Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ:  ఏకాంబర్ కొండ మీదకు వెళ్ళి సిం హాద్రి అప్పన్నను దర్శించుకుని, కొండ దిగి పోదామని బస్టాండులో నిబడ్డాడు. ఇంతలో తన బాల్య మిత్రుడు త్రినాథ్ కనిపిస్తాడు.  అతని క్షేమ సమాచారాలు అడిగి, త్రినాథ్ కు పరిచయం వున్న వారితో పాలసీలు కటిస్తాడు.

అయిపోతాయి. పాలసీ కాలమంతా జీతాల్లో వసూలు అవుతూనే వుంటాయి. ఏజెంట్ కి నెలనెలా వసూలు చేసి కట్టే బాధ తప్పుతుంది" విడమర్చి చెప్పాడు రాజనాల.

"మరి, ముందు రెండు నెలలు?" అన్నాడు ఏకాంబర్.

"మనం కట్టాలి. రెండు వాయిదాల డబ్బు మనం కట్టి పాలసీ పూర్తి చేశాక మూడో నెల నుండి వారి జీతాల్లో రికవరీ అయిపోతుంది. ఇక పాలసీ కాలమంతా కష్టపడకుండా ఏజుంటుకి కమీషన్ వస్తుంది. ఇలాంటి పాలసీలు దొరికితే ఆ ఏజెంట్ కాలు మీద కాలేసుకు కూర్చోవచ్చు" అన్నాడు రాజనాల.

రాజనాల రాజేంద్ర చెప్పిందంతా విన్నాడు. అయినా, ఏకాంబర్ బుర్రకి ఎక్కలేదు. మౌనంగా వుండిపోయాడు. 

అక్కడనుండి నేరుగా దేవాలయంలోకి వెళ్లారు. దేవుడి దర్శనం చేసుకుని ఆండాళ్ అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. ఆలయంలోనే దక్షిణ భాగంలో వుంది అమ్మవారి ఆలయం. స్వామివారి దేవేరి గుడి. అక్కడ తీర్థం, శఠగోపం తీసుకుని ఆలయ బేడా మండపంలో కూర్చున్నారిద్దరూ.

అందరూ ఎవరి హడావిడిలో వాళ్లున్నారు. అర్చకులు కొందరు గర్భాలయంలోనూ, మరికొందరు ఆండాళ్ సన్నిధి దగ్గర వున్నారు. ఎవరిని పలకరిద్దామన్నా వీరిని పట్టించుకున్నవాళ్లు లేరు.

"ఏకాంబర్! నీకు తెలిసిన వాళెవరైనా వున్నారా?" అన్నాడు రాజనాల.

"అందరూ తెలిసినవాళ్లే కదా!" ఆశ్చర్యంగా రాజనాలకేసి చూస్తూ అన్నాడు ఏకాంబర్. ఇక్కడే పుట్టి పెరిగినవాళ్లకి ఈ ఊరివాళ్లు తెలియకపోవడమేమిటా? అని ఏకాంబర్ ఆలోచన. రాజనాల అంటే ఎప్పుడో చిన్నప్పుడు దుంపలబడిలో చదువుకుని ఊరు వదలి వెళ్లిపోయాడు. వాడికి అందరూ కొత్త కావచ్చు. కానీ, తనకు ఎవరూ తెలియకపోవడం లేదు కదా! అని మనసులోనే అనుకున్నాడు ఏకాంబర్. 

"తెలియడం కాదు. నీకు బాగా పరిచయం, చనువు వున్న ఉద్యోగులు ఎవరున్నారు? అని అడిగాను" అన్నాడు రాజనాల.

"నాకు బాగా పరిచయమున్నది... ఆ! అవున్రా! పడిరాజు. శిడగం పైడిరాజని ఈ మధ్యనే నాతోనే ఇంటర్ వరకూ చదివాడు. ఇక్కడే వాళ్ల నాన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్యే జాయిన్ అయ్యాడు" గుర్తు చేసుకుంటూ అన్నాడు ఏకాంబర్.

"వాళ్ల నాన్న ఉద్యోగమా?!" ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు రాజనాల.

"అబ్బ! వాళ్ల నాన్న చనిపోతే వీడికి ఆ ఉద్యోగమిచ్చారు. కోవెల్లోనే మాలీగా చేస్తున్నానని చెప్పాడు" అన్నాడు ఏకాంబర్.

