Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
lady liric writer in talliwood

ఈ సంచికలో >> సినిమా >>

నాగార్జున దృష్టిలో పడ్డ విద్యాబాలన్‌

vidhya get a chance in nag movie?

నాగార్జునతో నటించాలని వుందంటూ హిందీ హీరోయిన్‌ విద్యాబాలన్‌ చెప్పేసరికి, ఆ విషయం టాలీవుడ్‌ హీరో నాగార్జున దృష్టికీ వెళ్ళిందట. ఇప్పటికే తెలుగులో హీరోయిన్ల కొరత వుండడంతో తన కొత్త సినిమా కోసం విద్యాబాలన్‌ పేరుని నాగార్జున పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వినవస్తున్నాయి. నాగార్జున పక్కన విద్యాబాలన్‌ హీరోయిన్‌ అయితే ఆ ప్రాజెక్ట్‌కి హైప్‌ కూడా పెరుగుతుంది.
అనుష్క, నయనతార, త్రిష వంటి సీనియర్లు నాగ్‌ పక్కన బోర్‌ కొట్టేలా నటించారు. యంగ్‌ హీరోయిన్లతో నటించడానికి నాగార్జున కూడా ఆసక్తి చూపడంలేదట. ఈ తరుణంలో సరదాగా అన్నదో, లేదంటే సీరియస్‌గా అనుకుందో నాగార్జునతో నటించాలనే మనసులో మాట బయటపెట్టింది విద్యాబాలన్‌.

‘మనం’ సినిమా తర్వాత నాగార్జున కథల ఎంపికలో బిజీగా వున్నారు. చేసే సినిమాలు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ వుండిపోయేలా చూసుకుంటోన్న నాగార్జున, ఈసారి కూడా ఓ మంచి ‘ప్రయత్నం’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారంట. అందులో విద్యాబాలన్‌ హీరోయిన్‌గా నటించే అవకాశం వుందనే అనుకోవాలి.

మరిన్ని సినిమా కబుర్లు
something special knife....