Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cherry sky walk

ఈ సంచికలో >> సినిమా >>

సమంత తర్వాతే ఎవరైనా

after samanta every body

తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ ఇప్పుడు సమంత మాత్రమే. రేసులో తమన్నా పోటీ పడినా, అనుష్క, నయనతార వంటివారు అత్యధిక పారితోషికం అందుకుంటున్నప్పటికీ సమంతకి ఉన్నంత సక్సెస్‌ రేట్‌గానీ, ఆమెకున్నంత బిజీగానీ తెలుగులో ఇతర హీరోయిన్లెవరికీ లేదనడం అతిశయోక్తి కాకపోవచ్చు.

గ్లామర్‌ పరంగానూ, పెర్ఫామెన్స్‌ పరంగానూ, ‘లక్‌’ పరంగానూ సమంతని తెలుగులో దర్శక నిర్మాతలు ప్రత్యేకంగా చూస్తున్నారు. అదే సమంతకి తెలుగులో పోటీ లేకుండా చేసిందనవచ్చేమో. హిందీ సినిమాల్లోకి వెళ్ళడం ద్వారా తమన్నా, కాజల్‌ తెలుగులో తమకున్న ఫాలోయింగ్‌ని కాస్త తగ్గించుకున్నారు. హిందీకి వెళ్ళినా, తెలుగులో వారు సినిమాలు చేస్తున్నప్పటికీ సమంతలా వారెవరూ సరిగ్గా అందుబాటులో ఉండటంలేదన్న వాదన ఉంది.

తెలుగుతోపాటే తమిళ సినిమాలు కూడా చేస్తున్న సమంత, హిందీ సినీ పరిశ్రమకు మాత్రం వెళ్ళదట. హిందీ నుంచి ఆఫర్లు వస్తున్నా, హిందీ సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని తమన్నా అంటోంది. ఆమె చుట్టూ కొన్ని వివాదాలు (‘1’ సినిమా పోస్టర్‌పై కామెంట్‌ చేయడం) వచ్చినప్పటికీ, అవి సమసిపోయాయి. సినిమా పబ్లిసిటీకి తనవంతు సహాయపడటం కూడా సమంతకి ప్లస్‌ అయ్యింది.

మరిన్ని సినిమా కబుర్లు
Boochamma Boochodu  movie release on august 1st