అదే సమయంలో బేడా మండపమంతా పెద్ద చీపురుతో ఊడ్చుకుంచ్టూ ఒకతను అటుగా వస్తున్నాడు. అతన్ని చూసి గబాలున అటుగా వెళ్లాడు ఏకాంబర్.

"గురూ! ఇక్కడ శిడగం పైడిరాజు పని చేస్తున్నాడు కదా! ఎక్కడున్నాడు?" అంటూ అతన్ని సమీపించి అడిగాడు ఏకాంబర్.
"పైడిరాజా! గుడి బయట ఆవరణ వుంది కదా! ప్రసాదాల కౌంటర్ దగ్గర వాడి డ్యూటీ. అక్కడుంటాడు వెళ్లండి" అంటూ తనపనిలో తలు నిమగ్నమైపోయాడు అతను.

ఇద్దరూ అతను చెప్పిన వెంటనే గుడిలో నుండి బయటకు వచ్చారు. ఆలయం చుట్టూ వున్న ఆవరణలో నలుగురైదుగురు చీప్పుర్లు పట్టుకుని శుభ్రం చేస్తున్నారు. 

ఆ నలుగురిలో పైడిరాజును సులువుగానే గుర్తుపట్టాడు ఏకాంబర్.

"ఒరేయ్ రాజూ!... ఎలా వున్నావురా?" హుషారుగా వెళ్లి పైడిరాజు భుజం మీద చరుస్తూ పలకరించాడు ఏకాంబర్.

"ఎవరో హఠాత్తుగా వెనకనుండి భుజం మీద గట్టిగా చరిచేసరికి అదిరిపడి చేతిలో వున్న చీపురును కింద పడేసి పరుగందుకున్నాడు పైడిరాజు. కొద్దిదూరం పారిపోయి వెనక్కి తిరిగి చూశాడు.

ఎదురుగా ఏకాంబర్ కనిపించేసరికి హమ్మయ్య అనుకుంటూ వచ్చి కింద పడేసిన చీపురును తీసుకున్నాడు.

"నువ్వేనా వెనకనించి చరిచింది?" ఏకాంబరాన్ని చూస్తూ అన్నాడు పైడిరాజు.

"నేనేరా! ఏం అంత కంగారు పడ్డావ్?!" అయోమయంగా అడిగాడు ఏకాంబర్.

"గొప్పోడివేరా బాబూ! ఇక్కడ్ ఓ పిచ్చోడు తిరుగుతున్నాడులే! వాడు వెనకనుండి వచ్చి దబదబా బాదేసి పారిపోతూంటాడు. వాడేమోనని కంగారుపడి చచ్చాను" తనలో కలిగిన ఉలికిపాటును అణచుకుంటూ అన్నాడు అతను.

"సరేరా బాబూ! నువ్వు కనిపించావనే ఆనందంలో సరదాగా వచ్చి హఠాత్తుగా నిన్ను ఆశ్చర్యపరచాలనుకున్నాను" అన్నాడు ఏకాంబర్.
"హడలెత్తించావు కదరా! పిచ్చోడనుకుని హడలి చచ్చాన్రా బాబూ! ఓకోజు ఇలాగే వెనకగా వచ్చి చేతిలో వున్న దుడ్డుకర్రతొ బాదేశాడు. వారం రోజులు నడుమ్నొప్పితో చచ్చాను" భయంగా అన్నాడు పైడిరాజు.

"మీరా పిచ్చేడ్ని ఇక్కడినుండి తగిలెయ్యలేదా?" అడిగాడు ఏకాంబర్.

"పిల్లల్నీ, పిచ్చోళ్లనీ ఎవరు పట్టించుకుంటార్రా! నిత్యం భక్తులతో రద్దీగా వుంటుంది దేవాలయం. ఎంతోమంది వస్తూంతారు, వెళుతూంటారు. పిచ్చోళ్లు, బిచ్చగాళ్లు ఎక్కడుంటారో వాళ్లకే తెలీదు. వాళ్లను ఎవరు పట్టించుకుంటార్రా?" అన్నాడు పైడిరాజు.

