Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
23rd Episode

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐ ఏ ఎస్ పాస్

జరిగిన కథ:  కిట్టు సివిల్స్ లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో ఆలోచిస్తుంటాడు. అయితే సివిల్ సర్వీసెస్ క్రానికల్ వాళ్ళు ఒక పుస్తకాన్ని రూపొందించారు. అందులో ఏమేం పుస్తకాలుంటాయో తెలుసుకోవాలని  గూగుల్ అనే కంప్యూటర్ యంత్రం లో అన్వేషిస్తుంటాడు కిట్టు. 

కిట్టుకి బియ్యేలో చదివిన సమాజశాస్త్రం బాగా వచ్చింది...

సమాజశాస్త్రం పరీక్షల్లో ఒక పేపర్ మానవ శాస్త్రం వుంది. అది రాస్తే రాయచ్చు లేదా దాని బదులు సమాజ శాస్త్రమే రాసుకోవచ్చు. ఇదేదో కొంచెం మార్పులా వుందే అనుకుని, మానవశాస్త్రం ఎన్నుకుని ఒక పేపర్ రాశాడు కిట్టు.

సమాజ శాస్త్రాన్ని 'సోషియాలజీ' అనీ, మానవశాస్త్రాన్ని 'ఆంత్రోపాలజీ' అనీ ఇంగ్లీషులో అంటారు.

సివిల్స్ కి ఈ మానవశాస్త్రం ఎన్నుకుంటే?

నిర్ణయం తీసేసుకుని, కొంచెం లోతుగా పరిశీలించాడు కిట్టు.

అసలీ మానవశాస్త్రం పట్టణాలకు దూరంగా అడవిలో, లోయల్లో, కొండ కోనల్లో నివసించే జాతులను పరిశీలించడంతో మొదలయ్యింది. 'ఇంతింతై వటుడింతై' అన్నట్టుగా మనుషుల శ్రీర లక్షణాలను, పుట్టుపూర్వోత్తరాలను (పుట్టు అంటే... సైన్స్ కలసిపోయింది. పూర్వోత్తరాలు అంటే చరిత్ర, పురావస్తు శాస్త్రం కలసిపోయాయి.) మనుషుల్లోని వైవిధ్యమూ... ఇక ఒకటేమిటి? అన్నింటినీ కలుపుకుని ఒక 'ఒక మహావృక్షం'లాగా పెరిగిపోయింది ఈ మానవశాస్త్రం. 

చాలదన్నట్టుగా... దీనికి జన్మనిచ్చిన సమాజ శాస్త్రం దీన్ని వదలకుండా అంటిపెట్టుకునే వుంది. 

కిట్టు ఆలోచనలో పడ్డాడు...

ఇంటర్ లో బైపీసీ చదివాను కదా...! ఈ సైన్స్ కొద్దో గొప్పో పరిచయముంది కాబట్టి ఈ మానవశాస్త్రంలో వున్న సైన్సుని చదవగలను.
మిగిలింది? మిగిలిన దానికి రెడ్డిగారి మీద ఆధారపడవచ్చు. 

జై మునిరత్నం రెడ్డిగారికి జై...

మానవ శాస్త్రమంటే 'మునిరత్నం రెడ్డి ' గారే!

ఆ తర్వాతే మిగిలినవాళ్లు... ఎవరైనా...

భారీ పర్సనాలిటీ!

కంచు కంఠం... మైకు అవసరం లేదు.

అలుపెరగకుండా గంటలు... గంటలు ఉపన్యసించే శక్తి కలవారాయన.

విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పడమే ఆయన ధ్యేయం. 

కోతి మానవుడిగా పరిణామం చెందే క్రమంలో ఎలా నడకలో మార్పు వచ్చిందో...

నడచి చూపించగల ఓపిక ఆయనకుంది...

కుటుంబం, చుట్టరికాలు వివరించేటప్పుడు విద్యార్థులకు అర్థమయ్యేలా తనను తన కుటుంబాన్నే ఉదాహరణగా తీసుకుని చెప్పేవారాయన. ఆయన దగ్గర నేర్చుకుంటే ఇక తిరుగులేదు. ఉగ్గుపాలు రంగరించి పోసినట్టుగా బోధించడం ఆయన ప్రత్యేకత. అంత గొప్పాయన మీద కూడా ఒక నింద వుంది. మానవశాస్త్రాన్ని బోధించడం మొదలుపెడతాడు. కానీ, పూర్తి చెయ్యడు అని... కిట్టు అభిప్రాయమేమిటంటే... ఈ మానవశాస్త్రం ఒక మహావృక్షం ఆ మొత్తాన్ని బోధించేందుకు సమయం సరిపోదు... ఒక్క మనిషి ఎంతని చెప్పగలడు? ముఖ్యంగా విద్యార్థికి కావలసిన పునాదిని కాంక్రీట్ కంటే బలంగా ఇస్తాడాయన ఈ పునాది మీదుగా విద్యార్థి తనంతట తను ఎదగగలగాలి. 

