Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kalyan ram confidence..

ఈ సంచికలో >> సినిమా >>

ఫ్యామిలీ ట్రెండ్‌ నడుస్తోందా?

family trend

 ఓ సినిమా సక్సెస్‌ అయితే ఆ సినిమా దారిలోనే మరికొన్ని సినిమాలు వస్తాయి. ఫలానా జోనర్‌లో సినిమా హిట్టయ్యిందన్న ఆలోచతో, ఆ జోనర్‌లో సినిమాలు చేయడానికి హీరోలూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఫ్యాక్షన్‌ సినిమాలు, లవ్‌ ఎంటర్‌టైనర్స్‌, కామెడీ సినిమాలు, ఫ్యామిలీ జోనర్‌ సినిమాలూ ఒక్కోసారి ఒక్కో రకంగా బాక్సాఫీస్‌ వద్ద ఫలితాన్ని పొందుతాయి.

ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన ఫ్యామిలీ సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది. ‘అత్తారింటికి దారేది’ సక్సెస్‌తో ఆ ట్రెండ్‌ మొదలైంది. బాబాయ్‌ సాధించినట్టగానే ఫ్యామిలీ సినిమాతో తానూ హిట్‌ కొట్టాలనుకుంటున్నాడు హీరో రామ్‌చరణ్‌. అందుకే ‘గోవిందుడు అందరివాడు’ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. మోడ్రన్‌ టచ్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది.

కృష్ణవంశీ దర్శకత్వంలో క్లాస్‌ సినిమా అంటే అందులో ఫ్యామిలీ మెచ్చే అంశాలు మెండుగా వుంటాయి. కొంచెం మాస్‌ టచ్‌ ఇస్తూనే, క్లాస్‌ లుక్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చరణ్‌ కూడా వరుస మూస మాస్‌ సినిమాలు చేసి బోర్‌ ఫీలయ్యే ఈ సినిమాకి ఓకే చెప్పాడట. ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. సినిమా తప్పక విజయం సాధిస్తుందన్న చిత్ర యూనిట్‌ నమ్మకం నిజమైతే ఫ్యామిలీ చిత్రాల ట్రెండ్‌ ఇంకొన్నాళ్ళు జోరుగా కొనసాగుతుంది.

మరిన్ని సినిమా కబుర్లు
,tribul rol ,seven heroyins