"నిజమేలేరా! కింద వూళ్లో తొలి పావంచా దగ్గర, బజార్లోనూ ఎంతోమంది పిచ్చోళ్లు తిరుగుతుంటారు. ఒకోసారి సడెన్ గా కనిపించరు. మళ్లీ మరోరోజు ఇంకో కొత్త పిచ్చోడు దర్శనమిస్తూంటాడు. అవును, నువ్వన్నది కరెక్టే!" అన్నాడు ఏకాంబర్.

"దర్శనానికి వచ్చారా? దర్శనం చేయించాలా?" అంటూ అడిగాడు పైడిరాజు.

"దర్శనం అయిందిరా! నీతోనే పనిబడి వచ్చాను" అన్నాడు ఏకాంబర్.

"నాతోనా? నీకా? చెప్పరా!" చీపురును పక్కనబెట్టి అడిగాడు పైడిరాజు..

ఇంతలో అటుగా వెళ్తున్నతని దగ్గరకు వెళ్లి బాట్లాడి వచ్చాడు పైడిరాజు.

"పదరా! సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. అలా కల్యాణమండపంలోకి వెళ్లి కూర్చుందాం" అన్నాడు పైడిరాజు ఏకాంబర్ తో.
మిత్రులిద్దరూ మాట్లాడుకుంటూంటే దూరంగా నిలబడి గమనిస్తున్నాడు రాజనాల.

"ఒక్క నిమిషం. మా ఫ్రెండ్ని పరిచయం చేస్తాను" అంటూనే రాజనాలకేసి చూసి రమ్మన్నట్టు సైగ చేసి పిలిచాడు ఏకాంబర్.

"ఆయనెవరు?" కుతూహలంగా అడిగాడు పైడిరాజు.

"నీకూ తెలిసే వుంటుంది. మనతో దుంపలబడిలో చదువుకున్నాడు. అయిదో తరగతి తర్వాత వైజాగ్ కి వెళ్లిపోయాడు. పేరు రాజనాల రాజేంద్ర. ఇప్పుడు ఇన్స్యూరెన్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు" అంటూ పరిచయం చేశాడు ఏకాంబర్. 

"ఏమోరా! వూళ్లో వున్నవాళ్లం. మనమే తరచూ కలుసుకోలేక ఒకరినొకరు మరచిపోతున్నాం. నాకు గుర్తులేదు" రాజనాలకేసి చూస్తూ అన్నాడు పైడిరాజు.

"నమస్తే!" వాళ్లిద్దరి దగ్గరకూ చేరుతూనే నమస్కరించాడు రాజనాల.

"నమస్తే! నేనూ, ఏకాంబర్ కలసి చదువుకున్నామండీ! మీరు నాకు గుర్తు రావడం లేదు" అన్నాడు పైడిరాజు.

"వందలమంది ఎవరికి ఎవరు ఎలా గుర్తుంటారు? అయినా, చిన్నప్పటి మిత్రులు గుర్తుండొద్దా?! అయినా ఎప్పుడూ మనం కలిసిన గుర్తు లేదు" అన్నాడు రాజనాల.

"రండి! అక్కడ కల్యాణ మండపంలో కూర్చుందాం. ప్రసాదం తీసుకురానా!" ఏకాంబర్ కేసి చూస్తూ అన్నాడు పైడిరాజు.

"నీకు శ్రమ ఏందుకులేరా!" ప్రసాదం పేరెత్తేసరికి ఏకాంబర్ కి నోరూరింది. తినాలనే వుందిగానీ, అనలేకపోయాడు ఏకాంబర్.

"మీరు ఇద్దరూ వెళ్లి మండపంలో కూర్చోండి. నేను వెళ్లి ప్రసాదం పట్టుకొస్తాను" అంటూ పరుగు పరుగున రామనుజకూటం దగ్గరకు వెళ్లాడు పైడిరాజు.

దేవుడి ప్రసాదాలను తయారు చేసే వంటశాలనే రామానుజకూటం అంటారు. అందులో వష్ణవస్వాములే ప్రసాదాలు తయారు చేస్తారు.
ఏకాంబర్, రాజనాల నేరుగా ధ్వజస్తంభం పక్కనుండి వెళ్లి విశాలంగా వున్న కల్యాణ మండపంలో కూర్చున్నారు.

కల్యాణమండపంలో పూర్వం ఎప్పుడో దేవుడి కల్యాణ మహొత్సవాన్ని జరిపించేవారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆరుబయటే పెద్ద పెద్ద పందిళ్లు వేసి ప్రత్యేకంగా కల్యాణవేదికను నిర్మించి కల్యాణం జరిపిస్తున్నారు.