అంతేగానీ మొత్తమంతా చెప్తావా? చస్తావా? అంటే ఎవరైనా ఏంచేయగలరు?

ఈ క్లాసులకు హాజరయ్యే సమయంలో కిట్టుకి ఫ్రెండ్స్ ఏర్పడ్డారు.

ప్రముఖుడు చరాగ్ హైద్రాబాద్ వాస్తవ్యుడు. చమన ఛాయ, పొడవుగా వుంటాడు. గవర్నమెంట్ ఉద్యోగి.... వాళ్ల నాన్నగారు ఉన్నతాధికారి. చరాగ్ దగ్గర మారుతి కారు వుండేది. స్టూడెంట్స్ సర్కిల్ లో మారుతి కారులో తిరగడమంటే ఎంతో గొప్ప విషయం.ఈ చరాగ్ కి ఎలా కలిశాడో ఓరుగల్లు శీను. ఈ శీనుని జానీ అని పెలుచుకుంటారు. జానీది ఫెయిర్ కలర్. చరాగ్ అంత హైట్ కాకపోయినా, పొడగరియే. అందర్నీ ఆకట్టుకునేలా మాట్లాడతాడు. ఇట్టే కలసిపోతాడు. 

వీళ్లిద్దరికీ తెలుగు సాహిత్యం గురించి గొడవ. 'అన్నా చరాగ్... నీకెందుకే... నేను నీకు తెలుగు సాహిత్యం చిటికెలో చెప్పేస్తాను. ఇయ్యాల రేపట్లో... గురజాడని, శ్రీశ్రీని ఖతం చేస్తాను. ఆ తర్వాత చలాన్ని ఖతం చేసేస్తా... నా మీద వదిలెయ్యరాదే' అనేవాడు జానీ.

'వీడు చెప్పే మాటల్ని నమ్మకూడదు ' ఇయ్యాల, రేపు పోయి వారం పోయింది. ఇంకా ఒక్కణ్ణి కూడా మర్డర్ చెయ్యలేదు ' అనేవాడు చరాగ్.
'అరె! పొద్దుగాల ఉద్యోగం అని పోతావ్... సాయంత్రం కలసినప్పుడే కదా మనం చదివేది? టైం పట్టుద్ది భాయ్...' అనేవాడు జానీ శీను.
ఇంకో ఫ్రెండ్ డాక్టర్ శాం... హైద్రాబాదీ... ఐదున్నరడుగుల మనిషి. కళగల ముఖం. ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడుతూ వుంటాడు. ఆంత్రోపాలజీలో వున్న సైన్స్ పార్ట్ కోసం డాక్టర్ శాం మీద ఆధారపడేవాళ్లు అందరూ... ఒక బ్లాక్ బోర్డ్ మీద ఎముకల బొమ్మలు వేసి, వాటి గురించి వివరించేవాడు శాం. కవల పిల్లలు ఎలా పుడతారు? అండం ఓ విధంగా మార్పులు చెందుతుంది? పుట్టుకతో వచ్చే డ్వార్ఫిజం, మంగోలిజం వంటి జబ్బులు ఎలా వస్తాయి, కారణమేంటి? వాటి లక్షణాలేంటి? వీటన్నింటినీ ఓపిగ్గా మిగిలిన వాళ్లకు అర్థమయ్యేలా బోధించేవాడు.

డాక్టర్ శాం దమ్ము కొట్టడు... బీర్లు తాగడు... ఐస్క్రీం మాత్రం లాగిస్తాడు. 

వీళ్ల పార్టీలప్పుడు, నీకేంటి, నీకేంటి అని అడిగి తెలుసుకుని కావలసిన సరంజామా తెచ్చుకునేవారు... 

నాకు కింగ్ ఫిషర్ బీర్, డాక్టర్ శాం కి ఐస్క్రీం.. అని ఒకడనేవాడు... మిగిలనవాళ్లు నవ్వేవాళ్లు...

