Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
whoes that heroyin ?

ఈ సంచికలో >> సినిమా >>

ఈ గోవిందుడు మామూలోడు కాడు

extraordinary govindudu

‘గోవిందుడు అందరివాడేలే’ అనే ఎట్రాక్టివ్‌ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్న రామ్‌చరణ్‌, ఈసారి కూడా హిట్‌ కొట్టే అవకాశం ఉందని సినీ వర్గాలంటున్నాయి. ‘రచ్చ’, ‘నాయక్‌’, ‘ఎవడు’ సినిమాలతో రామ్‌చరణ్‌ వేగానికి ఎదురే లేకుండా పోతోంది. రొటీన్‌ సినిమాలే చేస్తున్నాడనే విమర్శలకు బ్రేక్‌ వేసి, కృష్ణవంశీతో రామ్‌చరణ్‌ ఓ కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని చేశాడు.. అదే ‘గోవిందుడు అందరివాడేలే’.
సినిమాకి మొదట్లో కొంచెం నెగెటివ్‌ టాక్‌ (ప్రీ రిలీజ్‌) స్ప్రెడ్‌ అయ్యింది. కాని సినిమా బిజినెస్‌ జరుగుతున్న తీరు చూసి పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. రికార్డు రేట్లతో సీడెడ్‌ వంటి చోట్ల బిజినెస్‌ జరుగుతోందట. ట్రెయిలర్‌ సూపర్బ్‌గా వచ్చిందని నిర్మాత బండ్ల గణేష్‌ ధీమాగా ఉన్నాడు. అదే ధీమా బయ్యర్లలో కూడా కలగడంతో, ఎంతైనా వెచ్చించి సినిమాని సొంతం చేసుకుంటున్నారని అర్థమవుతోంది.
సినిమా ఎలా ఉంటుందో.. అన్న అనుమానాలనుంచి, సినిమా ఖచ్చితంగా హిట్‌ అవుతుందనే రేంజ్‌కి ‘గోవిందుడు అందరివాడేలే’ టాక్‌ స్ప్రెడ్‌ అయ్యిందంటే ఈ గోవిందుడు అలాంటిలాంటోడు కాదు, ఆ క్రెడిట్‌ చరణ్‌కి ఉన్న ఇమేజ్‌దే అనడంలో సందేహమేముంది?

మరిన్ని సినిమా కబుర్లు
bunny also impressed