Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణ మూర్తి

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________

 

ఓ టీనేజ్ గర్ల్ బేంకు దొంగతనం లో పాల్గొంది. ఎవరూ తన మొహాన్ని గుర్తుంచుకోకూడదని ఆమె సీ-త్రూ బ్లౌజ్ ని బ్రా లేకుండా వేసుకుని ఆ దొంగతనానికి బయలుదేరింది. ఆమె బయటకి వచ్చాక 'ఇన్ డీ సెంట్ బికని పోజఋ మీద పోలీసులు ఆమెని అరెస్ట్ చేసారు.
ఆమె బేంకు దొంగతనం ఇంకో నేరం కూడా చేసిందని పోలీసులకి తెలిసింది.

 


కేలిఫోర్నియాలోని అప్లాండ్ అనే ఊరికి చెందిన ఓ దొంగ బేంకు కేషియర్ కి ' మర్యాదగా డబ్బివ్వు .లేదా కాల్చేస్తానూ అని రాసిన కాగితాన్ని ఇచ్చాడు. పక్క కేషియర్ లైన్ లో క్యూలో ఉన్న ఆ కేషియర్ తండ్రి తన కూతురు మొహం లోని భయాన్ని, ఆమె చెక్కు తీసుకోకుండా దొంగకి డబ్బివ్వడం గుర్తించి, ఆ దొంగ మీదకి దూకి, పోలీసులు వచ్చేదాకా అతని మీంచి కదలకుండా కూర్చున్నాడు. 

మరిన్ని శీర్షికలు
kakoolu