Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
slow and study

ఈ సంచికలో >> సినిమా >>

మెగా రీ`ఎంట్రీ ఖాయమైంది

mega-reentry

రాజకీయాల్లో ఎలా ఉన్నా, సినిమా రంగంలో చిరంజీవి స్థానం అలానే ఉందని ఇప్పటికీ అంటారు. చిరంజీవి తర్వాత ఎవరు? అనడిగితే వన్‌ టు టెన్‌ ఖాళీ, ఆ తర్వాతే ఎవరైనా అని చెప్పడం ద్వారా చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నాడో యువ స్టార్‌ హీరో. కానీ చిరంజీవి సినిమాల్ని వదిలి వెళ్ళాక చాలా మార్పులొచ్చాయి. తెలుగు సినిమా తీరు మారింది. లెక్కలూ మారిపోయాయి. ఈ టైమ్‌లో చిరంజీవి రీ`ఎంట్రీ ఇస్తున్నారు సినిమాల్లోకి.

చిరంజీవి రీ`ఎంట్రీ ఇవ్వబోయే సినిమాకి రంగం సిద్ధమైనట్లుగా తెలియవస్తున్నది. వినాయక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. పుట్టినరోజునాడు అన్నయ్యకు స్క్రిప్ట్‌ వినిపించబోతున్నా, అదే రోజు అన్ని విషయాలూ ఫైనల్‌ అవుతాయని దర్శకుడు వినాయక్‌ చెప్పారు. కథ రెడీ అయితేనే వినాయక్‌ ఇంత ధీమాగా చెప్పగలరు.

రామ్‌చరణ్‌ తన తండ్రి చిరంజీవి సినిమాకు నిర్మాతగా వ్యవహరించనుండగా, వీలైనంత త్వగా సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందని వినికిడి. ఆగస్ట్‌ నెలాఖరుకల్లా చిరంజీవి నటించే సినిమా డిటెయిల్స్‌ తెలుస్తాయి. ఇది చిరంజీవికి 150వ సినిమా.

మరిన్ని సినిమా కబుర్లు
Priyanka likes hard work