Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
duradrustapu dongalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం (జూలై 18- జూలై24) - శ్రీకాంత్

మేష రాశి

ఈవారం మొత్తంమీద  ఆరంభంలో ఆలోచనలతో సతమత మయ్యే అవకాశం కలదు.  పెద్దల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి వారి సూచనలు పరిగణలోకి తీసుకోండి మంచిది. భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను చూపించే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన ఉద్యోగంలో అందరిని కలుపుకొని వెళ్ళండి. కుటుంభంలో సభ్యులతో కలిసి చేసిన చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చును. స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండుట మంచిది అనుభవజ్ఞుల సూచనలు మేలుచేస్తాయి. మిత్రులతో కలిసి తీసుకొనే నిర్ణయాలు పెద్దగా లబ్దిని చేకూర్చక పోవచ్చును. ప్రయాణాల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

 

 

 

వృషభ రాశి

ఈవారం మొత్తంమీద నూతన పనులను చేపట్టుటలో ఆసక్తిని కలిగి ఉంటారు. బంధుమిత్రులతో కలిసి విందులలో పాల్గొనే అవకాశం కలదు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది అధికారుల నుండి చిన్న చిన్న సమస్యలు కలిగినను వాటిని విజయవంతంగా అధిగమిస్తారు. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. కుటుంభంలో సంతానం మూలాన సమస్యలు తప్పకపోవచ్చును కొన్ని కొన్ని కటినమైన నిర్ణయాలు తీసుకొనే  అవకాశం ఉంది. వ్యాపారంలో నిర్ణయాలు తీసుకొనే ముందు అనుభవజ్ఞుల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయవలసి రావోచ్చును మిత్రులను కలుస్తారు వారితో చర్చల్లో పాల్గొనే అవకాశం కలదు.   

 


మిథున రాశి

...... ఈవారం మొత్తంమీద ఆరంభం బాగుంటుంది తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయల్లో ఆశించిన విధంగా మంచి ఫలితాలు పొందుటకు ఆస్కారం ఉంది. బంధుమిత్రులతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారంలో నూతన ఆలోచనలు కలిగి ఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టుటకు అనుకూలమైన సమయం కాకపోతే నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట మంచిది. ఉద్యోగంలో అధికారులతో కలిసి చేసిన చర్చల్లో ఊహించని ఫలితాలు వచ్చుటకు ఆస్కారం కలదు. కుటుంభంలో అనుకోని సంగటనలు చోటుచేసుకునే ఆస్కారం కలదు. మిత్రుల సహాకారం పొందుతారు వారితో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు.

 

కర్కాటక రాశి

......ఈవారం మొత్తంమీద ఆరంభంలో కుటుంభంలో పెద్దల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు కొన్ని కొన్ని విషయాల్లో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో అధికారుల నుండి ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం కలదు వారికి అనుగుణంగా నడుచుకొనుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు చేయకపోవడం సూచన అనుభవజ్ఞుల సూచనలు పాటించే ప్రయత్నం చేయుట ఉత్తమం. ప్రయాణాలు చేయునపుడు స్వల్ప సమస్యలు ఎదుర్కొంటారు వీలయితే వాయిదా వేయుట సూచన. దైవసంభందమైన పూజలకు సమయం ఇవ్వడం సూచన. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి మనోదైర్యంతో ముందుకు వెళ్ళడం వలన మేలుజరుగుతుంది.   

 

సింహ రాశి

......ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు విందులలో పాల్గొనే అవకాశం కలదు. మాటలు పొదుపుగా వాడుట సూచన ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం సూచన. స్వల్ప అనారోగ్యసమస్యలు తప్పక పోవచ్చును తగిన జాగ్రత్తలు చేపట్టుట వలన మేలుజరుగుతుంది. ఊహించని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ప్రయాణాలు చేయవలసి రావోచ్చును దూరప్రదేశం నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం కలదు. ఉద్యోగంలో పనిభారం తప్పక పోవచ్చును సమయపాలన అవసరం తోటిఉద్యోగులను కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. జీవితభాగస్వామితో నిదానంగా వ్యవహరించుట సూచన కొన్ని విషయల్లో సర్దుకుపొండి మంచిది.  

 

కన్యా రాశి

......ఈవారం మొత్తంమీద నలుగురిలో ఆశించిన విధంగా గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేస్తారు నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ముందు పెద్దల సూచనలు పాటించుట సూచన. వ్యాపారంలో వారం చివరలో కొంత ఆశించిన విధంగా ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది అధికారుల నుండి చిన్న చిన్న సమస్యలు తప్పక పోవచ్చును. వ్యతిరేక వర్గం నుండి వచ్చు ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం కలదు. ప్రణాలికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. కుటుంభంలో మార్పులు వచ్చుటకు ఆస్కారం కలదు వాటిని అర్థం చేసుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. చిననాటి మిత్రులను కల్సుకొనే అవకాశం ఉంది వారితో సమయం గడుపుతారు.    

