Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with  Allari Naresh

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష ' రా రా కృష్ణయ్య '

Ra Ra Krishnayya Movie Review

చిత్రం: రారా కృష్ణయ్య
తారాగణం: సందీప్‌ కిషన్‌, రెజినా, జగపతిబాబు, తనికెళ్ళభరణి, బ్రహ్మాజి, కళ్యాణి, తాగుబోతు రమేష్‌, రవిబాబు, సత్యం రాజేష్‌ తదితరులు  తదితరులు
ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌
సంగీతం: అచ్చు
నిర్మాణం: ఎస్‌.వి.కె. సినిమా
దర్శకత్వం: పి. మహేష్‌బాబు
నిర్మాత: వంశీ కృష్ణ శ్రీనివాస్‌
విడుదల తేదీ: 4 జులై 2014

క్లుప్తంగా చెప్పాలంటే
కిట్టు (సందీప్‌ కిషన్‌) ఓ క్యాబ్‌ డ్రైవర్‌. క్యాబ్‌ కంపెనీ ఓనర్‌ వద్దే ప్రతి నెలా కొంత మొత్తం దాచుకుంటాడు, సొంతంగా క్యాబ్‌ కొనుక్కోవడానికి కిట్టు. అయితే ఆ ఓనర్‌ మోసం చేయడంతో ఓనర్‌ మీద కసి తీర్చుకునేందుకు ఓనర్‌ కుమార్తె నందు (రెజినా)ని కిడ్నాప్‌ చేస్తాడు. ఆ కిడ్నాప్‌ ద్వారా ఇష్టం లేని పెళ్ళిని తప్పించుకున్నానన్న ఆనందం నందులో కూడా వుంటుంది. కిడ్నాప్‌ తప్పని కిట్టు తెలుసుకునేలోపు, తన దగ్గరున్న నందు కిడ్నాప్‌కి గురవుతుంది. నందుని కిడ్నాప్‌ చేసిందెవరు? నందుని కిట్టు కాపాడాడా? అనేవి తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే
సందీప్‌ కిషన్‌ బాగా చేశాడు. అతని ఫేస్‌లో అన్ని రకాల హావభావాలూ చాలా తేలిగ్గానే పలికేస్తున్నాయి. బరువైన పాత్ర అయినా సులువుగా చేసుకుపోతున్న సందీప్‌ కిషన్‌, సింపుల్‌ పాత్రల్లో ఇంకా చెలరేగిపోతాడు. ఎమోషన్‌ సీన్స్‌లో సందీప్‌ ఆకట్టుకుంటాడు. హీరోయిన్‌ రెజీనా అందంగా కన్పించడమే కాదు, అందంగా నటించగలదు కూడా. ఆ విషయం ఈ సినిమాతో ఇంకోసారి ప్రూవ్‌ అయ్యింది. గ్లామర్‌తోనూ, నటనతోనూ మంచి మార్కులు సంపాదించుకుంది రెజీనా.

జగపతిబాబు ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. అయితే దర్శకుడు జగపతిబాబుని ఇంకాస్త సరిగ్గా వాడుకుని వుంటే బావుండేది. తాగుబోతు రమేష్‌, వేణు, రవిబాబు తదితరులు కామెడీ పండించారు . మిగతా పాత్రధారులంతా  ఓకే. వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు.అచ్చు సంగీతం బాగానే వుంది. టైటిల్‌ సాంగ్‌ ఆకట్టుకుంటుంది. మిగతా పాటలు ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి మంచి మార్కులేయించుకున్నాడు. నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడలేదు. మంచి ఔట్‌ పుట్‌ కోసం బాగానే ఖర్చు చేశారు. ఆ క్వాలిటీ తెరపై కన్పించింది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్స్‌ వర్క్‌ ఓకే. ఎడిటింగ్‌ పర్వాలేదుగానీ, సినిమా నెమ్మదిగా సాగడానికి ఎడిటింగ్‌ లోపాలు కూడా ఓ కారణం. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్‌ అయ్యింది.

ఫస్టాఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌ మిక్సయి సరదా సరదాగానే సాగిపోతుంది. కాస్తంత రొమాన్స్‌, అంతలోనే కొంచెం యాక్షన్‌ కలిసి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఆకట్టుకుంటుంది. సెకెండాఫ్‌లో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించి వుంటే సినిమాకి ఇంకా మంచి టాక్‌ లభించేది. కానీ, సెకెండాఫ్‌లో ఎమోషన్స్‌, మెలోడ్రామా ఎక్కువవడంతో సినిమా స్లో అయిపోతుంది. ఓవరాల్‌గా చూస్తే బోరింగ్‌ కాకపోయినా, బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా ఇంపాక్ట్‌ చూపే సత్తా సినిమాలో లేదు. యావరేజ్‌ సినిమాగా మాత్రమే  మిగిలిపోయేందుకు అవకాశమెక్కువ.

ఒక్క మాటలో చెప్పాలంటే
ఈ కృష్ణయ్యను ఓసారి చూసెయ్యొచ్చు

అంకెల్లో చెప్పాలంటే
3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka