Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

లేట్‌ అయినా లెక్కలు సరిచేస్తాడు

slow and study

ప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. అని మహేష్‌బాబు ఓ సినిమాలో డైలాగు చెప్తాడు. ప్రభాస్‌ అభిమానులు కూడా అదే అంటున్నారు. ఎంత లేట్‌గా వచ్చామన్నది కాదు, ఎంత పెద్ద హిట్‌ కొట్టామన్నది ముఖ్యం అని ప్రభాస్‌ అభిమానులు తమ అభిమాన హీరో చిత్రం ‘బాహుబలి’ గురించి చాలా ధీమాగా చెప్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో రానున్న ‘బాహుబలి’పై తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని అంచనాలున్నాయి. ఇప్పటిదాకా కెరీర్‌లో ఫెయిల్యూర్‌ అన్న పదానికి చోటివ్వలేదు రాజమౌళి. అలాంటి రాజమౌళితో ప్రభాస్‌ ఇదివరకు ‘ఛత్రపతి’ అనే సినిమా చేశాడు. అది పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు రానున్న ‘బాహుబలి’ తెలుగు సినిమా రికార్డులనే కాక, ఇండియన్‌ సినిమా రికార్డుల్ని కూడా తిరగరాసేలా ఉంటుందనే అంచనాలైతే పెరుగుతున్నాయి.

వచ్చే ఏడాదిలో విడుదల కానున్న ‘బాహుబలి’లో రాణా, అనుష్క ఇతర ప్రధాన పాత్రల్లో కన్పిస్తారు. ‘బాహుబలి’ ఓ సినిమా మాత్రమే కాదు, ఇది ఓ విజువల్‌ ఫీస్ట్‌, టెక్నికల్‌ వండర్‌ అని తెలుగు సినిమాలో అందరూ భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే, సినిమాపై ఉన్న అంచనాల్ని మించేలానే రాజమౌళి సినిమాని రూపొందిస్తున్నాడు కూడా. నిర్మాణంలో లేట్‌ అయినా లేటెస్ట్‌ రికార్డుల్ని ‘బాహుబలి’ సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని సినిమా కబుర్లు
mega-reentry