Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐ.ఏ.ఎస్ పాస్

 జరిగిన కథ: కిట్టు, అతడి ఫ్రెండ్స్ అందరూ కలసి ఒకసారి నిర్మాణంలో వున్న నెక్లెస్ రోడ్ మీద సరదాగా మందు పార్టీ చేసుకుంటూంటారు. ఈలోగా పోలీసులు వచ్చి అంతకు ముందు రోజే అక్కడ హత్య జరిగిందనీ, ఆ ప్రదేశానికి రావడం ప్రమాదకరమనీ అంటాడు. వచ్చినా అనుమానించవలసి వుంటుందనీ కటువుగా మాట్లాడతాడు. దేశానికి ఉపయోగపడవలసిన పౌరులు ఇలాంటి పనులకు పాల్పడ్డం మంచిది కాదని హితవు పలుకుతాడు.

అలా ఏమాత్రం ఇంట్రస్ట్ లేని విలియం బెంటింక్ వెనకాలపడి సతీసహగమనం తప్పు అనే చట్టాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేసిన రాజా రమమోహన్ రాయ్ ఆధునికుడు. ఇలా ఒకదానికొకటి సంబంధం వుండేలా, ఇంట్రెస్టింగ్ గా, ఆధునికతను ముందుగా వివరించి రకరకాల కల్చర్ లలో ఆధునికత ఎలా వుంది, అసలైన ఆధునికత ఏమిటి? ఆధునికత పేరు మీద ప్రజలు తప్పుడు మార్గంలో పోతున్నారు. వళ్లని తిరిగి మంచి మార్గంలోకి ఎలా తేవాలి? ఇలాంటివన్నీ కూలంకషంగా చర్చించి, చివరకు నువ్వేమనుకుంటున్నావు? ఆధునికత అంటే ఎలా వుండాలి? ఆధునికత యంత్రాల్లో వుందా, మనుషుల్లో వుందా? ఆధునికత అనేది మంచిదా, చెడ్డదా? నిజమైన ఆధునికత అనేది ఏమిటి? అని చెబుతూ ముగించాలి.

ముగింపు కూడా చాలా ఇంట్రస్టిగ్ గా వుండాలి.

వ్యాసరచన గురించి పేపర్లలో ఎంతోమంది రాస్తారు. ఇలా రాయాలి, అలా రాయాలి, మొదలు, బాడీ, ముగింపు... ఇలా వివరణలు ఇస్తారు. కానీ, రాసే విధానంలో వైవిధ్యం గురించి ఎవరూ చెప్పరు. అందరూ మూసపోసినట్టుగా రాస్తే... ఎలా... దేశమంతా రాసేవాళ్లకీ, వైవిధ్యంగా రాసేవాళ్లకీ తేడా వుండాలి. ఈ వైవిధ్యం ఎక్కువ మార్కులు తెప్పిస్తుంది.

గొప్పవాళ్లు గొప్ప పనులు చేయరు.అందరూ చేసే పనులే చేస్తారు.కానీ వైవిధ్యంతో చేస్తారు. అంతే తేడా... అంతకంటే ఏమీలేదు...అని ముగించారు రాధాకృష్ణగారు.

మెయిన్స్ పరీక్షలు రాసేశాడు కిట్టు.

రెండు పార్టుల ప్రిలింస్ పోయంది.

ఇది మోడోసారి, ప్రిలింస్ పాసయి మెయిన్స్ రాశాడు.

ఫలితాల కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు.

కిట్టుతో పాటు ఇంకో మనిషి కూడా కిట్టుకంటే అట్రుతతో ఎదురు చూసింది.

ఆమె కిట్టు భార్య అనిత...

వీళ్లతో పాటు ఆత్రుతగా ఇంకొకళ్లు కూడా ఎదురు చూస్తున్నారు.

ఎవరదీ?

చుట్టూ వున్న సమాజం.

ఈ సమాజంలో రెండు వర్గాలున్నాయి.

ఒకటి ఓదార్చి ధైర్యం చెబుతుంది, ఇంకోటి ఖండించి అణగదొక్కేది...

ఎదురు చూసిన ఫలితాలు రానే వచ్చాయి...

కిట్టు ఫెయిలయ్యాడు...

మార్కులు కూడా వచ్చాయి.

ఒకటీ, రెండూ కాదు. వంద మార్కుల తేడాతో ఫెయిలయ్యాడు కిట్టు.

