Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

టాలీవుడ్‌లో సెటిలైపోయిన రెజినా

rejeenaa setiled in tolly wood

తమిళ సినిమాల్లో నటించి, తెలుగు నిర్మాతల దృష్టిలో పడ్డ రెజినా, ‘శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. అక్కడినుంచి ఆమెకు అవకాశాలు ఎక్కువగానే వచ్చాయి, వస్తూనే ఉన్నాయి తెలుగు తెరపై. గ్లామర్‌ పరంగానూ, నటన పరంగానూ మంచి మార్కులేయించుకుంటూ సినిమా సినిమాకీ తన రేంజ్‌ని పెంచుకుంటూ పోతోంది రెజినా.

ఇటీవలే వచ్చిన ‘రారా కృష్ణయ్య’ సినిమాలో నటించిన రెజినా చేస్తోన్న పెద్ద సినిమా ‘పవర్‌’. రవితేజ ఈ సినిమాలో హీరో. ‘పవర్‌’ సక్సెస్‌ అయితే హీరోయిన్‌గా తన రేంజ్‌ ఇంకా పెరుగుతుందని రెజినా భావిస్తోంది. ఇప్పటివరకూ అయితే ఆమె చిన్న సినిమాల హీరోయిన్‌ మాత్రమే. ‘పవర్‌’ సినిమాతో పెద్ద సినిమాల హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునే ఛాన్స్‌ ఉంది.

‘శంకర’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అనే మరో రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్న రెజినా, తమిళంలోనూ ఓ సినిమా చేస్తున్నప్పటికీ, తెలుగు సినిమాలకే ఆమె ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ‘పవర్‌’ హిట్‌ అయితే, టాలీవుడ్‌లో స్టార్‌ యంగ్‌ హీరోల పక్కన కూడా రెజినా మెరవచ్చు. ఆ గ్లామర్‌ రెజినాలో చాలానే ఉంది. టైమ్‌ కలసిరావాలంతే.

మరిన్ని సినిమా కబుర్లు
sreenu as promissing