Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
back will effect with mouth

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం (జూన్ 27 - జూలై 03) - శ్రీకాంత్

మేష రాశి

ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుతారు కావున ప్రతిపనిలో నిదానంగా వ్యవహరించుట అలాగే ముందుచూపును కలిగి ఉండుట మంచిది. ఇష్టమైన పనులను చేపట్టుటలోఆసక్తిని కలిగి ఉంటారు. కొత్తగా అయ్యే పరిచయాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోండి నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా పనిచేయుట మంచిది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది కొంత శ్రమను పొందుతారు. చిన్న చిన్న విషయాల్లో సర్దుబాటు అవసరం నిదానంగా వ్యవహరించుట సూచన. స్థిరమైన ఆలోచనలు చేయుట సూచన. నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయుట మంచిది. ఆరోగ్యంనకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది తగిన జాగ్రత్తలు తీసుకోండి.      

 

 

వృషభ రాశి

ఈవారం మొత్తంమీద మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయల్లో బాగానే ఉన్నను కొంత ఊహించని ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి చాలావరకు సర్దుకుపోవడం అనేది సూచన. తలపెట్టిన పనులను దాదాపుగా పూర్తిచేస్తారు. ఇష్టమైన వ్యక్తుల నుండి విలువైన విషయాలను తెలుసుకొనే అవకాశం కలదు వారితో సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు చేయకపోవడం అనేది మంచిది ఒక వేల చేయవలసి వస్తే అన్ని చర్యలు చేపట్టుట ఉత్తమం. ప్రణాళిక అవసరం పెద్దల అబిప్రాయాలను గౌరవించుట మంచిది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది అధికారులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు మీకు పేరును తెచ్చిపెడతాయి. వ్యాపారపరమైన విషయల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించుట సూచన.         


మిథున రాశి

...... ఈవారం మొత్తంమీద ఆరంభం చాలావరకు బాగుంటుంది అన్నిపనులను పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి పెద్దల నుండి ఆశించిన విధంగా సహాకారం పొందుతారు. ఉద్యోగంలో మాత్రం తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించుట సాధ్యమైనంత వరకు వివాదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాల మూలాన లేదా స్త్రీ మూలకంగా అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది కావున వాటి విషయంలో జాగ్రత్తలు అవసరం లేకపోతే ఇబ్బందులు పొందుతారు. నచ్చిన పనులకు సమయాన్ని కేటాయిస్తారు అలాగే మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు. ఒకవార్త కొంత ఆందోళనకు గురిచేసిన ప్రయత్నం ద్వార అధిగమిస్తారు. విదేశీప్రయాణాలు చేయవలనన్న కోరికను కలిగి ఉంటారు ప్రయత్నం ఆరంభిస్తారు.         


కర్కాటక రాశి

ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో పనులకు ప్రాముఖ్యతను ఇవ్వడం మంచిది సమయపాలన అవసరం. అధికారులతో కలిసి పనిచేయునపుడు వారి సూచనలు పరిగణలోకి తీసుకోండి మంచిది. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. ధనమునకు సంభందించిన విషయాల్లో నూతన నిర్ణయాలు చేయకండి అలాగే మాటపట్టింపులకు పోకండి. విందులలో పాల్గొనేందుకు ఆసక్తిని కనభరుస్తారు మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సూచనలు పాటించుట మంచిది. అనారోగ్యం బాదిస్తుంది కావున అశ్రద్ద చేయకండి. కుటుంభసభ్యులతో సమయాన్ని గడుపుతారు వారితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు ఊహించని మార్పులు కలుగుటకు అవకాశం ఉంది.  


సింహ రాశి

ఈవారం మొత్తంమీద శుభకార్యముల విషయంలో మీరు తీసుకొనే నిర్ణయాలు కీలకమైనవిగా మారే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన సహాకారం పొందుతారు అలాగే వారి నుండి సంతృప్తకరమైన ఫలితాలు కలుగుతాయి.బంధుమిత్రులతో కలిసి చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి కాకపోతే వారం చివరలో పని ఒత్తిడి మూలాన చికాకును పొందుటకు అవకాశం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట సూచన. ప్రయాణాల విషయంలో ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది వీలైతే వాయిదా వేయుట మంచిది. మాటను చాలా పొదుపుగా వాడుట సూచన లేకపోతే అకారణమైన వివాదాలు కలుగుటకు అవకాశం ఉంది.

 

కన్యా రాశి

......ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాల విషయంలో తొందరపాటు వద్దు పెద్దల సూచనలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. వ్యతిరేకవర్గం నుండి ఏర్పడిన ఇబ్బందులను సమర్థ వంతంగా ఎదుర్కొంటారు. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు తప్పక పోవచ్చును. మిత్రులతో సంప్రదించి కొత్త కొత్త విషయాలను చర్చించుటకు అవకాశం ఉంది. మాటలు మాత్రం జాగ్రత్తగా వాడండి ఎదుటివారిని మీ తీరు కొంత ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. గతకొంత కాలంగా మీరు ఎదురుచూస్తున్నా ఫలితాలు సానుకూలంగా వచ్చుటకు ఆస్కారం ఉంది. కుటుంభసభ్యులతో కలిసి సమయాన్ని గడుపుటకు ఆస్కారం ఉంది. నచ్చిన వ్యక్తులనుండి నూతన సమాచారం సేకరిస్తారు.     