ఆ కల్యాణ మండపమంతా పెద్ద పెద్ద నల్లరాతి పలకలతో నిర్మించినది. రాతి స్తంభాలు కూడా అద్భుతమైన శిల్పాలతో మదపుటేనుగులకు మల్లే నిలబడి వున్నాయి. ప్రతి స్తంభం ఒకదానికొకటి పోటీపడి తయారు చేసినట్టు అద్భుత శిల్పసౌందర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 
ఇద్దరు మిత్రులు ఓ మూలకు వెళ్లి కూర్చున్నారు. అప్పటికే ఆ కల్యాణ మండపంలో చాలామంది భక్తులు గుంపులు గుంపులుగా కుటుంబాలతో కూర్చుని ప్రసాదాలు తింటున్నారు. కొందరు కొబ్బరి చెక్క పగులతొఘ్ఘి కొబ్బరి ముక్కలనే ప్రసాదంగా తింటున్నారు.
ఎంతో చల్లగా, ఆహ్లాదంగా వున్న ఆ మండపం దగ్గర ఇద్దరు ముగ్గురు పిల్లలు అటూయిటూ పరిగెడుతూ ఆడుకుంటున్నారు.
ఆ మండపంలోనే ఓ మూల గరుత్మంతుని రూపంలో వున్న పల్లకీ, స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగించే ఇతర వాహనాలు వరుసగా పేర్చినట్టున్నాయి. 

రాజనాల, ఏకాంబర్ ఇద్దరూ పైడిరాజుతో ఏం మాట్లాడాలి, ఎలా మొదలుపెట్టాలి అన్న విషయమై చర్చించుకుంటూ కూర్చున్నారు.
ఇంతలో పైడిరాజు రెండు చేతుల్తో ప్రసాదం పొట్లాలను పట్టుకుని వచ్చాడు.

"నీకెందుకురా శ్రమ! నీతో మాట్లాడాలని రాజనాల అంటే తీసుకు వచ్చాను" నెమ్మదిగా అన్నాడు ఏకాంబర్.

"శ్రమేముందిరా! కలవక కలవక కలిసిన మిత్రుల్ని ఎలా వదిలెయ్యగలన్రా! ఇది మా స్వామివారి ప్రసాదం. పొంగలి, దద్దొజనం, చక్రపొంగలి. వీటిని బయట అమ్మరు. ఉదయాన్నే స్వామివారికి నైవేద్యం పెట్టాక పంచుతారు" అంటూ వారి పక్కన కూర్చుని ఇద్దరికీ ఇచ్చాడు పైడిరాజు.
"నువ్వు కూడా కొంచెం తినరా!" అన్నాడు ఏకాంబర్.

"నేను మీరు రాకముందే తినేశాను. మీ ఇద్దరి కోసమే తీసుకొచ్చాను. తినండి. ఈలోగా నా పని పూర్తి చేసుకుని పది నిమిషాల్లో వచ్చేస్తాను. అదిగో అక్కడ మంచినీళ్ల కొళాయి వుంది. నా డ్యూటీ టైం కూడా అయిపోయింది. వచ్చేయడమే!" అన్నాడు పైడిరాజు.

"అలాగే. తీరిగ్గా రండి! గాభరా ఏంలేదు. మేము వుంటాం" చెప్పాడు రాజనాల.

వాళ్లిద్దర్నీ అక్కడే కూర్చోబెట్టి పరుగుపరుగున వెళ్లిపోయాడు పైడిరాజు.

రాజనాల, ఏకాంబర్ ఇద్దరూ తృప్తిగా తిన్నా ఇంకా ప్రసాదం మిగిలిపోయింది. పొంగలి, పులిహోర, దద్దోజనం మూడూ మిగిలిపోయాయి.

చక్రపొంగలి మాత్రం తక్కువే వుండడం, పైపెచ్చు అమృతంలా మధురంగా వుండడంతో ఇద్దరూ ఆకుల్ని సైతం నాకేశారు. 

"మిగిలిన ప్రసాదాన్ని నేను ఇంటికి పట్టుకెళ్తాను రాజేంద్రా! అమ్మకీ, చెల్లికీ దేవుడి ప్రసాదమంటే ఎంతో ఇష్టం. నువ్విక తినవు కదా?" రాజనాలకేసి చూస్తూ అన్నాడు ఏకాంబర్.

