Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
beauty for ever

ఈ సంచికలో >> సినిమా >>

ఎవరా హీరోయిన్‌ ఏమా కథ?

whoes that heroyin ?

హీరోయిన్‌ని దాచేయడం అనేది ‘వరుడు’ సినిమా విషయంలో చూశాం. సినిమా విడుదలకు ముందు ఆ సినిమాలో హీరోయిన్‌ ఎవరో ఎవరికీ తెలియదు. భాను శ్రీ మెహ్రా హీరోయిన్‌గా నటించింది ఆ సినిమాలో. సినిమా విజయం సాధించకపోవడంతో భాను శ్రీ మెహ్రా తెలుగు తెరపై పెద్దగా కనిపించలేదు.

అదే కాన్సెప్ట్‌ కాకపోయినా ఓ కొత్త తరహా కథ అంటూ ‘ఓ క్రిమినల్‌ ప్రేమకథ’ అనే సినిమాకి కూడా హీరోయిన్‌ని దాచేస్తున్నారు. పి. సునీల్‌కుమార్‌రెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో అందరూ చర్చించుకుంటున్నారంటే, కారణం సినిమా పోస్టర్స్‌ అని చెప్పకతప్పదేమో. హీరోయిన్‌ని ఇప్పటివరకు చూపించలేదు పూర్తిగా. కాన్సెప్ట్‌ ఏమిటో? అని తలా ఒక రీతిన అనుకోవడమే జరుగుతోంది తప్ప, ఇదీ కథ అనే విషయం బయటకు రాలేదు.

ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో కూడా సినిమా హీరోయిన్‌ని రివీల్‌ చేయకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. హీరోయిన్‌ ఎవరనేది తెలియకుండా ఎందుకు ఉంచారు? ఆమె ఫేస్‌ని ఎందుకు కనిపించకుండా చేస్తున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం సినిమా విడుదలయ్యాకగాని తెలియదు. అప్పటి వరకు సస్పెన్స్‌ తప్పదు. ఈ సస్పెన్స్‌ కారణంగానే సినిమాపై ఆసక్తి పెరుగుతోన్నది.

మరిన్ని సినిమా కబుర్లు
extraordinary govindudu