Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
maphiyadan

ఈ సంచికలో >> సినిమా >>

అప్పుడు బాబాయ్... ఇప్పుడు అబ్బాయ్..!!

then&now  uncle&son..!!

 ఈ మధ్య కాలంలో ఒక తరానికి నచ్చడమే కష్టమైపోతోంది. అటువంటిది.. ఫుల్ లెంగ్త్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ' ఊహలు గుసగుసలాడే ' చిత్రం మాత్రం యూత్, ఫ్యామిలీ, మాస్ అన్న బేధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

' ఊహలు గుసగుసలాడే ' చిత్రం విడుదలైన రెండో రోజు నట సింహం నందమూరి బాలకృష్ణ ' ఊహలు గుసగుసలాడే ' చిత్రాన్ని వీక్షించి.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలపడంతోపాటు.. ఇంత మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సాయి కొర్రపాటి పై అభినందనల వర్షం కురిపించారు.

తాజాగా నందమూరి మూడో తరం కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా ' ఊహలు గుసగుసలాడే ' చిత్రాన్ని చూసి... ' సినిమా చాలా బాగుంది. ఇటువంటి సినిమాలు తెలుగులో మరెన్నో రావాలి ' అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఈ సంధర్భంగా ఆయన చిత్ర నిర్మాత సాయి కొర్రపాటికి, చిత్ర దర్శకుడు శ్రీని అవసరాలకు, హీరోహీరోయిన్లు నాగశౌర్య-రాశిఖన్నాకు తన అభినందనలు అందించారు!     

మరిన్ని సినిమా కబుర్లు
chitram sreenu new movie