"చాలురా బాబూ! ఎక్కువైపోయింది. ఉదయం మనం టిఫిన్ చేయ్యకుండా వుండి వుంటే తినేద్దును. మిగిలిన ఆ పొట్లాలను అమ్మకి పట్టుకెళ్లివ్వు" అన్నాడు రాజనాల. పొట్ల్లాలను జాగ్రత్తగా కట్టి బ్యాగులో సర్దుకున్నాడు ఏకాంబర్.

పది నిమిషాల్లో వస్తానన్న పైడిరాజు అరగంట తర్వాత నలుగురైదుగురు మిత్రుల్ని వెంటబెట్టుకుని వాళ్ల దగ్గరకు వచ్చాడు.వస్తూనే ఆ నలుగురినీ ఏకాంబరానికి పరిచయం చేశాడు.

"వీళ్లందరూ నాతోనే పని చేస్తున్నారు. మా డ్యూటీ అయి దిగి ఇళ్లకు వెళ్లిపోతున్నాం. మీరిక్కడ వున్నారని చెప్పి తీసుకువచ్చాను" అంటూ ఏకాంబరానికి పరిచయం చేశాక రాజనాలతో చెప్పాడు పైడిరాజు.

మనసులోనే ఉప్పొంగిపోయాడు ఏకాంబరం.

పైడిరాజుకి లోలోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. బయటకు మాత్రం గుంభనంగా వాళ్ల నలుగురికీ షేక్ హేండ్ ఇచ్చి నవ్వుతూ పలకరించాడు.

"మీరు ఇన్స్యూరెన్స్ చేస్తారని మా పైడిరాజు చెప్పాడు. మా అందరికీ ఒక్కొరకీ ఈ నెల నుండి అయిదువందల నుండి వెయ్యి వరకూ జీతం పెరిగింది. దానికి తగ్గట్టు మంచి పాలసీలుంటే చేయించండి సార్" అన్నారు ఆ నలుగురు.

పైడిరాజు "అలాగే" అన్నాడు.

వాళ్లు అనడమేమిటి కల్యాణ మండపంలోనే ఓ మూల కూర్చుని వాళ్లందరికీ వారి వారి వయసుని బట్టి మనీబ్యాక్ బాలసీలు ఇద్దరికీ జీవనమిత్ర పాలసీలు ఇద్దరికీ, ఎండోమెంట్ పాలసీ ఒక్కరికి రాయించాడు ఏకాంబర్.

రాజనాలకి కూడా ఏకాంబర్ పద్ధతి అర్థం కాలేదు.

అందరికీ ఏదో ఒక పాలసీ రాస్తే పోలా అని అడిగాడు పైడిరాజు. దానికి మిగతా అందరూ సరే అన్నారు. రాజనాలకి కూడా చిరాగ్గానే వుంది. కట్టేవాడికి ఏం కావాలో అది రాయించక మధ్యలో వీడి పెత్తనం ఏమిటో అనుకుంటూ మౌనంగా వుండిపోయాడు.

"సార్! మీకు పిల్లలు పెద్దయిపోయారు. ఇంకా సర్వీసు పదిహేనేళ్లు వుంటుందంటున్నారు. మనీబ్యాక్ అయితే మధ్యలో వస్తుంది. ప్రీమియం కూడా ఎక్కువ పడుతుంది. అవసరం లేని సొమ్ము వచ్చాక దుబారా తప్ప ప్రయోజనం 

"నువ్వు కూడా కొంచెం తినరా!" అన్నాడు ఏకాంబర్.

"నేను మీరు రాకముందే తినేశాను. మీ ఇద్దరి కోసమే తీసుకొచ్చాను. తినండి. ఈలోగా నా పని పూర్తి చేసుకుని పది నిమిషాల్లో వచ్చేస్తాను. అదిగో అక్కడ మంచినీళ్ల కొళాయి వుంది. నా డ్యూటీ టైం కూడా అయిపోయింది. వ్చ్చేయండమే!" అన్నాడు పైడిరాజు.

"అలాగే. తీరిగ్గా రండి! గాభరా ఏంలేదు. మేము వుంటాం" చెప్పాడు రాజనాల.

వాళ్లిద్దర్నీ అక్కడే కూర్చోబెట్టి పరుగుపరుగున వెళ్లిపోయాడు పైడిరాజు.

