Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Srikrishna Devaraya  Honour for Mohan Babu

ఈ సంచికలో >> సినిమా >>

ఐస్ క్రీం ను టేబుల్ ప్రాఫిట్ తో విడుదల చేస్తున్నాం.

' ఇటీవలి కాలంలో పది పదిహేనుమంది హీరోల సినిమాలకు తప్ప, మిగతా సినిమాలకు సరైన రీతిలో బిజినెస్ అవ్వడం లేదు. కానీ, ' ఐస్ క్రీం' సినిమాను టేబుల్ ప్రాఫిట్ తో విడుదల చేస్తున్నాం. ఈ ఘనత పూర్తిగా మా దర్శక సంచలనం రాం గోపాల్ వర్మకే చెందుతుంది.' అంటున్నారు ఆ చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. నవదీప్-తేజస్వి జంటగా రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకం పై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న 'ఐస్ క్రీం'  ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని 20 నిముషాల నిడివి గల సన్నివేశాల్ని మీడియా సమక్షంలో మీడియేటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, మరియు ఎగ్జిబిటర్స్ కు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్ వర్మ, నవదీప్, రామసత్యనారాయణ, ఫ్లోకేం టెక్నాలజీ ప్రతినిధులు అరుణ్, శేషుకుమార్ లతో పాటు ప్రముఖ దర్శకులు శివనాగేశ్వరరావు, మధుర శ్రీధర్, తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ్లోకేం టెక్నాలజీ సమీప భవిష్యత్తులో విప్లవాలు సృష్టించడం ఖాయమని ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ పునరుద్ఘాటించారు. గత పాతికేళ్ళుగా సినిమాలు తీస్తున్న తననే ఈ టెక్నాలజీ సంస్థ ఆశ్చర్యానికి గురి చేసిందని ...సినిమా మేకింగ్ కు సంబంధించిన భవిష్యత్ మొత్తం ఫ్లోకేం టెక్నాలజీదేనని ఆయన పేర్కొన్నారు. ఆర్టిస్టులకు ఫ్లోకేం టెక్నాలజీ పూర్తి ఫ్రీడం ఇస్తుందని హీరో నవదీప్ అన్నారు. ఫ్లోకేం టెక్నాలజీతో రూపొందిన మొట్టమొదటి చిత్రానికి తాను నిర్మాతను కావడం చాలా గర్వంగా ఉందని, చాలా కొద్దిమంది సినిమాలకు తప్ప మిగతా సినిమాలకు బిజినెస్ అవ్వడం కష్టంగా ఉన్న ప్రస్తుత క్లిష్ట పరిస్తితుల్లో 'ఐస్ క్రీం' సినిమాను టేబుల్ ప్రాఫిట్ తో ఈ నెల 11న విడుదల చేస్తున్నామని నిర్మాత రామసత్యనారాయణ ప్రకటించారు. 20 నిమిషాల 'ఐస్ క్రీం' అద్భుతంగా ఉందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదని. చాలా పెద్ద రేంజ్ లో హిట్టయ్యేందుకు అవసరమైన అంశాలన్నీ అందులో ఉన్నాయని శివనాగేశ్వర్రావు, మధుర శ్రీధర్, విజయేందర్ రెడ్డి, అన్నారు. తాము  'ఫ్లోకేం టెక్నాలజెతో రూపొందించిన 'ఐస్ క్రీం' చూసుకుంటూంటే తమకు చాలా గర్వంగా ఉందని..రాంగోపాల్ వర్మకు తాము ఎన్నటికీ రుణపడి ఉంటామని ఫ్లోకేం టెక్నాలజీ ప్రతినిధులు అరుణ్, శేషుకుమార్ అన్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
maphiyadan