రాష్ట్రవ్యాప్తంగా కిట్టు మీద ఖండనలు మొదలయ్యాయి.

ఒకటా, రెండా?

వంద మార్కులు తక్కువొచ్చాయా?

ఇలాగైతే ఇంతే సంగతులు...

జన్మలో పాస్ కావు...

చచ్చినా పాస్ కావడం కష్టం...

ఎప్పుడో చెప్పాం, నీవల్ల కాదని... వింటే కదా!

మందు, సిగరెట్లు తాగి పరీక్ష పాసవుతారా?

ఏమ్మా అనితా...

నువ్వైనా చెప్పచ్చుగా?

అనవసరంగా డబ్బులు తగలేయొద్దని...

ఒకసారి తప్పు చేయవచ్చు...

రెండుసార్లు తప్పు చేయవచ్చు...

ఆ తప్పులోంచి తెలుసుకుని... మనవల్ల కాదని వదలుకోవాలి...

సివిల్స్ అంటే చీపై పోయింది...

ప్రతివాడూ రాసెయ్యడమే...

సివిల్స్ రాస్తున్నానని చెప్పుకుంటే గొప్ప వస్తుందని... అంతే...

అంతకు మించి విషయమేమీ లేదు...

ఇవన్నీ గమనించిన అనిత, కిట్టుతో అంది. "మనవల్ల కాదేమో... ఇప్పటికే వున్న ఉద్యోగంలో చాలా చెడ్డపేరు తెచ్చుకున్నారు. సెలవులు పెట్టి వెళ్లిపోతారనీ, పనిమీద శ్రద్ధ లేదనీ అనుకుంటున్నారు. జీతం కూడా సరిగ్గ రావడం లేదు. ఇక ఇవన్నీ మానేసి, వున్న ఉద్యోగాన్ని ఊడగొట్టుకోకుండా వున్నదాన్ని నిలబెట్టుకోవడం ఉత్తమమేమో!"

కిట్టు ఈ కామెంట్లన్నింటినీ గమనిస్తూనే వున్నాడు.

అనిత మాటల్ని శ్రద్ధగా విన్నాడు.

విని, చిరునవ్వుతో అనిత వైపు చూస్తూ అన్నాడు.

"గోడమీది పులుసు గోకి వెయ్యవే విర్రిదానా"

"గోడమీద పులుసు గోకడమేంటండీ... ఏం మాట్లాడుతున్నారు మీరు?" అంది అనిత.

"దీనికో కథ వుంది" అన్నాడు కిట్టు.

"విను చెబుతాను. ఒకడున్నాడంట... వాడి భార్యకి ఒకే ఒక్క ఆకుకూర చెయ్యడం తెలుసంట! రోజూ అదే చేసి పెట్టేదంట. రోజూ తినీ తినీ విసుగెత్తి పోయిందంట వాడికి... ఎన్నిసార్లు చెప్పినా ఆమె ఇంకోటి చేసేది కాదు... ఆ తర్వాత ఒకరోజు యధావిధిగా కంచం ముందు కూర్చున్నాడంట... మళ్లీ అదే ఆకుకూర! విసుగు, కోపం రెండూ పెరిగిపోయి, కంచాన్ని రెండు చేతులతో పట్టుకుని కంచంలోని పదార్థాలని గోడకేసి విసిరాడంట... మళ్లీ ఇంతలో ఆకలి... కడుపులో మంట... నీరసంగా కంచం వైపు చూసి, అందులో కొద్దిగా మిగిలున్న అన్నం, కూర నోట్లో పెట్టుకున్నాడంట... చాలా అద్భుతంగా, రుచికరంగా వుందట... ఈలోపు కంచాన్ని విసరికొడుతున్న భర్త కోపాన్ని చూసి, అవాక్కైన భార్య... రాయిలా నిలబడి చూస్తున్నదట...! ఇంతకీ ఏమైందంటే ఎప్పుడూ చేసే ఆకుకూరనే ఈరోజు వెరైటీగా, ఫార్ములా మార్చి చేసిందామె... ఆ విషయం భర్తకి చెప్పలేదు... భర్తకు తెలియదు కాబట్టి... రోజూ వుండే ఆకుకూరనే కదా... అని విసిగిపోయాడు. ఇప్పుడు రుచి తెలుసుకున్నాడు కదా!