అప్పుడప్పుడూ డాక్టర్ శర్మ వీళ్లతో కలిసేవాడు. డాక్టర్ శర్మ స్టైలుగా నల్ల కల్ళ్లద్దాలను ధరించి, చరాగ్ కారు తనే తీసుకుని డ్రైవింగ్ చేసేవాడు.
వారాంతానికో, ఎప్పుడో మనసు పుట్టినప్పుడో చరాగ్ కార్లో తినుబండారాలు, బీర్లు నింపుకుని ఎక్కడికో దూరప్రదేశానికి పోయి, తిని, తాగి, మళ్లీ రూంలకు చేరుకునేవాళ్లు.

కిట్టు, చరాగ్, జానీ ముగ్గురూ దమ్ము కొట్టేవాళ్లు. డాక్టర్ శాం వీళ్లని దూరంగా పొమ్మనేవాడు.

డాక్టర్ శర్మ సిగరెట్ తీసుకుని గబగబా ఒకటి రెండు దమ్ములు లాగి వెంటనే ఇచ్చేసేవాడు. 

ఒకోసారి, ఎవరో ఒకరి రూంకి వెళ్లి పార్టీ చేసుకునేవారు. మందెక్కువైనవాడు కక్కేసేవాడు.ఎంతో కొంత తుడిచి, ఎక్కడ వీలుంటే అక్కడ పడుకునేవారు. ఈ రూం తీసుకున్నవాడికి పొద్దున్నే రూం క్లీనింగ్ ఎక్స్ ట్రా పని.ఒకరోజు ఈ ఫ్రెండ్సంతా సాయంత్రం కొంచెం చీకటి పడగానే నెక్లెస్ రోడ్ కి చేరుకున్నారు.

అప్పటికి నెక్లెస్ రోడ్ పూర్తిగా తయారు కాలేదు...

రాళ్లు అన్నీ గుట్టలుగా వేసి వున్నాయి. ఆ గుట్టలపై ఫ్రెండ్సంతా తమ కార్యక్రమాన్ని మొదలెట్టారు. వీళ్లు పోసుకోలు కబుర్లు కాకుండా సబ్జెక్ట్ గురించే మాట్లాడుకునేవారు. ఇంతలో పోలీస్ వ్యాన్ వచ్చింది. వీళ్లని గమనించి దగ్గరగా ఆగింది... ఒక ఇన్స్ పెక్టర్ పెద్దగా అరిచాడు... వీళ్లందర్నీ లోపలికి తోసేయండి. వెంటనే ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు వీళ్లని చుట్టుముట్టారు. ఫ్రెండ్సంతా కంగారు పడ్డారు. 
ఈలోగా చరాగ్ తో 'అన్నా... నువ్వే డీల్ చెయ్యాలి. మేం డీల్ చేయలేం. మావల్ల కాదూ అన్నారు. 

చరాగ్ తన ఐడెంటిటీ కార్డుని హెడ్ కానిస్టేబుల్ కి చూపించాడు. 'మేము సివిల్స్ పరీక్షలకు ప్రిపేరవుతున్న విద్యార్థులం. ఏదో టైం పాస్ కి ఇటు వచ్చాం. రోజూ రాము. పొరపాటైపోయింది. ఇంకెప్పుడూ రాము...' అన్నాడు. హెడ్ కానిస్టేబుల్ కొంచెం మెత్తబడ్డాడు. వచ్చి మా 'ఇన్స్పెక్టర్ గారితో చెప్పండి...' అన్నాడు. చరాగ్ వెళ్లి ఇన్ స్పెక్టర్ కి ఇదే విషయాన్ని చెప్పాడు. అంతా విన్న ఇన్ స్పెక్టర్ వ్యాన్ దిగి, ఈ ఫ్రెండ్స్ కి ఎదురుగా వచ్చి 'ఇలా పబ్లిక్ ప్లేసుల్లో మందు తాగకూడదని తెలియదా మీకు? నిన్న ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఒకామెని మానభంగం చేసి మర్డర్ చేశారు. ఈ ఏరియాలో ఎవరు అనుమానంగా కనిపించినా లోపల వేసి, చితకబాదమని ఆర్డర్ వుంది. సివిల్స్ రాస్తున్నారా మీరు? బుద్ధుందా మీకు? రేప్పొద్దున సెలక్టయి ఆఫీసర్లయిన తర్వాత కూడా ఇలాగే చేస్తారా? వెళ్లండి ఇక్కణ్ణుంచి... ఇంకోసారి ఇటువైపు రాకూడదు...' అన్నాడు. 

