Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
madhura sridhar as producer ' om mangalam mangalam '

ఈ సంచికలో >> సినిమా >>

మీనా గ్రాండ్‌ రీ`ఎంట్రీ

meenaa's grand ree entry

బాల నటిగా తెరంగేట్రం చేసిన మీనా, తెలుగులో ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన మీనా, గతంలో వెంకటేష్‌తో ‘సూర్యవంశం’, ‘అబ్బాయిగారు’, ‘సుందరకాండ’ వంటి చిత్రాల్లో నటించింది. ఆమె తాజాగా వెంకటేష్‌తో నటించిన ‘దృశ్యం’ సినిమా మంచి విజయాన్నే సాధించింది.

‘దృశ్యం’ విజయంతో వెంకటేష్‌ ` మీనా సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌ అని ఇంకోసారి ప్రూవ్‌ అయ్యింది. సీనియర్‌ హీరోయిన్లు వయసయ్యాక మళ్ళీ సినిమాల్లో నటించినా సూపర్‌ హిట్‌ కొట్టడం అరుదు. వయసుకు తగ్గ పాత్ర చేసిన మీనా, నటిగానూ, స్క్రీన్‌ ప్రెజెన్స్‌లోనూ తనకు సాటిలేరన్పించుకుంది.

సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నా రీ`ఎంట్రీ చాలా గ్రాండ్‌గా వుండడంతో మీనాని పలువురు అభినందిస్తున్నారు. అవకాశాలొస్తే చాలనుకోకుండా, వచ్చిన అవకాశాల్లో మంచి పాత్రలను ఎంచుకోవడమే మీనా సక్సెస్‌ సీక్రెట్‌ అని చెప్పొచ్చు. ‘దృశ్యం’ మలయాళ వెర్షన్‌ (ఇదే ఒరిజినల్‌) మీనా హీరోయిన్‌గా నటించింది.

మరిన్ని సినిమా కబుర్లు
when acting midyabalan in telugu movie?