Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sai korrapaati greets samanta

ఈ సంచికలో >> సినిమా >>

కాన్ఫిడెంట్‌గా వున్న కళ్యాణ్‌రామ్‌

kalyan ram confidence..

హీరో కళ్యాణ్‌రామ్‌ కాన్ఫిడెంట్‌గా వున్నాడు తన కొత్త సినిమా విషయంలో. ఎప్పుడూ చాలా కాన్ఫిడెంట్‌గానే సినిమాలు నిర్మించే కళ్యాణ్‌రామ్‌, ఈసారి ప్రయోగాల్ని పక్కన పెట్టి కమర్షియల్‌ సక్సెస్‌ని వెతుక్కునే పనిలో ఉండడంతో ఆయన ధీమా ఇప్పుడు డబుల్‌ అవుతోంది. హీరోగా సినిమాలు చేస్తూ, కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ, నిర్మాతగా ఉనికిని చాటుకుంటున్న కళ్యాణ్‌రామ్‌ ‘ఓం’ అనే సినిమాని త్రీడీలో ప్రయోగాత్మకంగా చేసి పరాజయం చవిచూశాడు.

ఇప్పుడు అతని దృష్టి అంతా కమర్షియల్‌ విజయంపైనే. అందుకే ‘పటాస్‌’ సినిమాకి కమర్షియల్‌ హంగులున్న కథని ఎంచుకున్నాడు కళ్యాణ్‌రామ్‌. ఈ చిత్రంతో కొత్త దర్శకుడు అనిల్‌ రావిపూడి పరిచయమవుతున్నాడు. పోలీస్‌ గెటప్‌లో కళ్యాణ్‌రామ్‌ కన్పించనున్నప్పటికీ సరదా సరదాగా కథ సాగిపోతుందట. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ సరిగ్గా మిక్స్‌ చేసి, టెక్నికల్‌గానూ గ్రాండ్‌గా చిత్రాన్ని దర్శకుడు రూపొందిస్తున్నాడని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ అంటున్నాయి.

కొత్తమ్మాయి శృతి కళ్యాణ్‌రామ్‌ సరసన ‘పటాస్‌’ సినిమాలో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ‘పటాస్‌’ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. సినిమాలో కళ్యాణ్‌రామ్‌ లుక్‌ చాలా స్టైలిష్‌గా ఉంటుందట. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌లో కళ్యాణ్‌రామ్‌ స్టైలిష్‌గానే కన్పిస్తున్నాడు.

మరిన్ని సినిమా కబుర్లు
family trend