గబగబా ఎక్కడివక్కడ పడేసి ఫ్రెండ్సంతా పరుగులు తీశారు.

వెళ్తూ వెళ్తూ అనుకున్నారు, 'ఈ ఇన్స్ పెక్టర్ కూడా సివిల్స్ రాసినట్టున్నాడు. ఏ సర్వీస్ వచ్చి వుండదు. అందుకే మనమీద ఎగురుతున్నాడు ' అని...     

ఆ ఇన్ స్పెక్టర్ నోటి చలవ మంచిదనీ, అతడు అన్నదే జరగబోతోందనీ ఈ ఫ్రెండ్స్ కెవ్వరికీ అప్పుడు తెలీదు. వ్వ్ళ్లలో ఒకడు ఐపీయస్ అయ్యి, ఆ ఇన్ స్పెక్టర్ కే బాస్ గా వెళ్తాడని ఈ ఫ్రెండ్స్ కి అప్పుడు తెలీదు. ఆ ఇన్స్ పెక్టర్ కీ తెలీదు. ఎవరూ ముఖాముఖీ చూసుకోలేదు చీకట్లో...
ఇక వ్యాస రచన...

మెయిన్స్ లో జనరల్ స్టడీస్, రెండు సబ్జెక్టులు కాక ఇదో పరీక్ష వుంది.

రాధాకృష్ణగారికి ఫోన్ చేశాడు కిట్టు.

'సార్! ఈ వ్యాసరచన గురించి చెప్పండి '

ఆయన చెప్పడం మొదలెట్టాడు...

'ఈ వ్యాసరచన ఇంజనీర్లకూ, డాక్టర్లకూ, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, గణిత విద్యార్థులకూ ఒక సవాలు... ఎందుకంటే, క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి అలవాటు పడిపోయిన బుర్రలు వాళ్లవి. మనిషి బుర్రలో రెండు రెండు భాగాలున్నాయి. ఒక భాగం సమస్యా పరిష్కారం... ఇంకో భాగం కళా నిలయం. అందరూ రెండింటినీ సమానంగా వాడరు. సమస్యా పరిష్కారం చేసేవాళ్లు కళానిలయాన్ని పెద్దగా వాడరు. ఈ కళానిలయం పqఅడుపడిపోతుంది. అలాగే, కళానిలయాన్ని ఎక్కువగా వాడేవాళ్లు సమస్యా పరిష్కార భాగాన్ని పెద్దగా వాడరు. దాన్ని పాడుబెడతారు. ఉదాహరణకి శ్రీనివాస రామానుజం లెక్కల్లోనే దిట్ట. మిగిలిన సబ్జెక్టుల్లో సున్నా. అలాగే పండిట్ రవిశంకర్ గారిని మీరు సితార్ వాద్యంలో దిట్ట కదా... మీ బుర్ర సూపర్... ఇంజనీరింగ్ పాసవండి... అంటే చిర్నవ్వుతో నమస్కారం పెడతారాయన... నావల్ల కాదంటాడు. ఈ సివిల్స్ కి బుర్రలోని రెండు భాగాలూ చక్కగా, సమానంగా పని చేయాలి. అప్పుడుగానీ మోక్షం లభించదు.   
ఎవడు కనిపెట్టాడో గానీ, ఈ సివిల్స్ని... మనిషిని సంపూర్ణంగా తీర్చిదిద్దుతుంది. పాసైనా, కాకపోయినా మనిషి తీర్చిదిద్దబడతాడు...
వ్యాసరచన అనేది బుర్రలోని కళానిలయ భాగానికి పదును పడుతుంది. ఈ కళానిలయాన్ని ఇంజనీర్లు, డాక్టర్లు, గణిత, భౌతిక, రసాయన శాస్త్ర విద్యార్థులు పెద్దగా వాడరు. ఏదైనా విషయాన్ని పేరాలు పేరాలుగా వర్ణించండి అటే వాల్లు అనే మాట ఏమిటంటే... ఈ ఊకదంపుడు, పోసుకోలు, సొల్లు రాయడం మావల్ల కాదు, వాళ్లు కూడా ఇప్పుడు చచ్చినట్టు నేర్చుకోవాలి, నేర్చుకుని తీరాల్సిందే. వ్యాసరచనలో ఏదో ఒక విషయం ఇస్తారు. దాన్ని పట్టుకుని, ఇచ్చిన మూడు గంటల్లో వివరంగానూ, అర్థమయ్యేలాగానూ, చదివెంఛేటట్టుగానూ రాయాల్సి వుంటుంది. చెప్పడానికీ, వినడానికీ బాగానే వుంది. కానీ, రాయడం ఎలా? ఒక సినిమా మూడు గంటలుంటుంది సాధారణంగా... వ్యాసరచనకి కూడా 3 గంటలే!

ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుని మూడు గంటల్లో ప్రేక్షకుణ్ణి ఒప్పించి, ఎంత చక్కని సినిమా అని వాడితో అనిపించి, వాడి జేబులోని డబ్బులు లాక్కుని పంపిస్తారు సినిమావాళ్లు.

అదే విధంగా ఈ వ్యాసరచనకిచ్చిన మూడు గంటల సమయాన్ని వాడుకుని, పేపర్ దిద్దేవాడి జేబులో వున్న మార్కులను మనం లాక్కోవాలి. 

తప్పొప్పులు అనవసరం.

దిద్దేవాణ్ణి మెప్పుంచడం ముఖ్యం. ఉదాహరణకు 'దిల్ వాలే దుల్ హనియా లేజాయేంగే' చిత్రంలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. హీరోయిన్ ఇంటికి వెళ్లిపోతుంది. నాకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు, వచ్చి నన్ను తీసుకెళ్లిపో అని హీరోకి కబురు చేస్తుంది హీరోయిన్. హీరో హీరోయిన్ ఇంటికి వెళతాడు. హీరోయిన్ కి కాబోయే భర్తకి ప్రాణమిత్రుడినని నిరూపించుకుంటాడు. హీరోయిన్ తల్లిదండ్రులకు మాకు ఇలాంటి కొడుకే వుంటే ఎంత బావుణ్ణు అనిపించేలా చేస్తాడు. చుట్టాలందర్లో చురుకుగా తిరుగుతూ అందరికీ సహాయంగా వుంటూ తలలో నాలుకలా మారతాడు. ఇంటిల్లిపాదీ ఈ హీరోని తమలో ఒకడిగా భావించి, అతడికి పెళ్లి సంబంధం కూడా చూస్తారు. ఈలోగా ముమ్మరంగా జరుగుతున్న హీరోయిన్ పెళ్లి ఏర్పాట్లకు హీరో విపరీతంగా సహాయం చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటాడు. పనిలో పనిగా చాటుమాటుగా హీరోయిన్ తో సరసాలు సాగిస్తూంటాడు. నిశ్చితార్థపు ఉంగరం పెళ్లికొడుకు హీరోయిన్ కి పెట్టకుండా మాయ చేసి, పెళ్లికొడుకునీ, ఇంట్లో వాళ్లందర్నీ వెధవల్ని చేసి తనే హీరోయిన్ కి ఉంగరం పెట్టేసి, ఘనకార్యం చేసినట్టు కాలరెగరేస్తాడు. హీరోయిన్ తల్లికి విషయం తెలిసి, ఇలా చేసేకంటే, లేచిపోవడం ఉత్తమమైన మార్గం, మర్యాదగా లేచిపోండి అని సలహా ఇస్తుంది. నేనేమైనా సామాన్యుడినా లేచిపోవడానికి... అని హీరోయిన్ సలహాని కాదంటాడు హీరో. చివరకు అంతా రచ్చరచ్చయి అందరికీ తెలిసి, హీరోని కుక్కను కొట్టినట్టు కొట్టి బట్టలు చించేస్తారు. పిచ్చి తిట్లు తిడతారందరూ. ఏదో సినిమా కాబట్టి ఈలోపు హీరోయిన్ తండ్రిగారి మనసు మారి, ఆయన వీళ్లిద్దర్నీ వదిలేసి, మీ చావు మీరు చావండని వదిలేస్తే, హీరో గర్వంగా కాలరెగరేసి, చివరకు మత్స్య యంత్రాన్ని కొట్టి వధువును సంపాదించిన అర్జునుడి లెవెల్లో ఫీలయిపోతాడు. 
ఇంతకీ హీరో చేసిన నీచ నికృష్టపు పనులు ఏమిటంటే... మిత్రద్రోహం. స్నేహితుడు... స్నేహితుడని తిరుగుతూ వాడికి కాబోయే పెళ్లాన్ని ఎత్తుకెళ్లిపోవడం, సొంత కొడుకులా భావించిన హీరోయిన్ తల్లిదండ్రులను మోసగించడం, ఇవి పితృద్రోహం, మాతృద్రోహంతో సమానం.'
కేవలం కుటుంబ సభ్యులనే కాక, వూళ్లో వున్న ప్రజలందర్నీ నిశ్చిత్తార్థ సమయంలో వెర్రివెధవలు చేసి, వీడే నిశ్చితార్థ ఉంగరాన్ని హీరోయిన్ కి తొడుతుతాడు.