రాజనాల, ఏకాంబర్ ఇద్దరూ తృప్తిగా తిన్నా ఇంకా ప్రసాదం మిగిలిపోయింది. పొంగలి, పులిహోర, దద్దోజనం మూడూ మిగిలిపోయాయి. చక్రపొంగలి మాత్రం తక్కువే వుండడం, పైపెచ్చు అమృతంలా మధురంగా వుండడంతో ఇద్దరూ ఆకుల్ని సైతం నాకేశారు. 

"మిగిలిన ప్రసాదాన్ని నేను ఇంటికి పట్టుకెళ్తాను రాజేంద్రా! అమ్మకీ, చెల్లికీ దేవుడి ప్రసాదమంటే ఎంతో ఇష్టం. నువ్విక తినవు కదా?" రాజనాలకేసి చూస్తూ అన్నాడు ఏకాంబర్.

"చాలురా బాబూ! ఎక్కువైపోయింది. ఉదయం మనం టిఫిన్ చేయ్యకుండా వుండి వుంటే తినేద్దును. మిగిలిన ఆ పొట్లాలను అమ్మకి పట్టుకెళ్లివ్వు" అన్నాడు రాజనాల. పొట్ల్లాలను జాగ్రత్తగా కట్టి బ్యాగులో సర్దుకున్నాడు ఏకాంబర్.

పది నిమిషాల్లో వస్తానన్న పైడిరాజు అరగంట తర్వాత నలుగురైదుగురు మిత్రుల్ని వెంటబెట్టుకుని వాళ్ల దగ్గరకు వచ్చాడు.వస్తూనే ఆ నలుగురినీ ఏకాంబరానికి పరిచయం చేశాడు.

"వీళ్లందరూ నాతోనే పని చేస్తున్నారు. మా డ్యూటీ అయి దిగి ఇళ్లకు వెళ్లిపోతున్నాం. మీరిక్కడ వున్నారని చెప్పి తీసుకువచ్చాను" అంటూ ఏకాంబరానికి పరిచయం చేశాక రాజనాలతో చెప్పాడు పైడిరాజు.

మనసులోనే ఉప్పొంగిపోయాడు ఏకాంబరం.పైడిరాజుకి లోలోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. బయటకు మాత్రం గుంభనంగా వాళ్ల నలుగురికీ షేక్ హేండ్ ఇచ్చి నవ్వుతూ పలకరించాడు.

"మీరు ఇన్స్యూరెన్స్ చేస్తారని మా పైడిరాజు చెప్పాడు. మా అందరికీ ఒక్కొరకీ ఈ నెల నుండి అయిదువందల నుండి వెయ్యి వరకూ జీతం పెరిగింది. దానికి తగ్గట్టు మంచి పాలసీలుంటే చేయించండి సార్" అన్నారు ఆ నలుగురు.

పైడిరాజు "అలాగే" అన్నాడు.

వాళ్లు అనడమేమిటి కల్యాణ మండపంలోనే ఓ మూల కూర్చుని వాళ్లందరికీ వారి వారి వయసుని బట్టి మనీబ్యాక్ బాలసీలు ఇద్దరికీ జీవనమిత్ర పాలసీలు ఇద్దరికీ, ఎండోమెంట్ పాలసీ ఒక్కరికి రాయించాడు ఏకాంబర్.

రాజనాలకి కూడా ఏకాంబర్ పద్ధతి అర్థం కాలేదు.

అందరికీ ఏదో ఒక పాలసీ రాస్తే పోలా అని అడిగాడు పైడిరాజు. దానికి మిగతా అందరూ సరే అన్నారు. రాజనాలకి కూడా చిరాగ్గానే వుంది. కట్టేవాడికి ఏం కావాలో అది రాయించక మధ్యలో వీడి పెత్తనం ఏమిటో అనుకుంటూ మౌనంగా వుండిపోయాడు."సార్! మీకు పిల్లలు పెద్దయిపోయారు. ఇంకా సర్వీసు పదిహేనేళ్లు వుంటుందంటున్నారు. మనీబ్యాక్ అయితే మధ్యలో వస్తుంది. ప్రీమియం కూడా ఎక్కువ పడుతుంది. అవసరం లేని సొమ్ము వచ్చాక దుబారా తప్ప ప్రయోజనం.

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
24th Episode