రాయిలా నిలబడి చూస్తున్న భార్యతో అన్నాడంట...

గోడమీది పులుసు గోకి నాకు మళ్లీ కంచంలో వెయ్యి... అని.

ఈ మాటే 'గోడమీది పులుసు గోకి వెయ్యవే... వెర్రిదానా'

"ఈ కథకీ, మనకీ సంబంధం ఏముంది?" అన్నది అనిత.

నేను పరీక్ష రాయడం, తప్పడం, ఇది రోజూ తినే ఆకుకూరలాంటిది. ఐతే ఇప్పుడు తప్పడమనేది గోడమీద వున్న రుచికరమైన పులుసులాంటిది. ఎలా? వందమార్కులు తక్కువ అని తిడుతున్నారు కదా! ఔనండీ... వందమార్కులంటే చాలా తేడానే కదా? ఒకటే సబ్జెక్టులో వందమార్కులు పోగొట్టుకోలేదు నేను... మరి?

జనరల్ స్టడీస్ పేపర్ వన్, పేపర్ టూ...

మొదటి సబ్జెక్ట్ పేపర్ వన్, పేపర్ టూ...

రెండో సబ్జెక్ట్ పేపర్ వన్, పేపర్ టూ...

వ్యాసరచన ఒక పేపర్...

తెలుగు, ఇంగ్లీష్ వుంటాయి గానీ, ఆ మార్కులు లెక్కలోకి రావు. వాటిని లెక్కలోకి తీసుకోవద్దు.

అందుచేత మొత్తం ఎన్ని పేపర్లు వచ్చాయి?

ఏడు!

మరుసటి సారి రాసినప్పుడు ఒక్కో పేపర్లో ఇరవై మార్కులు పెంచుకునేలా ఇంకొంచెం కష్టపడితే అప్పుడు ఒక్కో పేపర్ కి ఇరవై చొప్పున ఏడు పేపర్లలో ఎన్ని మార్కులు పెంచుకోవచ్చు?

నూట నలభై...

అంటే... ఆ తగ్గిన వంద కాకుండా ఇంకో నలభై ఎక్కువ తెచ్చుకోవచ్చన్నమాట...

ఆ మాత్రం దానికి ఎవరో ఏదో అన్నారని బాధపడడమెందుకు?" అన్నాడు కిట్టు.

"ఇదేదో బాగానే వుందండీ!

మనం వెళ్లి అందరికీ చెబుదాము" అంది అనిత.

"ఇంటింటికీ వెళ్లి తలుపు కొట్టి చెబుదామా? మనం చెప్పినా వినేవాళ్లెవరూ లేరిక్కడ...

మనుషులు కొన్ని అభిప్రాయాలకు ఫిక్స్ అయిపోతారు. ఇంకెవ్వరు చెప్పినా వినరు...

అందుచేత మనకు తెలిసిన విషయాన్ని మనతో వుంచుకోవడం మంచిది" అన్నాడు కిట్టు.

పట్టుదల తగ్గడం కాదుగదా, ఇంకా పెరిగింది కిట్టుకి. మళ్లీ మరుసటి సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్నాడు. రెట్టించిన ఉత్సాహంతో పర్కీక్షకు తయారవడం మొదలు పెట్టాడు. ప్రిలింస్ గురించి భయపడ్డాడు. మొదట్లోనే పోతే? దేవుడా దేవుడా అనుకున్నాడు.
దేవుడు కరుణించాడు.

ప్రిలింస్ పాస్...

ఇక మెయిన్స్. కోచింగ్, చదవడం... ఇదే ధ్యాస...

లోపు అనిత గర్భవతి అయింది.

"మూడు నెలల పాటు నువ్వు భీమవరం వెళ్లిపోయి, అమ్మానాన్నల దగ్గర వుండు. నేను పరీక్షలు రాసిగానీ భీమవరానికి రాను. డెలివరీ అయిపోయినా గానీ, నేను వస్తానో, రానో తెలీదు. ఎవరు ఏమన్నా నిబ్బరంగా వుండు..." అని చెప్పాడు కిట్టు.

అనితకు తెలుసు...

ఈ మాటల సారాంశం... అందులోని తీవ్రత...

కిట్టుకంటే గట్టి పట్టుదల కలది అనిత. భూమి తలకిందులైనా లెక్కచేయని సంకల్పబలం కలది అనిత.