ఈ విషయం హీరో హీరోయిన్లకు మాత్రమే తెలిసినా...

ప్రపంచం దృష్టిలో నిశ్చితార్థం అనుకున్న భర్తతో జరిగిపోయినట్టే...
ఇలా ఇంత దరిద్రపు పనులు చేసిన హీరోని...

యాంటీ హీరో, 'డిఫరెంట్ రోల్ ' అని వాళ్లే పేర్లు పెట్టి, ప్రజల కళ్లకి నిజానిజాలు గమనించకుండా గంతలు కట్టి, హీరో చేసింది కరెక్టేనని నిరూపించి, ప్రజలతో జూడా అదేమాట అనిపించి, ప్రజలకు కూడా ఆ సినిమా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చేసి, భారీ వసూళ్లతో సినిమా వందరోజులు ఆడేలా చేసుకున్నారు.

ఆ సినిమా తీసినవాళ్లు...

ఇవే తెలివితేటలు వ్యాసరచనలో వాడాలి.

అంటే హీరో తెలివితేటలను కాదు. 

సినిమా తీసినవాళ్ల తెలివితేటలు కావాలి.

ఎంత చెత్తయినా ఫర్వాలేదు, ఎదుటివాడిని మెప్పించాలి. అదే ధ్యేయం. 

ఉదాహరణకు ఆధునికత అనే అంశాన్ని తీసుకుంటే... 

ఆధునికత అనగా... అని మొదలుపెట్టి... జీన్స్ ప్యాంట్లు, చిరిగిన జీన్స్... సగం నిక్కరు, రంగు రంగుల, పిచ్చిపిచ్చి డిజైన్లు వుండే బనియన్లు, బ్రేక్ డాన్సులు, డర్టీ డాన్స్... ఇలా రాస్తూపోతూ వుంటే... దిద్దేవాడు నవ్వుకుంటాడు... వీడెవడో పిచ్చినా కొడుకులా వున్నాడు... సివిల్స్ కి ఎలా వచ్చాడురా వీడు అనుకుంటాడు.

ఇలా లిస్ట్ అంతా రాసి, చివర్లో... ఇవన్నీ ఆధునికత అనుకుంటారు తెలివిలేనివాళ్లు... కానీ, ఈ ఆధునికత అంటే ఇవి కాదు... ఆధునికత అంటే... అని మళ్లీ మొదలుపెట్టేటప్పటికి ట్రాక్ మారిపోతుంది. దిద్దేవాడికి ఇప్పుడనిపిస్తుంది... వీడు పిచ్చినా కొడుకు కాదు... తెలివైనా నా కొడుకు అని...

ఆ తర్వాత నిజమైన ఆధునికత గురించి రాయాలి.

హరప్పా మొహంజోదారో నగరాలు ఆ సమయంలో ఆధునిక నగరాలు... ఇప్పుడు తవ్వి బయటకు తీసినవారు ముక్కున వేలేసుకున్నారు వాళ్ల ఆధునికతను చూసి...

ఇక ఆధునిక భావాలు... చిన్న గోచీ, చేతిలో కర్ర పట్టుకున్న గాంధీజీ ఆధునికుడు.

కులమత బేధాలేకుండా వుంటాడు... అది ఆయన ఆధునికత... నోరు తెరచి, స్వరాజ్యం కావాలి అని అడిగే ధైర్యం లేని రోజుల్లో నాకు సంపూర్ణ స్వరాజ్యం కావాలి అని అడిగిన ఆధునికుడాయన. 'మోడర్న్ మేన్ ' గాంధీజీ..

ఇండియాలో వాళ్లు ఎలా పోయినా బ్రిటిష్ వాడికి  అనవసరం. వాడికి కావలసింది ఇండియాలోని డబ్బులు, వనరులు. వాటిని ఎత్తుకెళ్లిపోవడమే వాడికి కావాలి. సార్... సార్... మా ఇండియాలో మూఢాచారాలున్నాయి, వాటిని రూపుమాపండి అంటే... మీ చావు మీరు చావండి, నాకెందుకు అంటాడు బ్రిటిష్ వాడు...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
22nd Episode