Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

క్యాబేజీ పెసరపప్పు కూర - పి. శ్రీనివాసు

క్యాబేజీ పెసరపప్పు కూర

కావలిసిన పదార్ధాలు:

క్యాబేజీ
పెసరు పప్పు (10 నిముషాలు నానబెట్టాలి)
పచ్చిమిర్చి
నూనె
ఆవాలు
జీలకర్ర
పసుపు
ఉప్పు
శనగపప్పు

తయారు చేసే విధానం:
బాణాలిలో నూనె పోసి, ఆ నూనె కాగాకా ఆవాలు, జీలకర్ర. పచ్చిమిర్చి, పసుపు, శనగపప్పు వేసి అవి వేగాకా  నానబెట్టిన పెసర పప్పును వేసి బాగా కలిపి తరువాత క్యాబేజీని వేసి కలపాలి. తరువాత ఉప్పు వేసి  10 నిముషాలు మూతపెట్టాలి. ఆ ఉప్పంతా నీరుగా మారి క్యాబేజీని ఉడికిస్తుంది. ఈ నీరంతా ఇంకాకా క్యాబేజీని పొడి పొడిగా అయ్యేవరకూ ఉంచాలి. అంతే వేడి వేడి క్యాబేజీ పెసర పప్పు కూర రెడీ!!...

మరిన్ని శీర్షికలు
Gunde Ootalu(naaneelu)