ చేసిందెక్కడ‌...?? ఒక‌వేళ ఆ అవ‌కాశం వ‌స్తే..
- చెప్పాను క‌దా... పాత్ర స్వభావాన్ని బ‌ట్టి న‌డ‌చుకొంటూ వెళ్లాల‌ని..

* ప‌రిశ్రమ‌లో స్నేహితులున్నారా...?
- ఇప్పుడిప్పుడే కొత్త స్నేహాలు మొద‌ల‌వుతున్నాయి. ఐనా నాకు స్నేహితులు చాలా ఎక్కువ‌. కొత్త ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

* కొత్త సినిమాల సంగ‌తులైనా చెబుతారా..?
- ఓ త‌మిళ చిత్రం ఒప్పుకొన్నా. హిందీలోనూ అవ‌కాశాలొస్తున్నాయి. తెలుగు సినిమాకి సంబంధించి త్వర‌లోనే ఓ స్వీట్ న్యూస్ చెబుతా. అది కూడా ప్రేమ క‌థే..

* ఓకే... ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీమ‌చ్‌.

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Autonagar Surya