 

తులా రాశి

.......ఈవారం మొత్తంమీద పనుల్లో ఒత్తిడిని కలిగి ఉంటారు సమయస్పూర్తితో వాటిని పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. పెద్దలతో పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వాటి మూలాన లబ్దిని పొందుటకు అవకాశం కలదు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి కావున జాగ్రతగా వ్యవహరించుట సూచన. కుటుంభంలో చిన్న చిన్న విషయాలను పట్టించుకోకండి సర్దుబాటు మంచిది. కుటుంభ పెద్దతో ఆలోచన పంచుకోండి ఫలితం ఆశించక పోవడం మేలు. ప్రయాణాలు చేయకండి ఉత్తమం,వాహానముల విషయంలో నిదానంగా వ్యవహరించుట మంచిది. ఉద్యోగంలో బాగుంటుంది అలాగే నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవసంభందమైన విషయాలకు సమయాన్ని ఇవ్వడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నిదానంగా ఆలోచించుట మంచిది
 

వృశ్చిక రాశి

.......ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులలో చిన్న చిన్న ఒడిదుడుకులను ఎదుర్కొన్న చివరకు విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండుట సూచన తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ప్రయాణాలు లభ్సితాయి దూరప్రదేశం నుండి సంతోషకరమైన వార్తను వినే అవకాశం ఉంది. ఆరంభంలో అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. కుటుంభసభ్యులతో చచర్చలలో పాల్గొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. విదేశీప్రయత్నాలు అనుకూలిస్తాయి గత కొంత కాలంగా ఎదురుచూస్తున్నా వారికి అనుమతులు వస్తాయి కొంత ప్రయత్నం తప్పనిసరి.   
 

ధనస్సు రాశి

ఈవారం మొత్తంమీద  మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది వారం ఆరంభంలో నలుగురిలో ఆశించిన స్థాయిలో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను కొద్దిగా అధికంగా ఖర్చులతో పూర్తిచేస్తారు. అనారోగ్యసమస్యలు తప్పక పోవచ్చును శ్రమకు గురయ్యే ఆస్కారం ఉంది జాగ్రత్త. ప్రయాణాలు చేయకండి వాయిదా వేయుట ఉత్తమం. ఉద్యోగంలో అనుకూలతలు అలాగే ననుకూలతలు రెండు ఉండే అవకాశం ఉంది కావున ప్రణాళికతో ముందుకు వెళ్ళుట సూచన. జీవితభాగస్వామితో విభేదాలు కలుగుటకు ఆస్కారం ఉంది కావున చాలావవిషయాల్లో మౌనంగా ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయల్లో ఖర్చులు పెరుగుతాయి. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న వాటికి సమయాన్ని ఇవ్వడం మంచిది.  


మకర రాశి

ఈవారం మొత్తంమీద అనుకున్న ఫలితాలు పొందుతారు తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది అధికారుల నుండి గుర్తింపును పొందుటకు ఆస్కారం ఉంది కావున నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుట ఉత్తమం. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉన్న ఖర్చులు చేయు దాటుటకు అవకాశం ఉంది జాగ్రత్త. కుటుంభంలో అందరు కలిసి ప్రయాణాలు లేదా తీర్థయాత్రలకు వెళ్ళుటకు అవకాశం ఉంది. శుభకార్యములలో పాల్గొంటారు. చిననాటి మిత్రులను కలుసుకొనే అవకాశం ఉంది వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో మాత్రం వారం చివరలో నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది సూచన నిదానం మంచిది.  


కుంభ రాశి

......ఈవారం మొత్తంమీద వారం మధ్యలో సమస్యలు చాలావరకు సద్దుమనిగే అవకాశం ఉంది కాకపోతే అనుభవజ్ఞుల సూచనలు పరిగణలోకి తీసుకోవడం మర్చిపోవద్దు. ఉద్యోగంలో వివాదములకు దూరంగా ఉండుట అలాగే నలుగురిని కలుపుకొని వెళ్ళుట మేలు. కుటుంభంలో పెద్దల ఆలోచనలు కొంత విష్మయాన్ని కలుగజేస్తాయి సరైన నిర్ణయాలు చేయండి మంచిది. ఒక వార్త మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది కొంత మానసికంగా దృడంగా ఉండుట సూచన. ప్రయాణాలు కలిసి వస్తాయి కాకపోతే సమయాన్ని సర్దుబాటు చేసుకోండి. పూజాదికార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో బాగానే ఉంటుంది నూతన అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి అవకశాలను సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేయండి.  
 

మీన రాశి

ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారుల నిర్ణయాలను పాటించే ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు ప్రణాళికతో ముందుకు వెళితే ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చును. వ్యతిరేకవర్గం నుండి గతంలో లేని విధంగా నూతన సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది శ్రమతప్పని సరి. సమయానికి భోజనం చేయుట మంచిది. కుటుంభ సభ్యులతో చేసిన ఆలోచనలు ఒక నిర్ణయానికి వస్తుంది వాటిని పాటించుట మంచిది. ప్రయాణాలు చేయునపుడు అన్ని జాగ్రత్తలు పాటించుట మేలుచేస్తుంది. 


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Possessiveness