Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rejeenaa setiled in tolly wood

ఈ సంచికలో >> సినిమా >>

ప్రామిసింగ్‌గానే వున్నాడీ శీను

sreenu as promissing

నిర్మాత బెల్లంకొండ సురేష్‌ కుమారుడు శ్రీనివాస్‌ ‘అల్లుడు శ్రీను’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అన్ని విధాలా శిక్షణ ఇప్పించి శ్రీనివాస్‌ని రంగంలోకి దించారు నిర్మాత బెల్లంకొండ సురేష్‌. కమర్షియల్‌ సినిమాల్ని రూపొందించడంలో దిట్ట అయిన వినాయక్‌ చేతిలో పడ్డంతో శ్రీనివాస్‌ ఇంకా రాటుదేలాడు. డాన్సుల్లో సూపర్బ్‌గా కనిపిస్తున్నాడతను.

సాంగ్‌ టీజర్స్‌ ప్రామిసింగ్‌గా ఉండడంతోపాటు స్క్రీన్‌ ప్రెజెన్స్‌ కూడా బావుందన్న టాక్‌తో శ్రీనివాస్‌ తండ్రి బెల్లంకొండ సురేష్‌ హ్యాపీగా ఉన్నారు. పబ్లిసిటీ చేయడంలో బెల్లంకొండకు సాటి ఇంకెవరూ రారేమో. తన కుమారుడే కావడంతో ‘అల్లుడు శీను’ పబ్లిసిటీ పరంగా ఎంత రేంజ్‌కి వెళ్ళాలో అంత రేంజ్‌కి బెల్లంకొండ తీసుకెళ్ళగలరు.

కావాల్సిందల్లా సినిమాకి పోజిటివ్‌ టాక్‌. విడుదలకు ముందే అది స్ప్రెడ్‌ అయ్యింది సినీ వర్గాల్లో. సమంత గ్లామర్‌, ఆమె గోల్డెన్‌ లెగ్‌ ఇమేజ్‌ ఎలాగూ ఉన్నాయి కాబట్టి, ‘అల్లుడు శీను’ ఇప్పటికైతే ప్రామిసింగ్‌గానే అనిపిస్తున్నాడు. ‘అల్లుడు శీను’గా శ్రీనివాస్‌ తొలి సినిమాతోనే హిట్‌ కొట్టాలని ఆశిద్దాం

మరిన్ని సినిమా కబుర్లు
madhura sridhar as producer ' om mangalam mangalam '