Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chiru also same rute

ఈ సంచికలో >> సినిమా >>

ఆమె అందానికి ఎదురే లేదు

beauty for ever

అందానికి వయసుతో సంబంధం లేదని ఒకప్పుడు బాలీవుడ్‌ అందాల తార రేఖ నిరూపిస్తే, అదే దారిలో లేటు వయసులోనూ గ్లామర్‌ని పండిరచొచ్చని శ్రీదేవి నిరూపిస్తుంది. సినిమాల్లో విరివిగా కనిపించనప్పటికినీ చాలా కాలం తర్వాత సినిమాల్లోకి మళ్ళీ వచ్చిన శ్రీదేవి, కొన్ని సినిమా ఫంక్షన్లలోనూ, కొన్ని ఫ్యాషన్‌ షోలలోనూ కనిపిస్తూ తన అంద చందాల్ని ప్రదర్శిస్తోంది.

‘వావ్‌.. ఏమి అందం.. ఈ వయసులో కూడా..’ అని శ్రీదేవి గురించి అందరూ అనుకుంటున్నారు. అది ఆమె అందం గొప్పతనం. శ్రీదేవి అంటే అందం, ఆ అందానికి ఫిదా అవనివారుండరు. వయసెంతయినా మాకనవసరం.. ఆమె మా అందాల దేవత అంటారు ఆమెను అభిమానించేవారు.

హిందీ, తెలుగు సినీ పరిశ్రమలను తారగా ఏలిన శ్రీదేవి విరివిగా సినిమాల్లో నటించాలని ఆమె అభిమానులు కోరుతున్నప్పటికీ చాలాకాలం తర్వాత నటించిన ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ తప్ప ఇంకో సినిమాతో ఆమె ఈ మధ్యకాలంలో తెరపైకి రాలేదు. అభిమానుల కోరికను మన్నించి, తెరపై శ్రీదేవి మళ్ళీ వెలిగిపోయే రోజెన్నడు వచ్చేనోగానీ, ఈలోగా ఆమె ఫ్యాషన్‌ షోలలోనూ, ఇతరత్రా కార్యక్రమాల్లోనూ కనిపించి తన అందచందాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నది.

మరిన్ని సినిమా కబుర్లు
whoes that heroyin ?