Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
extraordinary govindudu

ఈ సంచికలో >> సినిమా >>

బన్నీ కూడా ఇంప్రెస్‌ అయ్యాడు

bunny also impressed

టాలెంట్‌ ఎక్కడుంటే అక్కడ హీరోలు వాలిపోవడం సాధారణం. కమర్షియల్‌ సినిమాలు తీసే స్టామినా ఉన్న దర్శకుడి వెంట యంగ్‌ హీరోలు పరుగులు తీస్తున్నారిప్పుడు. అందుకే ఓ విజయవంతమైన కమర్షియల్‌ సినిమా ఎవరన్నా తీస్తే, ఆ యంగ్‌ డైరెక్టర్‌కి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

అలా రామ్‌తో ‘కందిరీగ’ తీసిన దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ ఇప్పుడు ఎన్టీఆర్‌తో ‘రబస’ సినిమా చేస్తున్నాడు. ‘రబస’ సినిమా విడుదల కావడానికి ముందే మంచి టాక్‌ తెచ్చుకుంది ఇండస్ట్రీలో. సంతోష్‌ సినిమాని సూపర్బ్‌గా హ్యాండిల్‌ చేస్తున్నాడనే వార్తలతో కొందరు యంగ్‌ హీరోలు సంతోష్‌ శ్రీనివాస్‌తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్‌ చూపించారు.

బన్నీ (అల్లు అర్జున్‌) అయితే సంతోష్‌ శ్రీనివాస్‌తో ‘సినిమా చేద్దాం’ అని కమిట్‌ అయిపోయాడట కూడా. ‘రభస’ తర్వాత బన్నీ ` సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో సినిమా అనౌన్స్‌ అవనుందని తెలుస్తున్నది. ‘తిక్కరేగితే’ అనే పేరును దాదాపుగా ఖాయం చేశారట కూడా ఈ సినిమాకి. కంప్లీట్‌ డిటెయిల్స్‌ కొన్ని రోజుల్లో తెలుస్తాయి.

మరిన్ని సినిమా కబుర్లు
nagesh naradasi boom boom in post production