తలాడించింది... అనితని భీమవరంలో దిగబెట్టి వచ్చేశాడు.

ఆఫీసులో సెలవు షరా మామూలే... చదువులో చరాగ్, జానీ శీను, డాక్టర్ శ్యాంలు కిట్టుకి తోడు... రాత్రి రెండు గంటల వరకు మిత్రుల దగ్గరుండి బోరు కొట్టేది కిట్టుకి. తన అపార్ట్ మెంట్ కు వచ్చేవాడు. మళ్లీ అరగంటకి మళ్లీ బోరు... తిరిగి ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లేవాడు...
మెయిన్స్ దగ్గర పడుతున్నది... వేడి పెరుగుతున్నది...

సరిగ్గా అప్పుడే పిడుగులాంటి వార్త...

తాతయ్య చనిపోయాడు. భుజాల మీద ఎక్కించుకుని తిప్పిన తాతయ్య, పొలంలో తత దగ్గర నేర్చుకున్న సంగతులు, ఎప్పుడన్న నిద్రపోయే ముందు 'తాతయ్యా! పాము వస్తుందేమో' అంటే మూలన వున్న పెద్ద చేతికర్రను చూపించి 'కొట్టి తరిమేస్తాను...' అని కర్రని నేలకి తాటించి శబ్దం చేసేవాడు తాతయ్య... అప్పుడే ఎందుకు చనిపోయాడు?

నిజమేనా? అయినా తాతయ్య ఎందుకు చనిపోతాడు? మాతోనే వుండాలి కదా?

తాతయ్య ఫ్రెండ్ శ్రీనివాసం అని వుండేవాడు. వీళ్లిద్దరూ సాయంత్రం భోజనం తర్వాత చుట్టలు కాల్చుతూ సినిమా కబుర్లు చెప్పుకునేవారు. అరుగుమీద తాతయ్య, తాతయ్య ఫ్రెండ్స్, ఎదురుగా ఇసులకో కిట్టు, కిట్టు ఫ్రెండ్స్ ఆడుకునేవాళ్లు. ఇంట్లో నాయనమ్మదే పైచేయి. తాతయ్యని మాట్లాడనిచ్చేది కాదు. ఎప్పుడైనా స్పెషల్ కూర చేసేది. తాతయ్యకు పొద్దుటి కూర వేసేది. కిట్టుకి, అన్నయ్యకి స్పెషల్ కూర వేసేది.

తాతయ్య అడిగేవాడు... 'ఇంకోటేదో కూర వున్నట్టు చూశాను...' అని... గయ్యిమని లేచేది నాయనమ్మ. 'అది పిల్లలకు. నీకు పొద్దుటి కూర వేశాను కదా..." అనేది. తాతయ్య మారుమాట్లాడకుండా తినేవాడు.

ఈలోగా కిట్టు, కిట్టు అన్నయ్య తాతయ్యకి పక్కనుంచి చెరొక ముక్క కోడిగుడ్లు వేసేసేవారు.

జొరమొస్తే... పక్కనే కూర్చుని కాళ్లకీ, చేతులకీ నూనె రాసి... 'తగ్గిపోతుందిలే!' అని ధైర్యం చెప్పేవాడు.

హైద్రాబాదులో వుండగా ఒకరోజు... కిట్టు పెన్నాడ వెళ్లాడు... తాతయ్యకి తెల్లని గడ్డం, మీసాలు బాగా పెరిగిపోయి వున్నాయి."ఏం... తాతయ్య గడ్డం గీసుకోలేదు?" అని అడిగాడు కిట్టు.

"బుల్లోడికి చెప్పానురా... (బుల్లోడంటే కిట్టు నాన్నగారు) మంగలోడికి చెప్పాడు గానీ, ఆడు రాలేదు. వారం, పదిరోజులైపోతోంది.
దురదపెట్టి చిరచిరలాడిపోతోంది" అన్నాడు తాతయ్య.

వెంటనే స్కూటరేసుకుని చింగిచ్చం వెళ్లి, ఒక క్రీం, రేజర్, బ్లేడ్, ఆఫ్టర్ షేవ్ లోషన్ తెచ్చాడు కిట్టు.

