Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
after samanta every body

ఈ సంచికలో >> సినిమా >>

ఆగ‌స్టు 1న విడుద‌ల అవుతున్న బూచ‌మ్మ - బూచోడు

Boochamma Boochodu  movie release on august 1st

శివాజీ క‌థానాయ‌కుడిగా స్నేహా మీడియా & హెజ‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా తెర‌కెక్కించిన చిత్రం బూచ‌మ్మ బూచోడు. రాగిణి ఎమ్‌.ఎమ్‌.ఎస్ ఫేమ్ కైనాజ్ మోతివాలా క‌థానాయిక‌. గుణ‌శేఖర్ దగ్గ‌ర ద‌ర్శ‌కత్వ శాఖ‌లో  ప‌నిచేసిన రేవ‌న్ యాదు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ర‌మేష్ అన్నంరెడ్డి - ప్ర‌సాద్ రెడ్డి నిర్మాత‌లు. నిర్మాణానంత కార్య‌క్ర‌మాలు పూర్త‌యి, తొలి కాపీ సిద్ధ‌మైంది. ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 1న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా శివాజీ మాట్లాడుతూ ''సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఎంట‌ర్‌టైన్ మెంట్‌తో సాగుతూనే ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ క‌లిగిస్తాం. బూచ‌మ్మ బూచోడు అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. క‌థ, క‌థ‌నాలు ఓ హైలెట్ అయితే... దాన్ని ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దిన విధానం మ‌రో హైలెట్‌'' అన్నారు.

ద‌ర్శ‌కుడు చెబుతూ ''రాజ్ భాస్క‌ర్ అందించిన సంగీతం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. నేప‌థ్య సంగీతం కూడా క‌థ‌కు అనుగుణంగానే సాగుతుంది. శివాజీ, నిర్మాత‌ల స‌హ‌కారంతో అనుకొన్న‌ది అనుకొన్న‌ట్టు తీర్చిదిద్దా. త‌ప్ప‌కుండా మా టీమ్‌కి మంచి పేరొస్తుంద‌న్న న‌మ్మకం ఉంది. కైనాజ్ మోతీవాలా త‌న గ్లామ‌ర్‌తోనూ, న‌ట‌న‌తోనూ అందరినీ ఆక‌ట్టుకొంటుంద‌''న్నారు. బ్ర‌హ్మానందం, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిషోర్‌, తాగుబోతు ర‌మేష్ న‌టించారు.

క‌థ‌, మాట‌లు:  సాయికృష్ణ‌
కెమెరా:  విజ‌య్ మిశ్రా
సంగీతం:  రాజ్ భాస్క‌ర్‌
సాహిత్యం: శ్రీ‌మ‌ణి
కూర్పు: ప‌్ర‌వీణ్ పూడి
నిర్మాత‌లు: ర‌మేష్ అన్నంరెడ్డి , ప్ర‌సాద్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం:  రేవ‌న్ యాదు

మరిన్ని సినిమా కబుర్లు
nuvvalaa nenila movie release on august 8th