Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఆర్జీవీ నయా ట్రెండ్‌.. ఫ్లోక్యామ్‌

RGV New Trend...Plokyam

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘ఐస్‌క్రీమ్‌’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఏ సినిమా చేసినా తనదైన ప్రత్యేకతను చాటుకునే వర్మ, ‘ఐస్‌క్రీమ్‌’ సినిమా కోసం ఓ కొత్త టెక్నిక్‌ని వాడుతున్నట్లు వెల్లడిరచారు. ఆ టెక్నిక్‌ని సినీ వర్గాలకు వివరించేలా ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారాయన.

వర్మ కొత్త టెక్నిక్‌ పేరు ‘ఫ్లో క్యామ్‌’. సాధారణంగా ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు, నటీనటుల్ని కెమెరా యాంగిల్‌కి తగ్గట్టుగా మార్చుకోవడమో, లేదంటే నటీ నటులకు తగ్గట్టు కెమెరా యాంగిల్‌ అడ్జస్ట్‌ చేయడమో జరుగుతుంది. అలా చేయడం వల్ల షూటింగ్‌కి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలా కాకుండా ఒకేసారి ఐదారు కెమెరాలను ఫిక్స్‌ చేసి, సన్నివేశాల్ని చిత్రీకరిస్తే, కావాల్సిన యాంగిల్‌ని ఎడిటింగ్‌లో ఫిక్స్‌ చేసుకోవచ్చు.

ఇదే టెక్నిక్‌ని ఉపయోగించి చాలా తక్కువ సమయంలో ‘ఐస్‌ క్రీమ్‌’ సినిమాని రూపొందిస్తున్నట్లు వర్మ వెల్లడిరచారు. సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చినా, టెక్నిక్‌ విషయంలో ప్రయోగాలు చేస్తూనే వున్న వర్మ, తద్వారా కొత్త దర్శకులకు దిశా నిర్దేశనం చేస్తున్నారని అనడంలో సందేహం ఎంతమాత్రం లేదు.

మరిన్ని సినిమా కబుర్లు
maya audio album superb