 

తులా రాశి

 .......ఈవారం మొత్తంమీద ఉత్సాహంతో పనులను చేపడుతారు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళడం వలన విజయంను పొందుతారు. నలుగురిలో మీరు ఆశించిన విధంగా గుర్తింపును పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో చేసిన ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. పెద్దల నుండి వచ్చిన సూచనలు,సలహాలను పాటించుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి అధికారుల నుండి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. విందులలో పాల్గొనేందుకు ఇష్టపాడుతారు వాటిలో పాల్గొనేందుకు ఆసక్తిని చూపిస్తారు.   

 

వృశ్చిక రాశి

.......ఈవారం మొత్తంమీద ఉత్సాహంతో ఒకవార్త మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తుంది మానసికంగా దృడంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. పనులలో శ్రమ తప్పకపోవచ్చును నిదానంగా ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. ప్రయాణాలు చేయునపుడు జాగ్రత్తగా వ్యవహరించుట సూచన పెద్దల సహాకారం ఆశించే అవకాశం ఉంటుంది. తలపెట్టిన పనులను వారం చివరలో విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంటుంది. దూరప్రదేశం నుండి నూతన సమాచరం తెలుసుకుంటారు మిత్రుల ద్వార సమాచారం తెలుసుకొనే అవకాశం కలదు. కుటుంభంలో సభ్యులతో చర్చలు జరుగునపుడు నిదానంగా వ్యవహరించుట సూచన మాటపట్టింపులకు పోకపోవడం ఉత్తమం. పెద్దలతో పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారి మూలాన కొంత లబ్దిని పొందుటకు అవకాశం కలదు.   

 

ధనస్సు రాశి

......ఈవారం మొత్తంమీద కుటుంభంలో స్వల్ప మార్పులు కలుగుటకు అవకాశం ఉంది జీవితభాగస్వామితో చిన్న చిన్న విబేదాలు కలుగుటకు అవకాశం ఉంది నిదానంగా వ్యవహరించుట సూచన. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. వ్యాపారంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు పెట్టుబడులు పెట్టునపుడు మాత్రం అనుభవజ్ఞుల సూచనల ప్రకారం నడుచుకోండి. అశుభవార్తను వినే అవకాశం ఉంది మానసికంగా దృడంగా ఉండే ప్రయత్నం చేయుట ఉత్తమం. తలపెట్టిన పనులను వారం చివరలో పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో గుర్తింపును పొందుతారు వారికి అనుగుణంగా నడుచుకొనుట మూలాన మేలుజరుగుతుంది. వ్యాపారంలో స్వల్ప నష్టం ఎదురయ్యే అవకాశం ఉంది కావున పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది వేచిచూసే మేలుచేస్తుంది.

 

 

 

మకర రాశి

......ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది,నూతన ప్రయత్నాలు వాయిదా వేయుట సూచన. తలపెట్టిన పనులను మధ్యలో ఆపివేసే అవకాశం ఉంది అనుభవజ్ఞుల సలహాల మేర నడుచుకోండి ఉత్తమం. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి లేకపోతే ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న ఆటంకాలు తప్పక పోవచ్చును. కుటుంభంలో సభ్యుల మధ్య అవగాహన అవసరం పెద్దలతో పరిచయాలు అవుతాయి మీ ఆలోచనలను వారితో పంచుకొనే అవకాశం కలదు. వారం చివరలో వినే ఒక వార్త మూలాన ఊరట చెందుతారు. విదీశీప్రయాణాలు కలిసి వస్తాయి వాటికోసం చేయు ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. తండ్రి తరుపు వారితో విబేదాలు రాకుండా చూసుకోండి సర్దుబాటు అవసరం.   

 


కుంభ రాశి

......ఈవారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయంలో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు నిదానం అవసరం. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారితో సమయం గడుపుటకు అవకాశం కలదు. అనారోగ్యం వలన సమస్యలు తప్పక పోవచ్చును సరైన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. ప్రయాణాలు చేయునపుడు జాగ్రత్తగా వ్యవహరించుట సూచన వీలయితే వాయిదా వేయుట మంచిది. కుటుంభంలో తీసుకొనే నిర్ణయాలు కీలమైనవిగా ఉంటవి కావున బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుకోని ఖర్చులు కలుగుటకు ఆస్కారం కలదు వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. ఆరంభం బాగుంటుంది తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ప్రయాణాలు చేయునపుడు జాగ్రత్తలు అవసరం అవసరమైతే వాయిదా వేయుట మంచిది.   

 

.      

మీన రాశి

........ఈవారం మొత్తంమీద ఆరంభంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ఉద్యోగంలో మీవైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు పనిభారం తప్పక పోవచ్చును. తోటిఉద్యోగులను కలుపుకొని ముందుకు వెళ్ళుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో ధనము సకాలంలో చేతికి అందుట వలన ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోండి నిదానంగా ముందుకు వెళ్ళుట సూచన. కొన్ని కొన్ని విషయాల్లో తీవ్రమైన నిరాశను పొందుటకు అవకాశం ఉంది కావున దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. ఇష్టమైన పనులకు సమయం కేటాయిస్తారు నచ్చిన పనులకు సమయం ఇవ్వడం సూచన. కుటుంభంలో పెద్దల నుండి నూతన విషయాలను తెలుసుకుంటారు చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. 
శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
sahiteevanam