తాతయ్యని వరండాలో కూర్చోబెట్టి, షేవింగ్ చేసి, ఆ తర్వాత ఆఫ్టర్ షేవ్ లోషన్ ఒల్డ్ స్పైచె తగిలించాడు. గడ్డం ఎక్కువ పెరిగిపోవడంతో గట్టిగా చర్మానికి తగిలేలా షేవింగ్ చేయాల్సి వచ్చింది. చర్మం పొట్లుపోయింది... దానికి ఓల్ద్ స్పైస్ తగిలించేటప్పటికి చిరచిరలాడిపోయింది తాతయ్యకి. "అబ్బ... మండిపోతోందిరా కిట్టూ..." అన్నాడు తాతయ్య.

గడ్డం చేస్తున్నంతసేపూ... "నాకెందుకురా... ముసలోడిని.... నన్ను వదిలేయి!

ఇవాళో, రేపో మంగలోడు వస్తాడులే!" అంటూనే వున్నాడు. మంగలోడు షేవింగ్ చేసి, పటికతో రుద్దుతాడు. ఓల్డ్ స్పైస్ తో వచ్చిన మజా పటికతో రాదు. పైగా ఇది సువాసన కలిగినది.

తాతయ్యకి ఎంతో ఆనందం కలిగింది. చేతులతో నున్నగా తయారైన గడ్డాన్ని సవర చేసుకుంటూ ఆనందపడిపోయాడు. ఈ చిన్న విషయం ఎంత ఆనందాన్ని కలిగించిందో... తాతయ్య తనకు ఎన్ని వందల, వేల ఆశీర్వాదాలు మనసులో ఇచ్చాడో కిట్టు తాతయ్య కళ్లను చూసి తెలుసుకున్నాడు.

ఇంతలో నాన్నగారు భీమవరం నుండి వచ్చారు. "ఎందుకురా, ఇవన్నీ కొన్నావ్? రేపు నువ్వెళ్లిపోతావ్. తాతయ్యకి అవి ఎలా వాడాలో తెలీదు. మళ్లీ నువ్వు ఎప్పుడు వస్తావో... అప్పటిదాకా తాతయ్య ఎదురు చూడాలా?" అన్నారు.నాన్నగారికి తన లాజిక్ తనదే... సివిల్స్ విషయంలో కూడా అంతే...

నీకు వస్తువులు, బట్టలకి కావాలంటే అడుగు డబ్బులిస్తాను, సివిల్స్ పేరు మీద రూపాయి కూడా ఇవ్వను" అన్నారు. కిట్టు వాళ్ల నాన్నగారికి ఇక ఎప్పుడూ అడగలేదు.

సరే, ఆయనతో వాగ్వివాదం ఎందుకని, "ఏదో నాకు అనిపించింది నేను చేశానండీ... అంతే!" అన్నాడు.ట్రైన్ ఎక్కి భీమవరంలో దిగి, అక్కడ నుండి పెన్నాడ వెళ్లాడు కిట్టు.

తాతయ్యను వరండాలో పడుకోబెట్టారు.

కిట్టు పెద్దగా బోరుబోరున ఏడవాలని గ్రామస్తులంతా ఎదురు చూస్తున్నారు.

కిట్టు ఏడవడం లేదు. కళ్లవెంట నీళ్లు రావడం లేదు. స్తబ్దంగా వున్నాడు. తాతయ్య గడ్డం మాసి వుంది. కళ్లు గుంటలు పడిపోయాయి. బుగ్గలు లోపలికి వెళ్లిపోయాయి.

తనకిష్టమైన తాతయ్య గడ్డాన్ని ఒకసారి నిమిరి, అరుగుమీద కూర్చున్నాడు.

తాతయ్యకు స్నానం చేయించారు. కిట్టు అన్నదమ్ములు, గ్రామస్తులు, నాన్నగారు...

కిట్టు తన చేయి వేయలేదు.

నాయనమ్మ గుండులు బాదుకుంటూ ఏడుస్తోంది... పెద్దగా అరుస్తూ అంటోంది... "బతికున్నప్పుడు తాతయ్యను చూసినవాడు లేడు. ఐదుగురన్నదమ్ములు ఇప్పుడు తాతయ్యను బంగారు పెట్టెలో పెట్టి తీసుకెళ్లండి. డబ్బులు విరజిమ్మండి. ఘనంగా పంపించండి మీ తాతయ్యను"

నిజమే!

నాయనమ్మ అన్నది నిజమే...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
24th episode